రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు | Orey Bujjiga Entertains Everyone Says Director Konda Vijay Kumar | Sakshi
Sakshi News home page

ఈ సినిమా టైటిల్‌ బాగా పాపులర్‌ అయింది

Published Thu, Mar 12 2020 8:33 PM | Last Updated on Thu, Mar 12 2020 8:35 PM

Orey Bujjiga Entertains Everyone Says Director Konda Vijay Kumar - Sakshi

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, హీరోయిన్‌ మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఈ చిత్రానికి కొండా విజయ్‌కుమార్‌ దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముచ్చటించారు.

యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "ఒరేయ్ బుజ్జిగా’ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లారు.  థియేటర్‌లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. ఆ సమయానికి విద్యార్థులకు పరీక్షలు ముగిసి సెలవులు వస్తాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ గా నవ్వుకుని వెళ్లే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే సినిమా చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్, దర్శకుడు విజయ్ కుమార్‌కు ధ‌న్యవాదాలు" తెలిపారు.

ప్రమోషన్స్‌ వినూత్నంగా చేస్తున్నారు
హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ.. ‘సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అని అంటారు. నాకు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సినిమా ఇంకా బాగా రావడానికి సహాయం చేశారు. విజయ్ కుమార్ సినిమా ఆరంభం నుంచి నాకు గైడింగ్ స్పిరిట్‌గా ఉన్నారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంద‌రికీ ఒక హ్యూగ్‌ ఇన్‌స్పిరేషన్. ఆయన వల్లే టీమ్ అందరం ఇంత బాగా పెర్ఫామ్ చేయగలిగాం. నిర్మాత రాధామోహన్ మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రాజ్ తరుణ్ మంచి ఈజ్‌తో నటించారు.  ఆండ్రూతో  వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. సినిమాలో మంచి హ్యూమర్ ఉంటుంది’ అన్నారు. (ఒరేయ్‌ బుజ్జిగా టీజర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఈ సినిమా ఉగాది షడ్రుచిలా ఉంటుంది
దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.."రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. కథకు ఏమి కావాలో అన్నీ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి తగిన సినిమా. మాళవిక నాయర్ నేచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా అని ఓన్ చేసుకొని అద్భుతంగా నటించారు. సినిమాలో అన్ని క్యారెక్టర్స్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆండ్రూ, అనూప్ ఇలా అందరు మంచి టెక్నీషియ‌న్స్‌ కుదిరారు. ఏ జోనర్‌లో సినిమా చేయాలని మూడు సంవత్సరాలుగా నాలో నేను మధన పడి, ప్రేక్షకులందరూ పడిపడి నవ్వుకునే సినిమా చేయాలని ‘ఒరేయ్ బుజ్జిగా..’ చేశాం. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని అంశాలు ఉంటాయి' అన్నారు.

టైటిల్‌ బాగా పాపులర్‌ అయింది
చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ - "నేను, విజయ్ కుమార్ స్టార్ బక్స్‌లో కాఫీ తాగుతున్నప్పుడు ఈ కథ వినిపించారు. అక్కడ మొదలైన చిత్రం ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. మా ‘ఒరేయ్ బుజ్జిగా..’ టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికే విడుదలైన ‘కురిసెన, కురిసెన’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్, ఫ్యామిలీస్‌కు నచ్చే అన్ని రకాల కమ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పటివరకు సినిమా చూసిన వారుకూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని చెప్పారు. నంద్యాల రవి గారు మంచి డైలాగ్స్ రాశారు. అలాగే ఎడిటర్ ప్రవీణ్ చక్కగా ఎడిట్ చేశారు. విజయ్ కుమార్ గారు పక్కగా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల సినిమాకి అవసరమైన సన్నివేశాలే తీశారు.

ఒరేయ్‌ బుజ్జిగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌
దాని వల్ల వర్కింగ్ డేస్ తగ్గి నిర్మాతలకి మంచి జరుగుతుంది. ఈ సినిమాకి యంగ్ టీమ్ వర్క్ చేయడం వల్ల అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాకి బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. వాణి విశ్వనాధ్ హీరోయిన్ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. ఆమెకు కూడా తెలుగులో మంచి రీఎంట్రీ అవుతుంది. ఈ సినిమాకు మార్చి 14న కరీంనగర్‌లో, 19న తిరుపతిలో, 21 హైదరాబాద్‌లో మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాం. అలాగే 16 నుంచి ఖమ్మం, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌లో కాలేజ్ విజిట్స్ చేస్తున్నాం. ఇటీవలే అరకు, గుంటూరులో జరిగిన ఈవెంట్స్‌కు మేము అందరం వెళ్లాం' అన్నారు.

తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది
నటుడు మధుసూధన్ మాట్లాడుతూ.. ‘నిర్మాతకు ఇది ఎనిమిదవ సినిమా. ఆయన లక్కీ నెంబర్ కూడా ఎనిమిది. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది" అన్నారు. సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ మాట్లాడుతూ.. ‘విజయ్ కుమార్‌తో ఇది నా మూడవ సినిమా. ఈ సినిమాకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement