Krishna Chaitanya
-
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్యాంగ్ స్టర్ మూవీ కాదు: దర్శకుడు
‘గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని దర్శకుడు కృష్ణ చైతన్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కంటే ముందే నేను దర్శకత్వం వహించాల్సిన సినిమాలు ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అవి అలస్యం అయ్యాయి. చాలా గ్యాప్ రావడంతో నాలో భయం మొదలైంది. ఇదే విషయాన్ని త్రివిక్రమ్‌తో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ సేన్‌కి కథ చెప్పగా.. అది ఆయనకు నచ్చడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది.⇒ ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.⇒ విశ్వక్ సేన్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.⇒ మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.⇒ యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.⇒ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.⇒ మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మార్చిలో గోదావరి గ్యాంగ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటించగా, నటి అంజలి ముఖ్యమైనపాత్రను పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి, ఇన్మమూరి గోపీచంద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత డిసెంబరు 8న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే 2024 మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘‘చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథతో ఈ చిత్రం రూపొందింది. అతని ప్రయాణంలో రాజకీయ చిక్కులు కూడా ఉంటాయి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాడి. -
తేడాలొస్తే...
‘మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం’ అంటున్నారు విశ్వక్ సేన్.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ హీరోగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రంలోని డైలాగ్ ఇది. ఈ చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్‌ని ఖరారు చేసినట్లు ప్రకటించి, యూనిట్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్‌లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. ‘‘క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్ చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. నేహా శెట్టి కథానాయికగా, అంజలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాది. -
డిసెంబరులో ఘంటసాల ది గ్రేట్
ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. గాయకుడు కృష్ణ చైతన్య టైటిల్ రోల్ చేయగా, ఘంటసాల భార్య సావిత్రి ఘంత్రను మృదుల చేశారు. ‘ఘంటసాల ఘంటశాల’ సంకలనకర్త సీహెచ్ రామారావు దర్శకత్వంలో గాయకుడు జీవీ భాస్కర్ నిర్మాణ సారథ్యంలో ఫణి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సీహెచ్ రామారావు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారి గురించి తెలియని చాలా విషయాలను ఈ సినిమాలో చూపించనున్నాం. ఘంటసాలగా కృష్ణచైతన్య సరి΄ోయారని గతంలో ఎస్పీ బాలుగారు అన్నారు. అదే మా తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి ఘంత్ర చేయడం నా అదృష్టం’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘2018లోనే ఈ సినిమా టీజర్‌ను ఎస్పీ బాలుగారితో రిలీజ్ చేయించాం. అయితే ఘంటసాలగారి కుటుంబంతో కొన్ని లీగల్ సమస్యలొచ్చాయి. ఇప్పుడు వాళ్లే ఈ సినిమాకు స΄ోర్ట్ ఇస్తున్నారు’’ అన్నారు జీవీ భాస్కర్. చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్ ఘంల్గొన్నారు. -
వరస సినిమాలు తో దూసుకుపోతున్న విశ్వక్
-
విశ్వక్ సేన్ కొత్త సినిమా.. 30 ఏళ్లు వెనక్కి..
విశ్వక్సేన్ హీరోగా నటించనున్న కొత్త చిత్రం బుధవారం ఆరంభమైంది. తొలి సీన్‌కు నిర్మాత సుధాకర్ చెరుకూరి కెమెరా స్విచాన్ చేయగా నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. నిర్మాత వెంకట్ బోయనపల్లి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వెంకీ అట్లూరి, నిర్మాత రామ్ ఆచంట స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రమిది. 1990వ దశకంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా అనిత్ మధాది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నాడు. కాగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రానికి అతడే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. -
‘కథ వెనుక కథ’ వాయిదా
విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సంస్థ దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌పై అవనీంద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కథ వెనుక కథ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ సందర్బంగా ... సహ నిర్మాత సాయి గొట్టిపాటి మాట్లాడుతూ ‘‘మా కథ వెనుక కథ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాలతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. త్వరలోనే మంచి రిలీజ్ డేట్ చూసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’ అన్నారు. -
కథ వెనుక కథ టీజర్ చూశారా?
విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్ నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ ఆసక్తిగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించి, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందించాలనే ఆలోచనతో దండమూడి బాక్సాఫీస్ సంస్థని స్థాపించాను. తొలి చిత్రంగా సస్పెన్స్, థ్రిల్ నేపథ్యంలో ‘కథ వెనుక కథ’ తీశాం. సిటీలో జరుగుతున్న హత్యలకు ఓ వ్యక్తి కారణం కాదు, ఓ గ్యాంగ్ అని పోలీసాఫీసర్ సత్య ఎలా తెలుసుకుంటాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. -
కృష్ణ చైతన్య–మహేశ్ జోడీకి స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య–మహేశ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో కృష్ణ చైతన్య–మహేశ్ ద్వయం 22–24, 23–21, 15–11తో కృష్ణంరాజు–నరేశ్ (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. 2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు–నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన కృష్ణ చైతన్య ఏడేళ్ల తర్వాత అదే జంటను ఓడించి ఈసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం. 2015 కేరళ జాతీయ క్రీడల్లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈసారి మహేశ్‌తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. కనోయింగ్‌లో 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తెలంగాణకు చెందిన అమిత్ కుమార్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమిత్ రేసును 4ని:31.533 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో రోహిత్ మోర్ (ఢిల్లీ)పై గెలిచాడు. -
పొలిటికల్ డ్రామా షురూ
వెండితెరపై పొలిటికల్ టర్న్ తీసుకున్నారు శర్వానంద్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా, ప్రియమణి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శకులు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
జగన్ బొమ్మ చూపించు నాయనా.. బామ్మ ఆప్యాయత
శ్రీకాకుళం : పోలాకి మండలం ప్రియాగ్రహారంలో జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యకు శుక్రవారం ఓ హృద్యమైన అనుభవం ఎదురైంది. పార్టీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్తూ కోరాడ అమ్మాయమ్మ(84) ఇంటికి వెళ్లారు. బామ్మా నీకు పింఛన్ వస్తుందా.. అని అడిగితే.. ‘ఆ వస్తుంది గానీ నాకు జగన్ బొమ్మ చూపించు నాయనా..!’ అని ఆప్యాయంగా అడి గింది ఆ బామ్మ. దీంతో కృష్ణచైతన్య సీఎం చిత్రాన్ని బామ్మకు చూపించగా ఆమె మురిసిపోయారు. వేలిముద్ర పడకపోయినా సచివాలయం నుంచి ఒక వ్యక్తి వచ్చి పింఛను ఇస్తున్నారని ఆమె చెప్పి దీవించారు. -
టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్’పై ..శాప్ నెట్ చైర్మన్ కృష్ణ చైతన్య ఫైర్ అయ్యారు
-
అద్దంకిలో టీడీపీ బరితెగింపు..
అద్దంకి: అద్దంకిలో టీడీపీ బరితెగించింది. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తన కారులో ఎక్కించుకువచ్చి నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. టీడీపీ ఎమ్మెల్యే దిగజారుడుతనాన్ని వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణచైతన్య విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 8వ వార్డులో వైఎస్సార్సీపీ తరఫున ఇద్దరు, టీడీపీ తరపున ఇద్దరు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కాగా టీడీపీ తరపున 8వ వార్డుకు నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు అదే రోజున స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ తరఫున 8వ వార్డుకు పోటీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ తరపున బీఫారం తీసుకుని నామినేషన్ వేసిన అభ్యర్థి పరశురాంను ఉపసంహరణ సమయానికి ఒక నిమిషం మాత్రమే సమయం ఉండగా తన సొంత కారులో తీసుకుని వచ్చి నామినేషన్‌ను ఉపసంహరణ చేయించారు. ఆధారాలున్నాయి, సీరియస్‌గా తీసుకుంటాం.. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన చెంచు గరటయ్య ఖండించారు. 8వ వార్డుకు మా పార్టీ తరఫున బీ ఫారం ఇచ్చిన ఎస్టీ అభ్యర్థిని ప్రలోభపెట్టి తన కారులో ఎక్కించుకుని వచ్చి నామినేషన్ ఉపసంహరణ చేయించడం దారుణమని మండిపడ్డారు. రెండేళ్లుగా ఇంట్లో కూర్చోని ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకొని ఎమ్మెల్యే రవికుమార్..ఇప్పుడు చంద్రబాబు వద్ద షో చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 8వ వార్డుకు నామినేషన్లు వేసిన మీ అభ్యర్థులు వారే వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకోవడం నీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, ఈ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ మా దగ్గరున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని పేర్కొన్నారు. మిగిలిన 19 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి చంద్రబాబు మాట.. అబద్ధాల మూట కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది.. -
‘కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకొస్తాం’
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడకు చెందిన కృష్ణ చైతన్య స్వీడన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. నాలుగు రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయడంతో కృష్ణ చైతన్య మృతదేహం స్వీడన్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ విజయసాయి రెడ్డి సహకారంలో విదేశాంగ మంత్రి, భారత ఎంబసీతో మాట్లాడి కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని వంగా గీతా భరోసానిచ్చారు. (జనతా కర్ఫ్యూకు యంగ్ టైగర్ సైతం.. ) -
నితిన్ పవర్‌పేట
నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ‘పవర్‌పేట’ అనే టైటిల్ ఖరారైంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. గత ఏడాది నితిన్ – కృష్ణచైతన్య కాంబినేషన్లో ‘ఛల్ మోహన్ రంగ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా నటించిన ఇష్క్ (2012), ‘గుండెజారి గల్లంతయ్యిందే’ (2013), ‘అ ఆ’ సినిమాలకు కృష్ణచైతన్య పాటలు రాశారు. మరోవైపు ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న ‘భీష్మ’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు నితిన్. అలాగే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న ‘చదరంగం’, వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘రంగ్ దే’ చిత్రాలతో నితిన్ వచ్చే ఏడాది వేసవి వరకు ఫుల్ బిజీ. -
సైకలాజికల్ థ్రిల్లర్
అరుణ– కళ్యాణి టాకీస్ పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఒకడు’. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. అఖిల్‌రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ మాస్టర్ క్లాప్‌నివ్వగా, సత్య మాస్టర్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్‌ను దర్శకుడు బీవీయస్ రవి దర్శకునికి అందించారు. ఈ సందర్బంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ – ‘‘ఇది నా మొదటి చిత్రం. అందరూ అనుభవం ఉన్న టెక్నీషియన్లతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకులు మణిశర్మ గారు స్వరాలందించడం హ్యాపీ. మొత్తం ఐదు ఫెడ్యూల్స్లో సినిమా పూర్తి చేస్తాం ఈనెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమా మంచి మెసేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర నిర్మాత ముత్తయ్య అన్నారు.‘‘నేను చేస్తున్న మొదటి సినిమాకు మంచి స్క్రిప్ట్ కుదిరింది. మంచి సైకలాజికల్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు అఖిల్‌రెడ్డి. -
మూడు మూవీలాట!
చెప్పాల్సిన కథ ఒక్క సినిమాలోనే సరిపోనప్పుడు రెండు భాగాలుగా డివైడ్ చేసి, తెరకెక్కిస్తారు దర్శకులు. ‘బాహుబలి, ఎన్టీఆర్’.. ఇలా రెండు భాగాలుగా రూపొందిన సినిమాలున్నాయి. లేటెస్ట్గా మూడు భాగాల చిత్రాన్ని అందించడానికి రెడీ అయ్యారు దర్శకుడు కృష్ణ చైతన్య, హీరో నితిన్. ‘రౌడీ ఫెల్లో, ఛల్ మోహన్ రంగ’ సినిమాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు పొందారు పాటల రచయిత కృష్ణ చైతన్య. నితిన్ సొంతబ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై తాజా చిత్రం రూపొందనుంది. ‘‘మొదటి భాగం పూర్తి కథను నితిన్‌కు నరేట్ చేశారు కృష్ణచైతన్య. మిగతా రెండు పార్ట్స్ అవుట్‌లైన్ వినిపించారు. చిత్రకథలో హీరో, హీరోయిన్, మిగతా పాత్రలన్నింటికీ కూడా ఒకేలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. ఎమోషనల్‌గా సాగే ఈ డ్రామా డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్తుంది’’ అని చిత్ర సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదో మాస్ సబ్జెక్ట్ అని, ‘పవర్ పేట’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త ప్రచారంలో ఉంది. ‘నా కెరీర్లో చాలెంజింగ్ సినిమా ఇది’ అని నితిన్ ఆల్రెడీ ట్వీటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలుగులో మూడు భాగాలుగా తెరకెక్కబోతోన్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. -
నితిన్ కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్
శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్.. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ను ప్రకటించాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన నితిన్.. తాజాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు పవర్ పేట అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు నితిన్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా 2020 సమ్మర్లో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించానున్నారు. -
నితిన్ బర్త్ డే గిఫ్ట్.. లైన్లోకి మరో ప్రాజెక్ట్
ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టిన యంగ్ హీరో నితిన్, తన పుట్టిన రోజు సందర్భంగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మా సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాను కూడా త్వరలో ప్రారంభించనున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకు రాకముందే ఈ రోజు మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. తనతో ఛల్ మోహన్ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టుగా తెలిపాడు నితిన్. ఈ సినిమాను సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించనున్నాడు. 2020 సమ్మర్లో ప్రారభం కానున్న ఈ ప్రాజెక్ట్ తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన సినిమా అని ట్వీట్ చేశాడు నితిన్. Announcement 3 My most ambitious and challenging film of my career!!super duper kicked about it..✊ Dir krishna Chaitanya Prod sreshth movies Shoot starts frm year end and summer 2020 release!! pic.twitter.com/F5cf6yKDsb — nithiin (@actor_nithiin) 29 March 2019 -
ఘంటసాలగారిలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు
‘‘ఘంటసాలగారికి సంబంధించిన నిజాలు చాలామందికి తెలియవు. ఆయన పాటలే కాదు.. ఆయన వ్యక్తిత్వం గురించి ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా సి.హెచ్.రామారావు దర్శకత్వంలో ‘ఘంటసాల’ సినిమా తెరకెక్కుతోంది. గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో, ఆయన సతీమణి మృదుల ఘంటసాల సతీమణి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సంగీతంలో పద్యాలు ఎలా పాడాలో నాకు నేర్పించింది ఘంటసాలగారే. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిత్వంలో కూడా ఎంత వినయంగా ఉండాలి, ఎలా సంస్కారంగా ఉండాలనే విషయాలను ఆయన దగ్గరే నేర్చుకోవాలి. కృష్ణుడంటే భారతం.. రామాయణం అంటే రాముడు.. పాటలంటే అందరికీ ఘంటసాలగారు గుర్తొస్తారు. సినిమాల్లోకి రాక మునుపు ఆయన స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఆయనతో కలిసి ఆరేళ్ల పాటు జర్నీ చేసి, ఐదారు సినిమాలకు పనిచేశా. ఘంటసాలగారిని నా తండ్రి సమానుడిగా భావిస్తా. ఆయన విగ్రహావిష్కరణ సమయంలో నేను పడ్డ కష్టాలెన్నో నాకే తెలుసు. ఆయనలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు. ఘంటసాల తర్వాతే.. ఎవరైనా గొప్పగా పాడుతున్నారని అంటారు. కానీ.. ఆయనంత గొప్పగా పాడుతున్నారని చెప్పరు. చెప్పలేరు.. చెప్పకూడదు కూడా. ఈ చిత్రం సెన్సార్ కావడానికి ముందే ఘంటసాలగారి భార్య సావిత్రమ్మకు సినిమా చూపించి ఏమైనా మార్పులుంటే చేస్తే మంచిది’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి బయోపిక్ ఘన విజయం సాధించాలి’’ అని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ‘‘ఘంటసాలగారిపై సినిమా చేస్తే నేనే చేయాలనే స్వార్థంతోనే ఈ సినిమా చేశా. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు సి.హెచ్.రామారావు. ‘‘ఘంటసాలగారితో పోల్చదగ్గ వ్యక్తి బాలసుబ్రహ్మణ్యంగారు మాత్రమే’’ అని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. -
గుండెను తడిమేలా ఘంటసాల ది గ్రేట్
‘‘ఘంటసాల అంటే పాట. పాట అంటే ఘంటసాల అని మనందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియజేసేదే ఈ చిత్రం’’ అని ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రబృందం పేర్కొంది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. ఘంటసాల పాత్రను గాయకుడు కృష్ణచైతన్య పోషించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో ఆయన సతీమణి లక్ష్మీ నీరజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్స్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. డిసెంబర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి తుమ్మల రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘‘రామారావు చేసిన ఈ సాహసాన్ని అభినందించాలి. పాత్రల గురించి బాగా స్టడీ చేసి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘బయోపిక్‌లు తీయడం చాలా కష్టం. గట్స్ ఉండాలి. ఇందులో హీరోగా ఓ పాత్ర చేశాను. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా రామారావు వర్క్ చేశారు’’ అన్నారు సాయి వెంకట్. ‘‘గొప్ప విజయాలను నమోదు చేయడమే కాకుండా గుండె తడి చేసి, గుండెను తడిమేసే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అన్నారు సుదర్శన్. ‘‘నేను చాలా చిన్నవాణ్ని. మొదట ఈ సినిమా చేయకూడదనుకున్నా. ఇప్పుడు అలా ఎందుకు అన్నానా అనిపిస్తోంది. ఘంటసాలగారి పాటలు విన్నాం. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసు. ఈ సినిమాలో ఆయన వ్యక్తిత్వం తెలియజేస్తున్నాం’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘ఘంటసాలగారి మీద ఆరాధనతో ఈ సినిమా తీశాను. మా కష్టాన్ని అభినందిస్తారనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు వాదనల. -
వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పనామా వద్ద ఉన్న రైతు చికెన్ బజార్లో పనిచేస్తోన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గిరి అనే వ్యక్తి, చికెన్ షాపులో పనిచేస్తోన్న కృష్ణ చైతన్య(30) అనే వ్యక్తిని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేసి పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఛల్ మోహన్ రంగ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఛల్ మోహన్ రంగ జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నితిన్, మేఘ ఆకాష్, లిజి, నరేష్, ప్రగతి, నర్రా శ్రీను, మదు నందన్ సంగీతం : తమన్ ఎస్ కథ : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం : కృష్ణ చైతన్య నిర్మాత : పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి హీరోగా మంచి ఫాలోయింగ్ సాధించినా.. వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు యంగ్ హీరో నితిన్. అ..ఆ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత లై సినిమాతో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఛల్ మోహన్ రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతేకాదు ఈ సినిమాను నితిన్ అభిమాన హీరో పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి నిర్మించటం విశేషం. త్రివిక్రమ్ స్వయంగా కథ అందించిన ఈ సినిమా నితిన్ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టిందా..? పవన్, త్రివిక్రమ్‌లు నిర్మాతలుగా మారి తెరకెక్కించిన ఈ సినిమా విజయం సాధించిందా..? కథ : మోహన్ రంగ (నితిన్) ఓ మధ్య తరగతి కుర్రాడు. చిన్నతనంలో తనకు పరిచయం అయిన అమ్మాయి అమెరికా వెళ్లిందని తెలుసుకొని ఎలాగైన అమెరికా వెళ్లాలని ఆ వయసులోనే నిర్ణయించుకుంటాడు. తరువాత అమ్మాయి విషయం మర్చిపోయినా అమెరికా ఆశతోనే పెరిగి పెద్దవాడవుతాడు. మూడుసార్లు వీసా రిజెక్ట్ కావటంతో ఇండియాలో చనిపోయిన ఓ పెద్దావిడ శవాన్ని అమెరికా తీసుకెళ్లే కారణం చూపించి వీసా సంపాదిస్తాడు. అమెరికా వెళ్లిన మోహన్ రంగ ముందు కాస్త ఇబ్బంది పడినా ఫైనల్ గా ఓ మంచి జాబ్ సాధిస్తాడు. ఈ ప్రయత్నాల్లోనే మేఘ సుబ్రమణ్యం (మేఘ ఆకాష్) అనే అమ్మాయితో రంగకు పరిచయం అవుతుంది. (సాక్షి రివ్యూస్) తల్లి చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మేఘ.. రంగ వ్యక్తిత్వం నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. రంగ కూడా మేఘను ఇష్టపడతాడు. కానీ ఇద్దరి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు వేరు కావటంతో ప్రేమ గురించి ఒకరితో ఒకరు చెప్పుకోకుండానే దూరమవుతారు. మేఘ తల్లితో పాటు ఇండియా వచ్చేస్తోంది. రంగ కూడా మేఘను మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కొంత కాలం తరువాత మేఘను ఒక్కసారి కలవాలని ఇండియాకు వస్తాడు మోహన్ రంగ. రంగ వచ్చే సరికి మేఘ ఏ పరిస్థితుల్లో ఉంది..? రంగ తన ప్రేమను మేఘకు చెప్పాడా..? వాళ్లిద్దరు ఒక్కటయ్యారా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతున్న నితిన్ ఈ సినిమాలో మరింత పరిణతి కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రేమకు దూరమైన యువకుడిగా బాధను చూపిస్తూనే కామెడీతో అలరించాడు. పవన్ వీరాభిమాని అయిన నితిన్ ఈ సినిమాలో కూడా పవన్ స్టైల్స్‌ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఈ సారి మెగా స్టార్ చిరంజీవి అభిమానులను కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. తొలి సినిమాలో బబ్లీగా కనిపించిన మేఘకు ఈ సినిమాలో కాస్త నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది. తొలి భాగం అల్లరి అమ్మాయిగా కనిపించిన మేఘ, సెకండ్ హాఫ్‌లో ప్రేమకు దూరమైన ప్రియురాలిగానూ మెప్పించింది. (సాక్షి రివ్యూస్) అదే సమయంలో కామెడీతోనూ ఆకట్టుకుంది. హీరో తండ్రిగా నరేష్, తల్లిగా ప్రగతి, హీరోయిన్ తండ్రిగా సంజయ్ స్వరూప్‌లు రొటీన్ పాత్రలో కనిపించారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సీనియర్ నటి లిజి హీరోయిన్ తల్లి పాత్రలో హుందాగా కనిపించింది. ఇతర పాత్రల్లో నర్రా శ్రీను, మదునందన్, శ్రీనివాస్, ప్రభాస్ శ్రీను, సత్యలు కామెడీ తో ఆకట్టుకున్నారు. విశ్లేషణ : రౌడీఫెలో సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య... ఛల్ మోహన్ రంగతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన రొటీన్ కథను తనదైన కథనంతో ఆసక్తికరంగా చూపించాడు. ముఖ్యంగా గేయ రచయిత అయిన కృష్ణచైతన్య డైలాగ్స్ తో సినిమా రేంజ్ ను పెంచాడు. కృష్ణ చైతన్య సంభాషణల్లో చాలా సార్లు త్రివిక్రమ్ కనిపిస్తాడు. ముఖ్యంగా ప్రాసలు, పంచ్‌ల విషయంలో త్రివిక్రమ్‌నే ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ప్రేమ, తరువాత మనస్పర్థలు, బ్రేకప్, తిరిగి కలవటం ఇది గతంలో తెలుగు తెర మీద చాలా సార్లు వచ్చిన కథే అయినా.. కథకు తీసుకున్న నేపథ్యం, సంభాషణలు ఆడియన్స్‌ను అలరిస్తాయి. (సాక్షి రివ్యూస్) అయితే అక్కడక్కడా కథనం నెమ్మదించటం ఇబ్బంది పెడుతుంది. తమన్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. న్యూయార్క్ సిటీని కలర్‌ఫుల్ గా చూపించిన సినిమాటోగ్రాఫర్ ఊటి అందాలను అంతే అద్భుతంగా చూపించారు. ఎటిడింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ డైలాగ్స్ నితిన్ నటన మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘ఛల్ మోహన్ రంగ’ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్