KK Radhamohan
-
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు
‘‘క్రేజీ ఫెలో’ సినిమాకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మౌత్ టాక్ చాలా బాగుంది’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ విజయం యూనిట్ అందరిది. మా బ్యానర్ ద్వారా ఆదికి మంచి సక్సెస్ ఇచ్చినందుకు హ్యాపీ’’ అన్నారు ‘‘మంచి సినిమా వస్తే థియేటర్‌కి వస్తామని ‘క్రేజీ ఫెలో’తో మరోసారి రుజువు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు ఫణికృష్ణ. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్. ∙మిర్నా మీనన్, ఆది, దిగంగన, రాధామోహన్, ఫణికృష్ణ -
క్రేజీ ఫెలో కోసం బరువు తగ్గాను
‘‘క్రేజీ ఫెలో’ని ఎంజాయ్ చేస్తూ, చేశాను. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ మూవీ చూశామనే అనుభూతి కలిగిస్తుంది’’ అన్నారు ఆది సాయికుమార్. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా కేకే రాధామోహన్ నిర్మించిన ‘క్రేజీ ఫెలో’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు... ► చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే యువకుడి పాత్రను ‘క్రేజీ ఫెలో’లో చేశాను. ఫణికృష్ణ చాలా మంచి కథ రాసుకున్నాడు. ఈ చిత్రంలో ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. కామెడీ టైమింగ్‌లోనూ ఫణి స్పెషల్ కేర్ తీసుకున్నాడు. సినిమా పట్ల అందరం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాం. కథలో సెకండాఫ్ మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్రెష్ లుక్ ట్రై చేశాను.. బరువు తగ్గాను. ► నేను హీరోగా చేసే కొన్ని సినిమాల కథలను నాన్న (నటుడు సాయికుమార్)గారు వింటారు. ‘క్రేజీ ఫెలో’ కథ విని, హ్యాపీ ఫీలయ్యారు. నాన్నగారి అభిప్రాయం తీసుకోకుండా నేను చేసిన కొన్ని సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. ‘గాలిపటం’ సినిమా కథ బాగుంది కానీ క్లయిమాక్స్ కాస్త మార్చితే బాగుంటుందని నాన్నగారు సలహా ఇచ్చారు. కానీ మేం ఒప్పుకోలేదు. ఆడియన్స్ ఆ క్లయిమాక్స్ ఒప్పుకోలేదు. ఇలా నాన్నగారి జడ్జ్మెంట్ బాగుంటుంది. ► ప్రస్తుతం ‘టాప్ గేర్’, ‘సీఎస్ఐ: సనాతన్’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘పులి–మేక’ అనే వెబ్ సిరీస్ చేశాను. నవంబరులో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావొచ్చు. ‘అమరన్ ఇన్ సిటీ’ సినిమా షూటింగ్ ఇరవై శాతం పూర్తయింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా ఆగింది. -
ఇప్పుడు అదే పెద్ద సవాల్
‘‘నేను కాంబినేషన్‌ని కాదు.. కథని బలంగా నమ్ముతాను. ‘క్రేజీ ఫెలో’ బలమైన కథ. ఫణికృష్ణ కొత్తవాడైనా సినిమాని చక్కగా తీశాడు. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే క్లీన్ సినిమా ఇది’’ అని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ కథని ముందు ఆదికి వినిపించాడు ఫణికృష్ణ. ఆ తర్వాత నేను విన్నాను, నచ్చింది. ఈ సినిమాలో ఆది క్యారెక్టర్ క్రేజీగా, కొత్తగా ఉంటుంది. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు ఓటీటీకి అలవాటుపడ్డారు. అంతర్జాతీయ స్థాయి కంటెంట్ దొరుకుతుండటంతో వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడంతో పాటు వారిని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక–నిర్మాతలకు ఒక సవాల్‌గా మారింది. ‘క్రేజీ ఫెలో’ మంచి కంటెంట్ ఉన్న వినోదాత్మక చిత్రం.. ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారనే నమ్మకం ఉంది. నిర్మాతలకు ప్రస్తుతం రెవెన్యూ ఆప్షన్స్ పెరిగినప్పటికీ మిగిలేది ఏమీ లేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికంతో పాటు సినిమా నిర్మాణ ఖర్చులు పెరగడమే కారణం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇండస్ట్రీ కార్పొరేట్ స్టయిల్లో ఉంది.. నేను కూడా ఇలానే సినిమాలు చేయడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం ఆయుష్ శర్మ హీరోగా హిందీ సినిమా నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
క్రైమ్ థ్రిల్లర్ ఆరంభం
‘ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్’ వంటి హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఓ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. దర్శకుడు సంపత్ నంది వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన అశోక్ తేజ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. మా బ్యానర్లో ‘ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి నా¯Œ స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ అనుమోలు, సంగీతం: అనూప్ క్రియేటివ్స్, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సంపత్ నంది. -
కరోనా విరాళం
కృష్ణంరాజు, శ్యామలా దేవి – 10 లక్షలు (‘ పీయం కేర్స్’కు) (శ్యామలా దేవి పుట్టినరోజు ఏప్రిల్ 13న. ఈ సందర్భంగా 4 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే కృష్ణం రాజు, శ్యామల కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తీ, సాయి ప్రదీప్తీ తమ పాకెట్ మనీ నుంచి తలా రెండు లక్షలు తీసి 6 లక్షలను విరాళంగా ప్రకటించారు.) కె.కె. రాధా మోహన్ – 3 లక్షలు (సీసీసీ మనకోసం) వీకే నరేష్ – 11 లక్షలు ( ‘సీసీసీ మనకోసం’కి 1 లక్ష, ‘మా’లో 100 మంది సభ్యులను దత్తత తీసుకుని ఒక్కో సభ్యుని కుటుంబానికి 10 వేలు సాయం. ఇప్పటికే 58 కుటుంబాలకు వారి వారి బ్యాంకు ఖాతాలో 10 వేలు చొప్పున డిపాజిట్ చేశారు). ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త, దినేశ్ గుప్త, ఆదిత్య గుప్తలు కరోనాపై యుద్ధానికి – 31 లక్షలు విరాళం -
రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు
యంగ్ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఈ చిత్రానికి కొండా విజయ్‌కుమార్ దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముచ్చటించారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "ఒరేయ్ బుజ్జిగా’ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. థియేటర్లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. ఆ సమయానికి విద్యార్థులకు పరీక్షలు ముగిసి సెలవులు వస్తాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ గా నవ్వుకుని వెళ్లే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే సినిమా చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్, దర్శకుడు విజయ్ కుమార్‌కు ధన్యవాదాలు" తెలిపారు. ప్రమోషన్స్ వినూత్నంగా చేస్తున్నారు హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ.. ‘సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అని అంటారు. నాకు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సినిమా ఇంకా బాగా రావడానికి సహాయం చేశారు. విజయ్ కుమార్ సినిమా ఆరంభం నుంచి నాకు గైడింగ్ స్పిరిట్‌గా ఉన్నారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరికీ ఒక హ్యూగ్ ఇన్స్పిరేషన్. ఆయన వల్లే టీమ్ అందరం ఇంత బాగా పెర్ఫామ్ చేయగలిగాం. నిర్మాత రాధామోహన్ మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రాజ్ తరుణ్ మంచి ఈజ్‌తో నటించారు. ఆండ్రూతో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సినిమాలో మంచి హ్యూమర్ ఉంటుంది’ అన్నారు. (ఒరేయ్ బుజ్జిగా టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ సినిమా ఉగాది షడ్రుచిలా ఉంటుంది దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.."రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. కథకు ఏమి కావాలో అన్నీ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి తగిన సినిమా. మాళవిక నాయర్ నేచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా అని ఓన్ చేసుకొని అద్భుతంగా నటించారు. సినిమాలో అన్ని క్యారెక్టర్స్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆండ్రూ, అనూప్ ఇలా అందరు మంచి టెక్నీషియన్స్ కుదిరారు. ఏ జోనర్లో సినిమా చేయాలని మూడు సంవత్సరాలుగా నాలో నేను మధన పడి, ప్రేక్షకులందరూ పడిపడి నవ్వుకునే సినిమా చేయాలని ‘ఒరేయ్ బుజ్జిగా..’ చేశాం. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని అంశాలు ఉంటాయి' అన్నారు. టైటిల్ బాగా పాపులర్ అయింది చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ - "నేను, విజయ్ కుమార్ స్టార్ బక్స్లో కాఫీ తాగుతున్నప్పుడు ఈ కథ వినిపించారు. అక్కడ మొదలైన చిత్రం ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. మా ‘ఒరేయ్ బుజ్జిగా..’ టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికే విడుదలైన ‘కురిసెన, కురిసెన’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్, ఫ్యామిలీస్‌కు నచ్చే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పటివరకు సినిమా చూసిన వారుకూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉందని చెప్పారు. నంద్యాల రవి గారు మంచి డైలాగ్స్ రాశారు. అలాగే ఎడిటర్ ప్రవీణ్ చక్కగా ఎడిట్ చేశారు. విజయ్ కుమార్ గారు పక్కగా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల సినిమాకి అవసరమైన సన్నివేశాలే తీశారు. ఒరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దాని వల్ల వర్కింగ్ డేస్ తగ్గి నిర్మాతలకి మంచి జరుగుతుంది. ఈ సినిమాకి యంగ్ టీమ్ వర్క్ చేయడం వల్ల అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాకి బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. వాణి విశ్వనాధ్ హీరోయిన్ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. ఆమెకు కూడా తెలుగులో మంచి రీఎంట్రీ అవుతుంది. ఈ సినిమాకు మార్చి 14న కరీంనగర్లో, 19న తిరుపతిలో, 21 హైదరాబాద్‌లో మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాం. అలాగే 16 నుంచి ఖమ్మం, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌లో కాలేజ్ విజిట్స్ చేస్తున్నాం. ఇటీవలే అరకు, గుంటూరులో జరిగిన ఈవెంట్స్‌కు మేము అందరం వెళ్లాం' అన్నారు. తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది నటుడు మధుసూధన్ మాట్లాడుతూ.. ‘నిర్మాతకు ఇది ఎనిమిదవ సినిమా. ఆయన లక్కీ నెంబర్ కూడా ఎనిమిది. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది" అన్నారు. సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ మాట్లాడుతూ.. ‘విజయ్ కుమార్‌తో ఇది నా మూడవ సినిమా. ఈ సినిమాకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
ఒరేయ్.. బుజ్జిగా
‘ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్ టైగర్, పంతం’ వంటి హిట్ చిత్రాలు రూపొందించిన కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘ఒరేయ్.. బుజ్జిగా’. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. మాళవికా నాయర్ కథానాయికగా నటించనున్నారు. ఈ సందర్భంగా కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ– ‘‘రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్ కాంబినేషన్లో మా బ్యానర్లో ప్రొడక్షన్ నెం 8గా ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమా ప్రారంభించాం. మంగళవారం నుంచే నాన్ స్టాప్‌గా రెగ్యులర్ షూటింగ్ జరగుతుంది’’ అన్నారు. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ ఆండ్రూ బాబు, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్. -
ఆగస్ట్ నుంచి నాన్‌స్టాప్‌గా...
రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘అధినేత, ఏమైంది ఈ వేళ, బెంగాల్ టైగర్, పంతం’ వంటి మంచి హిట్ చిత్రాల తర్వాత మా బేనర్లో చేస్తున్న మరోమంచి కథా చిత్రమిది. ఆగస్ట్ నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుతాం’’ అన్నారు. ‘‘మూడేళ్లు కష్టపడి తయారు చేసిన కథ ఇది. కథ విని రాధామోహన్‌గారు వెంటనే సినిమా స్టార్ట్ చేద్దాం అన్నారు. రాజ్ తరుణ్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. నా దర్శకత్వంలో వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కంటే మంచి కథ ఇది’’ అని కొండా విజయ్‌కుమార్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఆండ్రూస్. -
రాజ్ తరుణ్ కొత్త సినిమా ప్రారంభం
యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా గుండె జారి గల్లంతయ్యిందే ఫేం కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం 8.30 గంటలకు జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ.. ‘అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్, పంతం లాంటి సినిమాల తర్వాత మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో చేస్తున్న మరో మంచి కథా చిత్రం ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్ కాంబినేషన్లో ఇది మా బేనర్‌కి మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది’ అన్నారు. దర్శకుడు కొండా విజయ్‌కుమార్ మాట్లాడుతూ... ‘మూడు సంవత్సరాల పాటు వర్క్ చేసి రెడీ చేసిన అద్భుతమైన ఈ కథను రాధామోహన్‌గారు విన్న వెంటనే స్టార్ట్ చేద్దాం అన్నారు. రాజ్ తరుణ్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. గుండెజారి గల్లంతయ్యిందే కంటే మంచి కథ ఇది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ రాధామోహన్‌గారి బేనర్లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. -
ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం
‘‘కల్కి’ మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్, హైప్ వచ్చాయి. ఆ క్రేజ్, కంటెంట్ చూసి ఈ సినిమాను పంపిణీ చేస్తున్నాం’’ అని నిర్మాత కె.కె. రాధామోహన్ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ చిత్రం విడుదల హక్కులను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని, విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. శ్రవణ్ భరద్వాజ్ బ్రహ్మాండమైన ట్యూన్స్, నేపథ్య సంగీతం అందించారు. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు ఉన్న ఈ సినిమా తప్పకుండా బాగుంటుంది. ఆ నమ్మకంతోనే ‘కల్కి’ని విడుదల చేస్తున్నాం. త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా మెయిన్ ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు. అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
నేను యాక్టర్‌ని.. క్రియేటర్‌ని కాదు
‘‘నేను శ్రీ రాఘవ అభిమానిని. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలన్నది నా కల. ఆ అవకాశం కోసం 19ఏళ్లుగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ‘ఎన్.జీ.కే’ రూపంలో ఆ అవకాశం దొరికింది. ఆయన అద్భుతమైన నటుడు. ఆయన చేసి, చూపించిన దాంట్లో మనం ఒక్క శాతం చేసినా చాలు’’ అన్నారు హీరో సూర్య. ‘గజిని, యముడు, సింగం’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘ఎన్.జీ.కే’ (నంద గోపాల కృష్ణ). ‘7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల ఫేమ్ శ్రీరాఘవ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్‌సింగ్, సాయి పల్లవి కథానాయికలు. ఎస్.ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడదల కానుంది. తెలుగులో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సూర్య పంచుకున్న విశేషాలు... ►శ్రీ రాఘవ వినిపించిన నాలుగు కథల్లో ‘ఎన్.జీ.కే’ బాగా నచ్చింది. అందుకే ఈ కథతో ముందుకెళ్లాం. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఏ ఒక్క రాష్ట్రానికీ సంబంధించినది కాదు. ఏ రాష్ట్రంలోని రాజకీయాలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. కానీ, మా సినిమాలో యూనివర్శల్ కాన్సెప్ట్ ఉంటుంది. మంచి డైలాగులు, ఎమోషన్స్, స్క్రీన్‌ప్లే ఉంటుంది. ముఖ్యంగా క్లయిమాక్స్ చాలా బాగుంటుంది. మా కథకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ►వ్యవస్థలో ఎన్నో లోపాలున్నాయి. ప్రతి ఒక్కరూ ఓట్లు వేయడానికి మాత్రం ముందుంటారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రశ్నించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. మనకెందుకులే అనుకుంటున్నారు. చదువుకున్నవారు, మేథావులే ఇలా ఆలోచిస్తే ఎలా? వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఒక సామాన్య యువకుడు రాజకీయ వ్యవస్థపై ఎలాంటి పోరాటం చేశాడు? లోపాల్ని ఎలా సరిదిద్దాడు? అన్నదే ‘ఎన్.జీ.కే’ కథ. రియాలిటీకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాం. ►రాఘవ ఓ కథని రెడీ చేయటానికి ఏడాది నుంచి ఏడాదిన్నర తీసుకుంటాడు. తనకెవరూ సపోర్టర్స్ లేరు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు... ఇలా అన్నీ ఒక్కడే రాసుకుంటాడు. అందుకే అంత టైమ్ తీసుకుంటాడు. ‘ఎన్.జీ.కే’ కేవలం శ్రీరాఘవ ఫిల్మ్. తన సినిమాల్లో పాటలు కూడా రెగ్యులర్‌గా ఉండవు. తనతో పని చేయడం ప్రతిరోజూ ఓ కొత్త అనుభూతి. దర్శకుడు బాలాసార్ స్కూల్ నుంచి నేను వచ్చాను. దర్శకత్వంలో బాలా, శ్రీరాఘవ ఎవరి శైలి వారిదే. శ్రీరాఘవతో పనిచేస్తున్నప్పుడు బాలా సార్‌తో పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ బాగా నటించారు. ►శ్రీరాఘవ ఒక్కోసారి ఏడెనిమిది టేక్‌లు తీస్తారు. ఆ రోజు సన్నివేశం సరిగ్గా రాలేదంటే మరుసటి రోజు కూడా అదే సీన్ చేయిస్తారు. అందుకే ఆయన టేక్ ఓకే అంటే అదే పెద్ద రిలీఫ్‌గా భావించేవాణ్ణి. ప్రతి రోజూ కొత్త డైరెక్టర్లా చేస్తారు. ఈ సినిమా కోసం ఆయన ఎటువంటి రాజకీయ రిఫరెన్సులు తీసుకోలేదు. చాలా పరిశోధించారు. కెమెరాముందు నేను మిమిక్రీ చేయడం లేదు. అందుకే శ్రీరాఘవ చేసి చూపించే ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుని నటించేవాణ్ణి. మా ‘ఎన్.జీ.కే’ సినిమాని చూడకుండా నమ్మకంతో తెలుగులో విడుదల చేస్తున్న రాధామోహన్ సార్‌కి థ్యాంక్స్. ►ఒక్కసారి కథ విన్నాక డైరెక్టర్ చెప్పినట్టు చేస్తా. ఎందుకంటే నేను యాక్టర్‌ని.. క్రియేటర్‌ని కాదు. నాకు నచ్చినట్టు కథ, డైలాగులు రాసుకోలేను. అమితాబ్ సార్ సినిమాల్లో కామెడీ ఉంటుంది. నటనకూ ప్రాధాన్యత ఉంటుంది. నా సినిమాల్లో ఈ రెంటికీ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటా. ►తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని నాకూ ఉంది. కానీ, కుదరడం లేదు. త్రివిక్రమ్‌గారితో సినిమా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు దర్శకురాలు సుద కొంగరతో (‘గురు’ ఫేమ్) సినిమా చేయడం మంచి అనుభూతి. ‘‘మా బ్యానర్లో ఇంతవరకు డబ్బింగ్ మూవీ రిలీజ్ చేయలేదు. కానీ, ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని ‘ఎన్.జీ.కే’ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. సూర్య, సాయిపల్లవి, రకుల్ జగపతిబాబుతో పాటు శ్రీ రాఘవ డైరెక్షన్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్.. ఇలా బెస్ట్ ఆర్టిస్ట్‌లు, బెస్ట్ టెక్నీషియన్స్‌తో రూపొందిన సినిమా ఇది. రాజకీయ నేపథ్యంలో మా బ్యానర్లో ‘అధినేత’ సినిమా వచ్చింది. అలాగే వేరే బేనర్లలో ‘లీడర్, భరత్ అనే నేను’ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. పొలిటికల్ సబ్జెక్ట్ అనేది యూనివర్శల్ కాబట్టి తప్పకుండా ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ ఉంటుంది. సూర్య ‘గజిని, యముడు, సింగం’ సినిమాల్లా ‘ఎన్.జీ.కే’ కూడా పెద్ద హిట్ అవుతుంది. – నిర్మాత రాధామోహన్ ప్రజల నమ్మకాన్ని జగనన్న నిలబెట్టుకుంటారు జగనన్నతో (వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి) నాకు చాలా సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. వైఎస్ కుటుంబంలోని అనిల్ రెడ్డి నా క్లాస్మేట్. సునీల్ రెడ్డి కూడా తెలుసు. అనిల్‌తో ఉన్న స్నేహం కారణంగా రాజకీయాలకు అతీతంగా వైఎస్ కుటుంబంతో నాకు మంచి సంబంధాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్‌గారు సాధించిన విజయం ఎంతో అద్భుతమైంది. వైఎస్సార్ (వైఎస్ రాజశేఖర రెడ్డి)గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు ఏపీ పాలిటిక్స్ గురించి తెలుసు. ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించాక ఆయన తనయుడు జగనన్న చేస్తున్న రాజకీయ పోరాటం గురించి అవగాహన ఉంది. పది సంవత్సరాల నుంచి ప్రజల మధ్యే ఉంటూ ఎంతో కష్టపడ్డారాయన. అన్ని రోజులు పాదయాత్ర చేయడం గ్రేట్. పైగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం అంటే ఇంకా గ్రేట్. అందుకే ప్రజలు కూడా భారీ విజయాన్ని అందించి, హిమాలయ పర్వతాలంత బాధ్యతను పెట్టారు. ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ, వాటిని నెరవేర్చుతారు. తక్కువ వయస్సు ఉండి ముఖ్యమంత్రి అయిన వారిలో జగన్ అన్న రెండో వార వడం నిజంగా గ్రేట్. కచ్చితంగా ఆయన సీఎంగా సక్సెస్ అవుతారు. ఈ ఒక్కసారి మాత్రమే కాదు.. మళ్లీ మళ్లీ ఎన్నో సంవత్సరాలు జగన్ అన్న సక్సెస్ అవుతారు’’ అన్నారు. ‘‘ఇక ‘యాత్ర 2’ సినిమాలో జగనన్న పాత్ర నేను చేయనున్నాననే వార్తలను నేను కూడా విన్నాను. ‘యాత్ర’కి మంచి టీమ్ కుదిరింది. ‘యాత్ర 2’ సినిమా గురించి ఇంతవరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. కథ ఆకట్టుకునే విధంగా ఉంటే కచ్చితంగా చేస్తాను.. అందులో డౌట్ లేదు’’ అని స్పష్టం చేశారు సూర్య. -
నా కెరీర్లో పంతం బెస్ట్
‘‘పంతం’ వంటి మంచి సినిమా చేశానని అందరూ అభినందిస్తున్నారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. సమాజానికి ఇలాంటి సందేశాలు కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు అభినందనలు అని చాలా మంది ఫోన్ చేశారు’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఎ కాస్’ అన్నది ఉప శీర్షిక. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చక్రి చెప్పింది చెప్పినట్లుగా ఈ సినిమా తెరకెక్కించారు. నా కెరీర్లో ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. రాధామోహన్‌గారు మంచి అవుట్‌పుట్ రావాలని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మరిన్ని సందేశాత్మక చిత్రాలు వస్తాయి’’ అన్నారు. ‘‘కథ వినగానే గోపీచంద్‌గారైతే సరిపోతారని ఆయనకు కథ చెప్పాం. ఆయన కోసమే ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా నిర్మించాం. చక్రి కొత్తవాడైనా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా తెరకెక్కించారు. మా బ్యానర్ విలువను పెంచే చిత్రమిది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి’’ అన్నారు కె.కె.రాధామోహన్. ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. గోపీచంద్‌గారితో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అన్నారు మెహరీన్. ‘‘కొత్తవాడినైన నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రాధామోహన్‌గారికి థాంక్స్. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కె.చక్రవర్తి. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, పాటల రచయిత భాస్కరభట్ల, రైటర్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లే రియల్ హీరోలు
‘‘టి. కృష్ణ మెమోరియల్ ప్రొడ్యూసర్ నాగేశ్వరరావుగారు నా దగ్గరికి గోపీచంద్‌ని తీసుకొచ్చారు. ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నట్లు గోపీచంద్ అన్నాడు. అందంగా ఉన్నాడు. మంచి వాయిస్. మన బ్యానర్లోనే గోపీచంద్ హీరోగా సినిమా తీద్దామనుకుని ‘తొలివలపు’ తీశాం. గోపీచంద్ 25వ సినిమా ‘పంతం’ పెద్ద హిట్ అవ్వాలి. తను వంద సినిమాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నా. రాధామోహన్ ఇంకా మంచి సినిమాలు తీయాలి’’ అని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పంతం’. కె.చక్రవరి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారు గ్రేట్ డైరెక్టర్. ఎనిమిదేళ్ల వయసులో తండ్రి చనిపోతే పిల్లలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. ఆ కష్టం తెలిసిన మనిషి గోపీచంద్. షూటింగ్స్‌లో నాకు ఎప్పుడూ వాళ్ల అమ్మగారి గురించి చెప్పేవాడు. వాళ్ల అమ్మ అంటే గోపీకి ఇష్టం. గోపీతో వర్క్ చేయడానికి వెరీ హ్యాపీ. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి నేను రెడీ’’ అన్నారు. ‘‘నాకు ఫస్ట్ చాన్స్ ఇచ్చిన గోపీచంద్‌గారికి రుణపడి ఉంటా. ‘లక్ష్యం, లౌక్యం’ చిత్రాల కంటే ‘పంతం’ ఇంకా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ శ్రీవాస్. ‘‘నాకు బ్రేక్ ఇచ్చిన సత్యసాయి ఆర్ట్స్ సంస్థ దర్శకుడు చక్రిగారికి కూడా పెద్ద బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు సంపత్ నంది. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు మోస్ట్ లవబుల్, కోపరేటివ్ హీరో. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. చక్రిగారికి ఇది తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న డైరెక్టర్లా చేశారు. ఆయనకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు మాటల రచయిత రమేశ్రెడ్డిగారు. ఈ నెల 5న ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది. యూఎస్‌లో జూలై 4న రిలీజ్ అవుతుంది. అది లాంగ్ వీకెండ్ కావడంతో పాటు 4న యూఎస్ ఇండిపెండెన్స్ డే. అందరూ మా సినిమాని ఆదరిస్తారనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన రాధామోహన్‌గారికి థ్యాంక్స్. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చిన గోపీచంద్సార్కి ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా’’ అన్నారు కె. చక్రవర్తి. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘నా 25 చిత్రాలకు పనిచేసిన దర్శకులందరికీ థ్యాంక్స్. నాలాంటి హీరోలను క్రియేట్ చేసేది ఈ హీరోలే (డైరెక్టర్లని చూపిస్తూ). వాళ్లు రాసుకున్న పాత్రల్లో మేం యాక్ట్ చేస్తాం. రియల్ హీరోస్ వీళ్లంతా. నా తొలి సినిమా ‘తొలివలపు’ నిర్మాత నాగేశ్వరరావుగా రు , దర్శకులు ముత్యాల సుబ్బయ్యగారు ఎంకరేజ్ చేయకుంటే ఈ రోజు నేను 25 సినిమాల ల్యాండ్ మార్క్ రీచ్ అయ్యేవాణ్ణి కాదు. ‘పంతం’ సినిమా స్టార్ట్ అవడానికి కారణమైన ప్రసాద్ మూరెళ్లగారికి, రమేశ్రెడ్డిగారికి థ్యాంక్స్. చక్రి తొలి రోజు ఏ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడో చివరి రోజూ అదే కాన్ఫిడెన్స్‌తో తన ‘పంతం’ నిరూపించుకుని చాలా బాగా చేశారు. తొలిరోజు నుంచి ఈరోజు వరకూ రాధామోహన్‌గారు ఒకే మాటపై నిలబడి ఉన్నారు. వెరీ జెన్యూన్ ప్రొడ్యూసర్. ఆయన లెక్క పక్కాగా ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. గోపీచంద్‌తో సినిమాలు చేసిన పలువురు దర్శకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
ఆ నమ్మకం నిజమవుతుంది
‘‘మా నాన్నగారు (దర్శకుడు టి. కృష్ణ) చేసిన సినిమాల్లాంటివి చేయాలనుకుంటున్న సమయంలో ఈ కథ కుదిరింది. నాకిది 25వ సినిమా. మంచి సామాజిక ప్రయోజనం ఉన్న కమర్షియల్ స్టోరీ కుదరడం ఆనందంగా ఉంది. కథని నమ్మి ఈ సినిమా చేశాను. పాటలు, టీజర్‌కి ఆల్రెడీ మంచి రెస్పా¯Œ ్స వచ్చాయి. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు గోపీచంద్. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా కేకే రాధామోహన్ నిర్మించిన ‘పంతం’ జూలై 5న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ చూశాక ‘పంతం’.. ఫర్ ఎ కాజ్.. అనే టైటిల్, ట్యాగ్‌లైన్ యాప్ట్ అనిపించింది. ట్రైలర్‌లోని డైలాగ్స్ సినిమా ఎలా ఉండబోతోందో చెబుతోంది. సామాజిక సమస్యను కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించిన సినిమాలన్నీ పెద్ద హిట్టయ్యాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సొంతం చేసుకుంటుందనిపిస్తోంది’’ అన్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘మా బ్యానర్లో ఇది ఏడో సినిమా. గోపీచంద్‌గారికి ప్రెస్టీజియస్ 25వ సినిమా. కొత్త డైరెక్టర్ ఎలా తీస్తాడో అనే డౌట్ ఉండేది. అయితే డిస్కషన్స్ స్టేజిలోనే నమ్మకం కుదిరింది. చక్రవర్తి అద్భుతంగా తెరకెక్కించారు. ప్రసాద్ విజువల్స్ ఎక్స్ట్రార్డినరీ’’ అన్నారు. ‘‘టీజర్, పాటలకు మంచి రెస్పా¯Œ ్స వచ్చింది. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు కె. చక్రవర్తి. ‘‘విజ యంపై పాజిటివ్‌గా ఉన్నాం’’ అన్నారు మెహరీన్. -
టీజర్ ఆన్ ది వే
గోపీచంద్ హీరోగా నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఏ కాస్’ అన్నది ఉపశీర్షిక. శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. ఇది గోపీచంద్‌కి 25వ సినిమా. ఈ సినిమా టీజర్‌ను జూన్ 5న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ సిల్వర్‌జూబ్లీ సినిమాను మా బ్యానర్లో నిర్మించడం ఆనందంగా ఉంది. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. లండన్‌లో పాటల షూట్ జరుగుతోంది. జూలై 5న సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
గోపిచంద్ ‘పంతం’ టీజర్.. ?
రణం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం లాంటి మంచి హిట్లు ఇచ్చిన హీరో గోపిచంద్. కానీ గత కొంత కాలంపాటు విజయాలు లేక వెనుకబడ్డాడు. గతేడాది ఆక్సిజన్, గౌతమ్‌నందా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అవి ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. లౌక్యం తరువాత ఆ స్థాయి హిట్ కోసం ప్రయత్నిస్తున్న ఈ హీరో ప్రస్తుతం ‘పంతం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను జూన్ 5 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కె. చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. -
ఫారిన్లో ఆటా పాట
గోపీచంద్ ‘పంతం’ ఎంతవరకూ వచ్చిందంటే.. ప్రస్తుతానికి లండన్ వెళ్లింది. కన్ఫ్యూజ్ అవ్వకండి.. ఆయన నటిస్తున్న ‘పంతం’ సినిమా గురించి చెబుతున్నాం. కె. చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా ‘పంతం’. ‘ఫర్ ఏ కాజ్’ అనేది ఉప శీర్షిక. ఇందులో మెహరీన్ కథానాయిక. ప్రస్తుతం పాటల కోసం ఫారిన్ వెళ్లారు టీమ్. అక్కడ రెండు పాటలను చిత్రీకరిస్తారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఊపందుకున్నాయి. డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. యాక్షన్‌తో పాటు, మంచి హాస్య సన్నివేశాలతో ఆడియన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నారు. పృథ్వీ, జయ ప్రకాశ్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గోపీసుందర్. -
గోపీచంద్ పంతం!
విలన్స్‌ను రఫ్పాడిస్తున్నారు హీరో గోపీచంద్. ఎక్కడ అంటే... హైదరాబాద్‌లోనే. ఎందుకంటే.. అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. చక్రి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా కేకే రాధామోహన్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెహరీన్ కథానాయిక. ఈ సినిమాకు ‘పంతం’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేయాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
నితిన్ హీరోగా భారీ చిత్రం
‘అఆ’ చిత్రం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రంతో పాటు కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఆ రెండు చిత్రాలు సెట్స్‌పైన ఉండగానే నితిన్ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన కె.కె.రాధామోహన్ హీరో నితిన్‌తో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘నితిన్‌తో ఓ సూపర్‌హిట్ సినిమా తీయాలని కథ తయారు చేస్తున్నాం. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న రెండు సినిమాల తర్వాత ఆగస్ట్‌లో మా చిత్రం ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం’’ అన్నారు. -
ఆ ముగ్గురితో మూడు సినిమాలు!
గోపీచంద్.. నితిన్.. నాగశౌర్య.. ఇప్పుడీ ముగ్గురు హీరోలతో విడి విడిగా మూడు సినిమాలు చేస్తున్నట్టు నిర్మాత కేకే రాధామోహన్ ప్రకటించారు. ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై పృథ్వీ, నవీన్ చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ నెలలోనే విడుదల కానుంది. జనవరిలో నాగశౌర్యతో సినిమా ప్రారంభిస్తారు. త్వరలో ఈ మూడు సినిమాల వివరాలను ప్రకటించనున్నారు. -
అన్నిటికీ సిద్ధపడే వచ్చాను!
‘‘మంచి స్టోరీ, మంచి కాంబినేషన్ కుదిరితే సినిమా చిన్నదా, పెద్దదా అని చూడను. ఏ సినిమా అయినా తీస్తాను. ఏ చిత్రం నిర్మించినా అది అందరికీ నచ్చేలా ఉండాలనుకుంటాను’’ అని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని రాధామోహన్ అన్నారు. మరిన్ని విశేషాలను ఈ విధంగా తెలియజేశారు. ‘బెంగాల్ టైగర్’ రెండు రాష్ట్రాల్లోనూ సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. రవితేజ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ సాధించింది. ఈ సినిమాతో సంపత్ నంది హ్యాట్రిక్ సాధించారు. ఇందులో హీరో పాత్ర కొత్తగా ఉంటుంది. వందలాది కథలు సృష్టించలేం. కాన్సెప్ట్ పాతదైనా ఎంత కొత్తగా, ఆసక్తికరంగా చెప్పామనేది ముఖ్యం. ఈ సినిమా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉన్నందువల్లే అందరికీ నచ్చింది. ‘కిక్-2’ మీద భారీ అంచనాలు నెలకొనడంతో కాస్త నిరాశపరిచింది. ఆ చిత్రం విడుదలకు ముందే మా ‘బెంగాల్ టైగర్’ బిజినెస్ అయ్యుంటే కలిసొచ్చేది. కానీ అలా జరగలేదు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ తక్కువ రేట్ ఇచ్చి ఈ సినిమా కొనుకున్నారు. అయితే, ఈ చిత్రవిజయం మీద మేం ముందు నుంచీ నమ్మకంగా ఉన్నాం. ఆ నమ్మకం నిజమైంది. విచిత్రం ఏంటంటే, నేను ఇప్పటివరకూ తీసిన సినిమాల పరిస్థితి దాదాపు ఇంతే. వాళ్ల ముందు సినిమా ఫ్లాప్ కావడం, దాని ప్రభావం నేను తీసే సినిమా మీద పడటం జరుగుతుంది. అయితే, నా సినిమా సక్సెస్ కావడం వల్ల తర్వాతి చిత్రనిర్మాతలు హ్యాపీగా ఉంటారు. ‘బెంగాల్’ టైగర్ని అక్టోబర్‌లోనే విడుదల చేయాల్సి ఉంది. కానీ పరిశ్రమలో అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో మాది పెద్ద సినిమా అయినా విడుదలను వాయిదా వేశాం. దీపావళి టైంలో రిలీజ్ చేద్దామనుకున్నా, రెండు పెద్ద సినిమాలు ఒకే డిస్ట్రిబ్యూటర్ కొనడంతో మా సినిమా విడుదలను వాయిదా వేశాం. అయినా డిసెంబరు 10 కరెక్ట్ టైమ్ అనిపిస్తోంది. నవంబరు 5న రిలీజ్ చేసుంటే అప్పుడు చెన్నైలో, నెల్లూరులో ఉన్న భారీ వర్షాల కారణంగా వసూళ్లకు దెబ్బపడేది. {పస్తుతం సినిమా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. హై రిస్క్, హై ఇన్వెస్ట్మెంట్. సినిమాకి పెట్టే పెట్టుబడి పోతుందనుకునే నిర్మాణం మొదలుపెడతాను. రిస్క్ అని తెలుసు. అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికొచ్చాను. ప్యాషన్‌తో సినిమాలు తీస్తున్నా. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నెలలో మూడు వారాల పాటు ఇక్కడే ఉంటాను. అన్నీ నా కంట్రోల్లో ఉండేలా చూసుకుంటాను. టెక్నాలజీ పెరగడం వల్ల ఎక్కడ ఉన్నా ప్రొడక్షన్ వ్యవహారాలను చాలా ఈజీగా మానిటర్ చేయగలుగుతున్నా. ప్రస్తుతం కొన్ని చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. జనవరిలో ప్రకటిస్తాను.