బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో! | Tamannaah Bhatia Latest Odela 2 Movie Poster Released On The Occasion Of Bonalu Festival, Look Goes Viral | Sakshi
Sakshi News home page

Tamannaah Odela 2 Poster: బోనమెత్తిన తమన్నా.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్‌!

Published Mon, Jul 29 2024 5:10 PM | Last Updated on Mon, Jul 29 2024 5:51 PM

Tamanna Latest Movie Odela 2 Poster released on Bonalu Festival Occassion

తమన్నా  ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్‌ బస్టర్ హిట్‌ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 

800 మందితో క్లైమాక్స్‌ సీన్‌ షూట్..

ఈ  చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్‌లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్‌ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్‌ను అధిక బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా  పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement