
అశోక్ తేజ, కె.కె. రాధామోహన్, సంపత్‌నంది
‘ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్’ వంటి హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఓ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. దర్శకుడు సంపత్ నంది వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన అశోక్ తేజ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది.
మా బ్యానర్‌లో ‘ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి నా¯Œ స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ అనుమోలు, సంగీతం: అనూప్ క్రియేటివ్స్, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సంపత్ నంది.
Comments
Please login to add a commentAdd a comment