
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్ మరో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘సరిగమ’ అనే పూర్తి లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. వనమాలి సాహిత్యం అందించగా.. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసి పాడాడు. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (నగ్నంగా నరేశ్.. 30న ఎఫ్‌ఐఆర్)
ఈ పాటలో రాజ్ తరుణ్ డ్యాన్స్, హెబ్బా పటేల్ అందాలు హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే కుమారి 21ఎఫ్, అంధగాడు, ఆడోరకం ఈడోరకం చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జోడిని ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుండటంతో ఈ చిత్రంలోనూ వీరిని రీపీట్ చేశామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ థియేటర్‌లోనే విడుదల చేస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా థియేటర్లు తెరిచిన వెంటనే ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. (వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే)
Comments
Please login to add a commentAdd a comment