Orey Bujjiga Movie
-
నవ్వులతో స్వాగతం
రాజ్ తరుణ్ హీరోగా, మాళవికా నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాని నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2021కి స్వాగతం పలుకుతూ మా చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ. -
నేను చాలా లక్కీ: అనూప్ రూబెన్స్
రాజ్‌తరుణ్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించారు. నేడు ఆహా ఓటీటీ చానల్ ద్వారా ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ మీడియాతో చెప్పిన విశేషాలు. ‘ఒరేయ్ బుజ్జిగా’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. దర్శకుడు విజయ్‌కుమార్ కొండాతో ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలాకోసం’, సినిమాల తర్వాత ‘ఒరేయ్ బుజ్జిగా’ హ్యాట్రిక్ ఫిల్మ్ చేశాను. దేనికదే విభిన్నంగా ఉండే ఈ సినిమాలోని ఐదు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లాక్డౌన్లో మ్యూజిక్ చేశాను, కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది. కారణం అంతకుముందు దర్శకుడు, నిర్మాత అందరూ కలిసి కూర్చుని ఇక్కడ ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అని చర్చించుకుని సినిమాకి సంగీతం చేసేవాళ్లం. ఒక్కడినే ఇంటిదగ్గర కూర్చుని మ్యూజిక్ చేయటం కష్టంగా అనిపించింది. ఈ సినిమాలోని ‘ఈ మాయ పేరేమిటో...’ అనే సాంగ్ పర్సనల్‌గా నాకెంతో ఇష్టం. అలాగే ‘కృష్ణవేణి..’ అనే పాట కూడా ఇష్టం. ఎందుకంటే ఆ పాటలో రాజ్‌తరుణ్ డ్యాన్స్ ఇరగదీశాడు. ఒక సినిమాకి సంగీతం అందించేటప్పుడు హీరోని, కథను దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ చేస్తాను. ఒక సంగీత దర్శకునిగా నాకు అన్ని రకాల సినిమాలు చేయటం ఇష్టం. లక్కీగా ‘ఇష్క్’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘టెంపర్’, ‘కాటమరాయుడు’, ‘పైసా వసూల్’, ‘పూలరంగడు’, ‘సోగ్గాడే చిన్నినాయనా’... ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేసే అవకాశం అభించింది. ఇప్పటివరకు 55 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రసుత్తం రాధామోహన్‌గారు నిర్మిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్’, రాజ్‌తరుణ్–విజయ్‌కుమార్ కొండా కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్నాను. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే ఈ లాక్డౌన్లో కొన్ని ప్రైవేట్ సాంగ్స్ రికార్డ్ చేశాను. మంచి టైమ్ చూసుకుని ఈ పాటలను విడుదల చేస్తాను. -
'ఒరేయ్ బుజ్జిగా’ మూవీ స్టిల్స్
-
ఒకరోజు ముందే ‘ఒరేయ్ బుజ్జిగా’ ..
హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా.'. విజయకుమార్ కొండా దర్శకత్వంలో కేకే రాధమోహన్ నిర్మించిన ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ థియేటర్లు మూత పడటంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. థియేటర్లు ఓపెన్ చేశాక రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే పెద్ద సినిమాలే ఓటీటీ బాట పట్టిన తరుణంలో ఒరేయ్ బుజ్జిగా కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించింది. అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. (చదవండి: నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మార్వలెస్ లవ్ స్టోరీ) కానీ అదే రోజు అగ్రతార అనుష్క నటించిన "నిశ్శబ్ధం" సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఒకరోజు ముందుగానే రిలీజ్ చేయాలన్న ప్రేక్షకుల కోరిక మేరకు 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్లు రాజ్ తరుణ్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని అతడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో బహిరంగంగా ప్రకటించేంతవరకు నిర్మాతకు కూడా తెలియకపోవడం గమనార్హం. అనంతరం ఇదే విషయాన్ని అభిమానులకు తెలుపుతూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. సర్ప్రైజ్.. రేపు సాయంత్రం ఆరు గంటలకే సినిమా చూసేయండని చెప్పుకొచ్చారు. రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు అని హామీ ఇస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. (చదవండి: హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, అశ్వనీదత్) Surprise surprise!!! 🤗😀 pic.twitter.com/KhQNRQcKe2 — Raj Tarun (@itsRajTarun) September 29, 2020 -
‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రీరిలీజ్ వేడుక
-
నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ
సాక్షి, హైదరాబాద్ : కుర్ర హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. టాలీవుడ్ టాప్ హీరో చైతన్య అక్కినేని దీన్ని లాంచ్ చేశారు. నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ అనే డైలాగుతో విడుదలైన ఈ ట్రైలర్ ఈ సినిమా మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో జోరుమీదున్న రాజ్‌తరుణ్ ఖాతాలో మరో విజయం ఖాయంగా కనిపిస్తోంది. మాళవిక నాయర్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. ఇంకా నరేష్, పోసాని కృష్ణమురళి లాంటి సీనియర్లతోపాటు, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్ ఘోష్, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ లాంటి ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. కాగా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో అక్టోబర్ 2న విడుదల కానుంది.విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో, కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనుప్ రుబెన్స్ అందించారు. -
‘సరిగమ’ అంటున్న రాజ్, హెబ్బా
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్ మరో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘సరిగమ’ అనే పూర్తి లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. వనమాలి సాహిత్యం అందించగా.. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసి పాడాడు. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (నగ్నంగా నరేశ్.. 30న ఎఫ్ఐఆర్) ఈ పాటలో రాజ్ తరుణ్ డ్యాన్స్, హెబ్బా పటేల్ అందాలు హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే కుమారి 21ఎఫ్, అంధగాడు, ఆడోరకం ఈడోరకం చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జోడిని ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుండటంతో ఈ చిత్రంలోనూ వీరిని రీపీట్ చేశామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ థియేటర్లోనే విడుదల చేస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా థియేటర్లు తెరిచిన వెంటనే ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. (వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే) -
నెట్టింట కాదు థియేటర్లోనే విడుదల
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం సినీ రంగంపై భారీగానే పడింది. వైరస్ వ్యాప్తి నివారణ నియంత్రణలో భాగంగా ప్రపంచంతో పాటు భారత్ లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా అనేక సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు నెట్టింట్లో విడుదల చేశారు. డిజిటల్ ఫ్లాట్‌ఫాం వేదికగా రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ వస్తోంది. దీంతో పలు చిన్న సినిమాలు కూడా డిజిటల్ బాట పడుతున్నాయి. అయితే యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’చిత్రం కూడా నెట్టింట విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ‘ఒరేయ్ బుజ్జిగా’చిత్ర విడుదలపై నిర్మాత రాధామోహన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఒరేయ్ బుజ్జిగా చిత్ర విడుదల విషయంలో వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. మా చిత్రం థియేటర్లలోనే విడుదల అవుతుంది’అంటూ నిర్మాత ట్వీట్ చేశారు. ఉగాది కారణంగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్, హెబ్బా పటేల్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనుప్ రుబెన్స్ సంగీతమందించాడు. Don't believe in rumours about skipping the theatrical release of #OreyBujjiga. We will update about the theatrical release date once normalcy is restored. Until then #StayHomeStaySafe - @KKRadhamohan @SriSathyaSaiArt — Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 9, 2020 చదవండి: హీరోయిన్ ఐశ్వర్య.. మరి హీరో ఎవరు? కరోనాపై పోరులో చిరంజీవి తల్లి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_511240763.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం
రాజ్ తరుణ్, మాళవికా నాయర్ జంటగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’ కరీంనగర్లో జరిగిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో సునీల్‌రావు (కరీంనగర్ మేయర్) ముఖ్య అతిథిగా హాజరై ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఆడియో బిగ్ సీడీని విడుదల చేశారు. నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా ఇది నా ఎనిమిదో సినిమా. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్. టీమ్ అందరి సహకారం వల్ల సినిమా బాగా వచ్చింది. ముందుగా ఉగాది కానుకగా ఈ సినిమాను మార్చి 25న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 21వరకు థియేటర్స్ మూసివేస్తున్నారు. తిరిగి సినిమా థియేటర్స్ ఓపెన్ చేయగానే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఇది క్లీన్ ఎంటర్టైనర్. రెండున్నర గంటలు ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం. రాజ్‌తరుణ్ ఫైట్స్, డ్యాన్స్‌లు ఇరగదీశాడు. రాధామోహన్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు విజయ్‌కుమార్ కొండా. ‘‘థియేటర్‌కు వచ్చి ఫ్యామిలీ అంతా రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ తర్వాత డైరెక్టర్ విజయ్‌కుమార్‌గారితో ఇది నా హ్యాట్రిక్ ఫిల్మ్. రాజ్ తరుణ్ ఎనర్జీ నాకు బాగా నచ్చుతుంది. రాజ్ తరుణ్‌తో నాకిది రెండో సినిమా’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. నటుడు మధుసూధన్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ రమే‹ష్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నీతోని కష్టమే కృష్ణవేణి!
యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘నీతోని కష్టమే కృష్ణవేణి’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించాడు. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘ఒరేయ్ బుజ్జిగా..’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఈ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన కృష్ణవేణి పాటను బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ కృష్ణవేణి ఓ కృష్ణవేణి నీతోని కష్టమే కృష్ణవేణి, కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి’ పాట యూట్యూబ్‌లో చూడొచ్చు. ఇక ఈ సినిమా నుంచి ‘కురిసేన.. కురిసేన.. తొలకరి వలపులె మనసున’ అనే పాట ఇదివరకే విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: ఒరేయ్ బుజ్జిగా.. ఫస్ట్ సాంగ్ రిలీజ్) Here’s the mass song “Krishnaveni” from #Oreybujjiga https://t.co/mNtvpag03i Hope u guys like it :) — Raj Tarun (@itsRajTarun) March 14, 2020 (చదవండి: ఈ సినిమా టైటిల్ బాగా పాపులర్ అయింది) -
రెండున్నర గంటలు నవ్వులే
‘‘ఒరేయ్ బుజ్జిగా’ కంప్లీట్ ఎంటర్టైనర్. థియేటర్లో రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. కుటుంబ సభ్యులంతా వచ్చి సంతోషంగా నవ్వుకుని వెళ్లే సినిమా’’ అన్నారు రాజ్ తరుణ్. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులందరూ నవ్వుకునే సినిమా చేయాలని ‘ఒరేయ్ బుజ్జిగా’ చేశా. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్లే మా సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి’’ అన్నారు. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘యువతకి, కుటుంబ సభ్యులకి నచ్చే అన్ని రకాల వాణిజ్య అంశాలున్న సినిమా ఇది. ఈ నెల 14న కరీంనగర్లో, 19న తిరుపతిలో, 21న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకలు చేస్తాం’’ అన్నారు. మాళవికా నాయర్, నటుడు మధునందన్, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ, కో– డైరెక్టర్ వేణు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు
యంగ్ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఈ చిత్రానికి కొండా విజయ్‌కుమార్ దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముచ్చటించారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "ఒరేయ్ బుజ్జిగా’ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. థియేటర్లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. ఆ సమయానికి విద్యార్థులకు పరీక్షలు ముగిసి సెలవులు వస్తాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ గా నవ్వుకుని వెళ్లే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే సినిమా చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్, దర్శకుడు విజయ్ కుమార్‌కు ధన్యవాదాలు" తెలిపారు. ప్రమోషన్స్ వినూత్నంగా చేస్తున్నారు హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ.. ‘సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అని అంటారు. నాకు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సినిమా ఇంకా బాగా రావడానికి సహాయం చేశారు. విజయ్ కుమార్ సినిమా ఆరంభం నుంచి నాకు గైడింగ్ స్పిరిట్‌గా ఉన్నారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరికీ ఒక హ్యూగ్ ఇన్స్పిరేషన్. ఆయన వల్లే టీమ్ అందరం ఇంత బాగా పెర్ఫామ్ చేయగలిగాం. నిర్మాత రాధామోహన్ మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రాజ్ తరుణ్ మంచి ఈజ్‌తో నటించారు. ఆండ్రూతో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సినిమాలో మంచి హ్యూమర్ ఉంటుంది’ అన్నారు. (ఒరేయ్ బుజ్జిగా టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ సినిమా ఉగాది షడ్రుచిలా ఉంటుంది దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.."రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. కథకు ఏమి కావాలో అన్నీ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి తగిన సినిమా. మాళవిక నాయర్ నేచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా అని ఓన్ చేసుకొని అద్భుతంగా నటించారు. సినిమాలో అన్ని క్యారెక్టర్స్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆండ్రూ, అనూప్ ఇలా అందరు మంచి టెక్నీషియన్స్ కుదిరారు. ఏ జోనర్లో సినిమా చేయాలని మూడు సంవత్సరాలుగా నాలో నేను మధన పడి, ప్రేక్షకులందరూ పడిపడి నవ్వుకునే సినిమా చేయాలని ‘ఒరేయ్ బుజ్జిగా..’ చేశాం. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని అంశాలు ఉంటాయి' అన్నారు. టైటిల్ బాగా పాపులర్ అయింది చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ - "నేను, విజయ్ కుమార్ స్టార్ బక్స్లో కాఫీ తాగుతున్నప్పుడు ఈ కథ వినిపించారు. అక్కడ మొదలైన చిత్రం ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. మా ‘ఒరేయ్ బుజ్జిగా..’ టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికే విడుదలైన ‘కురిసెన, కురిసెన’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్, ఫ్యామిలీస్‌కు నచ్చే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పటివరకు సినిమా చూసిన వారుకూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉందని చెప్పారు. నంద్యాల రవి గారు మంచి డైలాగ్స్ రాశారు. అలాగే ఎడిటర్ ప్రవీణ్ చక్కగా ఎడిట్ చేశారు. విజయ్ కుమార్ గారు పక్కగా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల సినిమాకి అవసరమైన సన్నివేశాలే తీశారు. ఒరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దాని వల్ల వర్కింగ్ డేస్ తగ్గి నిర్మాతలకి మంచి జరుగుతుంది. ఈ సినిమాకి యంగ్ టీమ్ వర్క్ చేయడం వల్ల అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాకి బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. వాణి విశ్వనాధ్ హీరోయిన్ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. ఆమెకు కూడా తెలుగులో మంచి రీఎంట్రీ అవుతుంది. ఈ సినిమాకు మార్చి 14న కరీంనగర్లో, 19న తిరుపతిలో, 21 హైదరాబాద్‌లో మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాం. అలాగే 16 నుంచి ఖమ్మం, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌లో కాలేజ్ విజిట్స్ చేస్తున్నాం. ఇటీవలే అరకు, గుంటూరులో జరిగిన ఈవెంట్స్‌కు మేము అందరం వెళ్లాం' అన్నారు. తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది నటుడు మధుసూధన్ మాట్లాడుతూ.. ‘నిర్మాతకు ఇది ఎనిమిదవ సినిమా. ఆయన లక్కీ నెంబర్ కూడా ఎనిమిది. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది" అన్నారు. సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ మాట్లాడుతూ.. ‘విజయ్ కుమార్‌తో ఇది నా మూడవ సినిమా. ఈ సినిమాకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటూనే మరోవైపు ప్రమోషన్లను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రి టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా.. రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు’, ‘అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏమిటి? ఒక ఫ్లిప్‌కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్‌మైషో, ఒక క్రెడిట్ కార్డ్’ అంటూ టీజర్లో వచ్చే డైలాగ్‌లు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’, ‘నీకు తెలిసిన స్టోరీలో తెలియన్ ట్విస్టు ఉంది’ అంటూ చివర్లో వచ్చే డైలాగ్‌లు కూడా ఆకట్టుకున్నాయి. దీంతో యూత్‌ను టార్గెట్ చేస్తూ విడుదల చేసిన టీజర్ సినిమాకు మరింత ప్లస్‌గా నిలిచే అవకాశం ఉంది. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించాడు. చదవండి: ‘అమృతరామమ్’ ఎప్పుడంటే? యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న‘నీలి నీలి ఆకాశం..’ -
యంగ్ హీరో సినిమాకు మెగాప్రిన్స్ బెస్ట్ విషెస్
రాజ్ తరుణ్ హీరో కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాపై అందరిలోనూ పాజిటీవ్ ఒపీనియన్ కలిగింది. ఇప్పటికే చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. దీనిలో భాగంగా సినిమాలో ఫస్ట్ సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోన తన ట్విటర్లో షేర్ చూస్తూ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘కురిసేన.. కురిసేన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఈ పాటను అనూప్ రూబెన్స్ స్వరపరచగా.. ఆర్మాన్ మాలిక్, మేఘనలు ఆలపించారు. కె.కె సాహిత్యాన్ని అందించారు. హీరోయిన్‌పై తనకున్న ప్రేమను హీరో తెలియజేస్తూ సాగే ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యూత్‌ను, ప్రేమికులను కట్టిపడేస్తోన్న ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. Hey guys!! Here's the First Single #KurisenaKurisena, a melodious number, from #OreyBujjiga. ▶️ https://t.co/mORWbIsdkV#OreyBujjigaOnMarch25th All the best to the entire team!!!👍🏽@itsRajTarun @MalvikaNairOffl @IamHebahPatel @directorvijays @anuprubens @iandrewdop — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 21, 2020 -
నాని, సుధీర్‌లకు పోటీగా రాజ్ తరుణ్?
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫుల్ అండ్ ఫుల్ అండ్ ఎంటర్టైనర్గా తెరెకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే అదే రోజు నాని, సుధీర్ బాబుల ‘వి’ చిత్రం కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్లాఫ్లతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ తన చిత్రాన్ని అదే తేదీన విడుదల చేస్తాడో లేదో వేచి చూడాలి. ఇక కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ అ తర్వాత వరుస అపజయాలతో వెనకబడ్డాడు. ఏడాదికి రెండు మూడు చిత్రాలతో పలకరించే ఈ యంగ్ హీరో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో కొండా విజయకుమార్ దర్శకత్వంలో యూత్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని చేస్తున్నారు. మాళవిక నాయర్‌తో పాటు హెబ్బా పటేల్ కూడా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పాత్ర చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్. ఇప్పటివరకు రాజ్ తరుణ్-హెబ్బాల కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో వారిద్దిరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ చిత్రంపై కూడా అందరిలోనూ అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూబ్ రుబెన్స్ సంగీతమందిస్తున్నారు. చదవండి: క్యాన్సర్ కదా... అందుకే: నటుడి భావోద్వేగం! ‘అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా?’