
ఆ ముగ్గురితో మూడు సినిమాలు!
గోపీచంద్.. నితిన్.. నాగశౌర్య.. ఇప్పుడీ ముగ్గురు హీరోలతో విడి విడిగా మూడు సినిమాలు చేస్తున్నట్టు నిర్మాత కేకే రాధామోహన్ ప్రకటించారు. ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై పృథ్వీ, నవీన్ చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ నెలలోనే విడుదల కానుంది. జనవరిలో నాగశౌర్యతో సినిమా ప్రారంభిస్తారు. త్వరలో ఈ మూడు సినిమాల వివరాలను ప్రకటించనున్నారు.