యంగ్‌ హీరో సినిమాకు మెగాప్రిన్స్‌ బెస్ట్‌ విషెస్‌ | Varun Tej Launch First Song In Raj Taruns Orey Bujjiga Telugu Movie | Sakshi
Sakshi News home page

ఒరేయ్‌ బుజ్జిగా.. ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

Published Sat, Feb 22 2020 9:53 AM | Last Updated on Sat, Feb 22 2020 10:01 AM

Varun Tej Launch First Song In Raj Taruns Orey Bujjiga Telugu Movie - Sakshi

రాజ్‌ తరుణ్‌ హీరో కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’. మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌తో సినిమాపై అందరిలోనూ పాజిటీవ్‌ ఒపీనియన్‌ కలిగింది. ఇప్పటికే చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది. దీనిలో భాగంగా సినిమాలో ఫస్ట్‌ సాంగ్‌ను సోషల్‌ మీడియా వేదికగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోన తన ట్విటర్‌లో షేర్‌ చూస్తూ చిత్ర యూనిట్‌కు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు.

‘కురిసేన.. కురిసేన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఈ పాటను అనూప్‌ రూబెన్స్‌ స్వరపరచగా.. ఆర్మాన్‌ మాలిక్‌, మేఘనలు ఆలపించారు. కె.కె సాహిత్యాన్ని అందించారు. హీరోయిన్‌పై తనకున్న ప్రేమను హీరో తెలియజేస్తూ సాగే ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యూత్‌ను, ప్రేమికులను కట్టిపడేస్తోన్న ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యూత్‌ఫుల్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement