ashok teja
-
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్‌ను అధిక బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
ఉత్తేజ్ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్న
-
‘ఆది’ ఫేమ్ కీర్తీ చావ్లా.. ఈ సినిమాతో రీఎంట్రీ
‘సందీప్ మాధవ్ హీరోగా, కేథరిన్ హీరోయిన్గా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అశోక్ తేజ దర్శకత్వంలో సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దావులూరి జగదీష్ మాట్లాడుతూ – ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సందీప్ ఓ పవర్ఫుల్ పోలీస్ క్యారక్టర్ చేస్తున్నారు. రెండో షెడ్యూల్‌ని ఈ నెల 4న ఆరంభిస్తాం. ప్రముఖ దర్శకుడు సంపత్ నందిగారు మా కథ విని ఇంప్రెస్ అయి, ఓ క్రేజీ టైటిల్ సూచించారు. ఆ టైటిల్‌ని ఈ నెల 6న ప్రకటిస్తాం. చాలా గ్యాప్ తర్వాత ‘ఆది’ ఫేమ్ కీర్తీ చావ్లా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సతీష్ ముత్యాల. -
యాక్షన్ థ్రిల్లర్ ఆరంభం
సందీప్ మాధవ్, కేథరిన్ థెరిస్సా జంటగా నూతన చిత్రం షురూ అయింది. సోమా విజయప్రకాష్ సమర్పణలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. అశోక్ తేజ దర్శకుడు. తొలి సీన్‌కి నిర్మాత సి. కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు సంపత్ నంది క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు ప్రసన్నకుమార్, పి. కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘పోలీస్ పాత్రలో నటించాలన్న నా ఆశ ఈ సినిమాతో నేరవేరింది’’ అన్నారు సందీప్ మాధవ్. ‘‘స్క్రీన్ ప్లే బేస్డ్ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది’’ అన్నారు అశోక్ తేజ. ‘‘సినిమా పూర్తయ్యేవరకూ కంటిన్యూ షెడ్యూల్ జరుపుతాం’’ అన్నారు పల్లి కేశవరావు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సహనిర్మాతలు: రొంగల శివశంకర్, గౌటి హరినాథ్. -
భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్న ‘జార్జిరెడ్డి’ హీరో
దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్ తేజ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టారు. కేథరిన్ త్రెసా కథానాయికగా, ‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్ మాధవ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహావిష్ణు మూవీస్ బ్యానర్లపై ప్రొడక్షన్ నంబర్‌వన్‌గా ఈ చిత్రం రూపొందనుంది. దావులూరి జగదీష్, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై చివరివారంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రాన్ని చివరి వరకూ సస్పెన్స్ రివీల్ చేయకుండా ఎంతో గ్రిప్పింగ్‌గా రూపొందించిన అశోక్ తేజ యాక్షన్ థ్రిల్లర్‌ను అంతకుమించి అద్భుతంగా రూపొందిస్తారని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. -
క్రైమ్ థ్రిల్లర్ ఆరంభం
‘ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్’ వంటి హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఓ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. దర్శకుడు సంపత్ నంది వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన అశోక్ తేజ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. మా బ్యానర్లో ‘ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి నా¯Œ స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ అనుమోలు, సంగీతం: అనూప్ క్రియేటివ్స్, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సంపత్ నంది. -
తల్లి రుణం తీర్చుకోవడానికే అమ్మ ఒడి
గుండాల (ఆలేరు) : తల్లి రుణం తీర్చుకోవడానికే గత ఐదు సంవత్సరాలుగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని చేపట్టి పిల్లల తల్లులకు ఒడి నింపి తన తల్లి రుణం తీర్చుకుంటున్నానని సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. అశోక్‌తేజ తల్లిదండ్రులు సుద్దాల జానకమ్మ, హన్మంతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలోసోమవారం జనగామ జిల్లా గుండాల మండలంలోని అనంతారం గ్రామంలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు బిడ్డను కాపాడుకోవడానికి ఓ తల్లి పడిన ఆవేదన, అదే ప్రాంతంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా వదిలేసిన సంఘటనను తనను కలచి వేశాయని చెప్పారు. ఆ సంఘటనలనే స్ఫూర్తిగా తీసుకొని తన తల్లిదండ్రుల పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి అమ్మ ఒడి అమ్మ మడి, అమ్మ బడి తది తర సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ప్రజల వేదనలోంచే తెలంగాణ ఉద్యమం
-సినీగేయ రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ, -ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న వనపర్తి టౌన్ : కోట్లాది మంది ప్రజల వేదన, ఆత్మఘోష, ఆరణ్యరోదన, అంతులేని వివక్షలోంచి తెలంగాణ ఉద్యమం ఉద్భవించిందని సినీగేయ రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం రాత్రి వనపర్తి పట్టణంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి నేతత్వంలో ‘పుడమి తల్లికి కష్ణ పుష్కర శోభ’పై జరిగిన జిల్లాస్థాయి కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మట్టిలో రతనాలు ఉన్నాయని, దాని ఫలాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం కషి చేయాలన్నారు. మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు రైతులకు వరంగా మారనున్నాయన్నారు. అనంతరం వారిద్దరికీ మూడు తులాల బంగారు గండపిండేరంతో వనపట్ల సుబ్బయ్య, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డిలను బంగారు ఉంగరాలు, మాజీ ఎమ్మెల్యే స్వర్థసుధాకర్‌రెడ్డి సహా కవితగానం చేసిన వందమంది కవులను ఘనంగా సన్మానించారు. -
మరో పవర్ఫుల్ పాత్ర
నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లల్ని సక్రమంగా పెంచితే సమాజ శ్రేయస్సుతో పాటు దేశం అభివృద్ధి చెందే వీలు ఉంటుందన్న కథాంశంతో రాయన్న .కె నిర్మించిన చిత్రం ‘జన్మస్థానం’. శత చిత్ర దర్శకుడు ఓం సాయిప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయికుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ నెల 8న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రాయన్న మాట్లాడుతూ -‘‘వ్యవస్థను ప్రక్షాళన చేసే శక్తిమంతమైన పోలీసాధికారి పాత్రను సాయికుమార్ చేశారు. కాలేజీ నేపథ్యంలో కథ సాగుతుంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రభుత్వం నిర్భయ వంటి చట్టాలు తీసుకువచ్చినా పరిష్కారం లభించడం లేదు. తల్లిదండ్రులు పిల్లలను సరైన రీతిలో పెంచకపోవడంతో కొంతమంది యువకుల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. తల్లిదండ్రులకు మాత్రమే కాదు.. పిల్లలకు కూడా సందేశం ఇచ్చే చిత్రం ఇది. నేరాలు ఆగాలంటే ఏం చేయాలి? అనే పరిష్కారం కూడా ఇందులో చూపిస్తున్నాం. సందర్భానుసారం సాగే పాటలకు సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’’ అని చెప్పారు.