విశ్వక్‌ సేన్‌ కొత్త సినిమా.. 30 ఏళ్లు వెనక్కి.. | Vishwak Sen Next with Director Krishna Vamsi, Movie Launched | Sakshi
Sakshi News home page

Vishwak Sen: రాజమండ్రి కథ ఆధారంగా విశ్వక్‌ సేన్‌ కొత్త సినిమా!

Published Thu, Apr 27 2023 6:53 AM | Last Updated on Thu, Apr 27 2023 6:53 AM

Vishwak Sen Next with Director Krishna Vamsi, Movie Launched - Sakshi

విశ్వక్‌సేన్‌ హీరోగా నటించనున్న కొత్త చిత్రం బుధవారం ఆరంభమైంది. తొలి సీన్‌కు నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కెమెరా స్విచాన్‌ చేయగా నిర్మాత దిల్‌ రాజు క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత వెంకట్‌ బోయనపల్లి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వెంకీ అట్లూరి, నిర్మాత రామ్‌ ఆచంట స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రమిది.

1990వ దశకంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తుండగా అనిత్‌ మధాది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నాడు. కాగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్‌ ఇటీవలే దాస్‌ కా ధమ్కీ సినిమాతో హిట్‌ అందుకున్నాడు. ఈ చిత్రానికి అతడే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement