
‘ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్ టైగర్, పంతం’ వంటి హిట్ చిత్రాలు రూపొందించిన కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘ఒరేయ్.. బుజ్జిగా’. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. మాళవికా నాయర్ కథానాయికగా నటించనున్నారు. ఈ సందర్భంగా కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ– ‘‘రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్ కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 8గా ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమా ప్రారంభించాం. మంగళవారం నుంచే నాన్ స్టాప్‌గా రెగ్యులర్ షూటింగ్ జరగుతుంది’’ అన్నారు. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ ఆండ్రూ బాబు, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్.
Comments
Please login to add a commentAdd a comment