నితిన్‌ హీరోగా భారీ చిత్రం | Nitin To Team Up With Bengal Tiger Producer KK Radhamohan | Sakshi
Sakshi News home page

నితిన్‌ హీరోగా భారీ చిత్రం

Published Wed, Feb 8 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

నితిన్‌ హీరోగా భారీ చిత్రం

నితిన్‌ హీరోగా భారీ చిత్రం

‘అఆ’ చిత్రం తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకున్న నితిన్‌ ఇప్పుడు రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోన్న చిత్రంతో పాటు  కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఆ రెండు చిత్రాలు సెట్స్‌పైన ఉండగానే నితిన్‌ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్‌ టైగర్‌’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన కె.కె.రాధామోహన్‌ హీరో నితిన్‌తో భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రాధామోహన్‌ మాట్లాడుతూ – ‘‘నితిన్‌తో ఓ సూపర్‌హిట్‌ సినిమా తీయాలని కథ తయారు చేస్తున్నాం. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్‌ నటిస్తున్న రెండు సినిమాల తర్వాత ఆగస్ట్‌లో మా చిత్రం ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement