ఆ నమ్మకం నిజమవుతుంది | Pantham Trailer Launch | Sakshi
Sakshi News home page

ఆ నమ్మకం నిజమవుతుంది

Published Tue, Jun 26 2018 1:15 AM | Last Updated on Tue, Jun 26 2018 1:15 AM

Pantham Trailer Launch - Sakshi

రాధామోహన్, మెహరీన్, గోపీచంద్, సురేందర్‌ రెడ్డి, కె. చక్రవర్తి, ప్రసాద్‌ మూరెళ్ల

‘‘మా నాన్నగారు (దర్శకుడు టి. కృష్ణ) చేసిన సినిమాల్లాంటివి చేయాలనుకుంటున్న సమయంలో ఈ కథ కుదిరింది. నాకిది 25వ సినిమా. మంచి సామాజిక ప్రయోజనం ఉన్న కమర్షియల్‌ స్టోరీ కుదరడం ఆనందంగా ఉంది. కథని నమ్మి ఈ సినిమా చేశాను. పాటలు, టీజర్‌కి ఆల్రెడీ మంచి రెస్పా¯Œ ్స వచ్చాయి. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు గోపీచంద్‌. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్‌ జంటగా కేకే రాధామోహన్‌ నిర్మించిన ‘పంతం’ జూలై 5న విడుదల కానుంది.

ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం దర్శకుడు సురేందర్‌ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌ చూశాక ‘పంతం’.. ఫర్‌ ఎ కాజ్‌.. అనే టైటిల్, ట్యాగ్‌లైన్‌ యాప్ట్‌ అనిపించింది. ట్రైలర్‌లోని డైలాగ్స్‌ సినిమా ఎలా ఉండబోతోందో చెబుతోంది. సామాజిక సమస్యను కమర్షియల్‌ పంథాలో చెప్పడానికి ప్రయత్నించిన సినిమాలన్నీ పెద్ద హిట్టయ్యాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సొంతం చేసుకుంటుందనిపిస్తోంది’’ అన్నారు. కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ – ‘‘మా బ్యానర్‌లో ఇది ఏడో సినిమా.

గోపీచంద్‌గారికి ప్రెస్టీజియస్‌ 25వ సినిమా. కొత్త డైరెక్టర్‌ ఎలా తీస్తాడో అనే డౌట్‌ ఉండేది. అయితే డిస్కషన్స్‌ స్టేజిలోనే నమ్మకం కుదిరింది. చక్రవర్తి అద్భుతంగా తెరకెక్కించారు. ప్రసాద్‌ విజువల్స్‌ ఎక్స్‌ట్రార్డినరీ’’ అన్నారు. ‘‘టీజర్, పాటలకు మంచి రెస్పా¯Œ ్స వచ్చింది. ట్రైలర్‌ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సినిమాను పెద్ద సక్సెస్‌ చేస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు కె. చక్రవర్తి. ‘‘విజ యంపై పాజిటివ్‌గా ఉన్నాం’’ అన్నారు మెహరీన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement