Odela
-
తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు!
సాక్షి, పెద్దపల్లి: ‘గజ్జల లాగులను ధరించిన ఓదెల మల్లన్న దండాలో.. మమ్మేలు మా స్వామి దండాలో.. ఆలుమిలా తారడో బోలుమియా గారడో..’ అంటూ గంతులు వేస్తూ తమ ఇలవేల్పును దర్శించేందుకు భక్తులు ఆ ఆలయానికి భారీగా తరలివస్తుంటారు. తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు.. మల్లన్నగా.. ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందాడు. అదే పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం. ఆ ఆలయ చరిత్ర తెలుసుకుందాం.నాగలి చేసిన గాయంతో..పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యంగా (Deep Forest) ఉండేది. ఆ రోజుల్లో స్వయంభూలింగంగా వెలసిన మహాశివుడిని పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఆలయ స్తంభంపై మునీశ్వరుల బొమ్మలు, నామం చెక్కి కనిపిస్తాయి. ఆయన తర్వాత పూజ చేసేవారు లేక శివలింగంపై పెద్దఎత్తున పుట్ట పెరిగింది. అయితే, చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం చేస్తుండగా.. నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తగిలింది. జరిగిన పొరపాటును ఓదెలు తెలుసుకొని, స్వామివారిని మన్నించమని వేడుకున్నాడు. దీంతో ఓదెలుకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా, అతడి పేరుతోనే భక్తులకు దర్శనం ఇస్తానని స్వామివారు చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికీ శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ క్రమం, స్తంభ వర్ణ శిలలు, శిల్పాల ఆధారంగా సుమారు 1300 మధ్య కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఆ సమయంలో దక్షిణ దిశగా శ్రీభ్రమరాంబ అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీవీరభద్రస్వామిని, క్షేత్రపాలకుడిగా శ్రీభైరవస్వామిని ప్రతిష్టించారు.మల్లన్న ఆలయానికి సమాంతరంగా సీతారామ చంద్రస్వామి విగ్రహాలుశ్రీసీతారాములు వనవాసం చేసే సమయంలో రామగిరిఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే దారిలో ఓదెల శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకున్నారని ప్రతీతి. దానికి ప్రతీకగా మల్లన్నస్వామి ఆలయానికి సమాంతరంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి విగ్రహాలను ప్రతిష్టించారని స్థానికులు చెబుతుంటారు.సంతానం కోసం టెంకాయ బంధనం‘గండాలు తీరితే గండదీపం పెడతాం.. కోరికలు తీరితే.. కోడెలు కడతాం.. పంటలు పండితే.. పట్నాలు వేస్తాం.. పిల్లాజెల్ల సల్లంగా ఉంటే.. సేవలు చేస్తాం’ అని స్వామివారికి భక్తులు మొక్కుకుంటారు. వచ్చే భక్తుల్లో చాలామంది సంతానం కోసం ‘టెంకాయ బంధనం’ కట్టి వారికి సంతానం కలిగిన తర్వాత స్వామివారికి మొక్కుబడి చెల్లిస్తారు. మల్లన్నను దర్శించుకున్న తర్వాతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఒగ్గుపూజారుల పట్నాలతో..ఓదెల మల్లన్న సన్నిధిలో భక్తులు (Devotees) స్వామివారి పేరిట పట్నం వేస్తారు. ఒగ్గుపూజారుల చేతిలో ఢమరుకాన్ని మోగిస్తూ శ్రుతిని తలుస్తుండగా స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మండపంలో ఒగ్గు పూజారులు గజ్జెలతో కుట్టిన లాగుల (నిక్కర్లు)తో పూసలు కట్టిన అంగీలు (చొక్కాలు), పూసల కుల్లాయి (టోపీ) సన్నని జాలిచెద్దరు, చేతిలో త్రిశూలం, దానికి చిరుగంటలు, మరోచేతిలో కొరడా (వీరకొల) వంటివి ధరించి భక్తి తన్మయత్వంతో పూనకాలతో ఊగుతూ, గంతులు వేస్తూ.. శివతాండవం చేస్తూ దేవున్ని ప్రత్యేకంగా కొలవడం విశేషం.పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాకఏటా సుమారు రూ.2 కోట్లకుపైగా ఆదాయం సమకూరే ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దేవాలయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.భక్తుడి పేరుతో దర్శనం చింతకుంట ఓదెలు అనే భక్తుడి పేరు మీద మల్లన్న క్షేత్రం విరాజిల్లు తోంది. శ్రీరాముడు కూడా మల్లన్నను దర్శించుకొని పూజలు చేశాడని ప్రతీతి. శ్రీశైలం, ఓదెల ఆలయం రెండు ఒకే సమయంలో నిర్మించడంతో తెలంగాణ శ్రీశైలం అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.– పంచాక్షరి, ఆలయ అర్చకులుబుధ, ఆదివారాల్లో రద్దీ ఉగాది పర్వదినం రోజున ఎడ్లబండ్లతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత జాతర ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పెద్దపట్నాలు, అగ్నిగుండాలు దాటడంతో ఏటా జాతర సాగుతుంది. ఆలయంలో పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటి నిర్మాణాలకు సహకరించిన దాతలకు జాతర సమయంలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తాం.– బి.సదయ్య, ఈవో(403) -
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్‌ను అధిక బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
Odela 2 Movie: ‘ఓదెల 2’లో మిల్కీ బ్యూటీ.. కాశీలో గ్రాండ్ గా ఓపెనింగ్ (ఫోటోలు)
-
న్యాచురల్ స్టార్ 'దసరా' అప్డేట్.. ఊరమాస్ లుక్‌లో నాని
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'దసరా'. పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. నానికి జోడీగా కీర్తి సురేశ్ ఈ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనెల 3న 'ధూమ్ ధామ్ దోస్తాన్' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి రిలీజైన పోస్టర్లో నాని లుక్ పక్కా మాస్‌ను తలపిస్తోంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. నాని ఇంతకు ముందెన్నడు చేయని మాస్ లుక్‌లో అభిమానులను అలరించబోతున్నారు. ఈ సినిమాలో కొత్త నానిని చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల చేయనున్నారు. -
మినీ మేడారం.. 40 ఏళ్లుగా గోలివాడ సమ్మక్క జాతర
ఆహ్లాదకరమైన వాతావరణం.. సేద తీరేందుకు పచ్చటిచెట్లు.. మెరుగైన రవాణా సౌకర్యం.. గోదావరినది తీరప్రాంతంలో కొలువుదీరిన అమ్మవారు.. రెండేళ్లకోసారి వైభవంగా జరిగే గోలివాడ సమ్మక్క, సారలమ్మ జాతర. ప్రస్తుత జాతరకు 40 ఏళ్లు. – రామగుండం కుంకుమగా అవతరించి.. కలలో వచ్చి గోలివాడ గ్రామానికి చెందిన జాలిగామ కిషన్‌రావు ఊరాఫ్ బయ్యాజీ గోదావరిలో స్నానానికి వెళ్లాడు. గోదావరి ఒడ్డున ఇసుకకుప్పలో ఎరుపు బట్టలో కుంకుమ భరిణె మూట లభ్యమైంది. దానిని తీసుకొని ఇంటికి వచ్చిన బయ్యాజీకి రాత్రి నిద్రలో వనదేవతలు కలలోకి వచ్చి నీకు లభ్యమైన కుంకుమ భరణి స్థానంలో శ్రీసమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజుల గద్దెలు నిర్మించి ప్రతీ రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశించినట్లు వారు చెబుతుంటారు. అదే ఏడాది 1982లో గోదావరినది ఒడ్డున వనదేవతల గద్దెలను నిర్మించి జాతరను ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామానికి చెందిన 41మందితో వ్యవస్థాపక కమిటీ ఏర్పాటు చేసుకొని జాతరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత జాతరకు 40 ఏళ్లు. బ్యాక్ వాటర్లోకి వనదేవతల గద్దెలు ► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో బ్యాక్‌వాటర్‌తో వనదేవతల గద్దెలు ముంపులోకి చేరా యి. నెలరోజుల క్రితం ఒడ్డునే నూతన గద్దెలు నిర్మించారు. భక్తులు విడిది చేసేందుకు, నాలుగు వైపుల పబ్లిక్ టాయిలెట్స్ తదితర ఏర్పాట్లకు 60ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ► జాతరకు గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాల వారుకూడా వస్తారు. గతేడాది రెండున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ► జాతరలో నాలుగు వైపుల నాలుగు బోర్లు, స్నానాలు చేసేందుకు షవర్స్, ప్రత్యేక టాయిలెట్స్, ఐదు సెంట్రల్ లైటింగ్స్, 400 అంతర్గత వీధి దీపాలు, పొరుగు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేందుకు రైల్వేట్రాక్ వరకు రహదారి ఏర్పాట్లు చేశారు. ► గోదావరిఖని నుంచి బస్సులు, ప్రయివేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇత ర రాష్ట్రాలు, హైదరాబాద్ నుంచి వచ్చేవారికి రైలు సౌకర్యం ఉంది. ఐదు లక్షల మంది వచ్చే అవకాశం గోదావరినదిలో బ్యాక్‌వాటర్‌తో మంచిర్యాల వైపు నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. 2018లో ఐదు లక్షల మంది భక్తులు రాగా ఆదాయం రూ.30 లక్షలు సమకూరింది. 2020లో భక్తుల సంఖ్య 2 లక్షలకు పడిపోయి రూ.17లక్షలు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఏడాది విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుండడంతో చేస్తుండగా.. ఐదులక్షల మంది వచ్చే అవకాశం ఉంది. – గీట్ల శంకర్‌రెడ్డి, జాతర కమిటీ చైర్మన్ ముస్తాబైన సమ్మక్క,సారలమ్మ గద్దెలు కొలనూర్‌లో 48 ఏళ్లుగా... ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం కొలనూర్‌లో సమ్మక్క, సారలమ్మ జాతరను 48 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి నాలుగు లక్షలకు పైగా భక్తులు వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. మేడారం నుంచి కోయపూజారులు వచ్చి నాలుగు రోజులపాటు పూజలు చేయడం ప్రత్యేకత. జాతర చుట్టూ మూడుగుట్టలు ఉన్నాయి. వాటి మధ్య జాతర ఆకర్షణీయంగా జరగుతుంది. అల్లీమాసాని చెరువులో స్నానాలు చేసే అవకాశముంది. జాతరకు కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ నుంచి ఆటోలూ నడుస్తాయి. రైలులో వచ్చేవారు కొలనూర్ రైల్వే స్టేషన్లో దిగి జాతరకు రావొచ్చు. ఏర్పాట్లు చేశాం జాతరకు వచ్చే భక్తులకు నీడ, మంచినీటి సౌకర్యం, రహదార్లు ఏర్పాటు చేశాం. వైద్య సౌకర్యం కల్పిస్తున్నాం. మహిళలకు మరగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశాం. – బండారి ఐలయ్య యాదవ్, జాతర చైర్మన్ -
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. యువతితో కలిసి నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, ఆపై
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో సెక్స్ రాకెట్ గుట్టురట్టయినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి పొత్కపల్లి పోలీసులు గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా అసలు విషయం బయట పడినట్లు సమాచారం. గత కొంతకాలంగా మడకకే చెందిన ఓ యువతితో రాకేశ్, మరికొందరు నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, నీలి క్యాసెట్ల దందాను నడుపుతున్నట్లు తెలిసింది. పోలీసులు పక్కా సమాచారంతో ఆ యువకుడిని పట్టుకోగా వీణవంక మండలంలోని చల్లూరు సెల్ పాయింట్లో నీలి క్యాసెట్లు లభ్యమైనట్లు విశ్వసనీయ సమాచారం. నీలి చిత్రాల ముఠా గత కొంతకాలంగా యువతులను, మహిళలను లొంగదీసుకొని వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెనక చాలామంది ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై పొత్కపల్లి ఎస్సై ఎస్.లక్ష్మణ్‌ను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, వివరాలు తర్వాత చెబుతామని పేర్కొన్నారు. (చదవండి: Health Benefits of Butter: ఇమ్యూనిటీని పెంచడంలో ఇదే కీలకం.. దూరంపెట్టకండి) -
మాకొద్దీ.. పుష్పుల్
సాక్షి, ఓదెల: భద్రాచలం రోడ్డు నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య నడిచే పుష్పుల్ రైలుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని సింగరేణి కార్మికుల సౌకర్యార్థం ప్రారంభించిన సింగరేణి రైలు బోగీలను మార్చి ప్రస్తుతం పుష్పుల్ రైలును నడపుతున్నారు. రెండునెలలుగా సింగరేణి రైలు బోగీలను మార్చి ఎలాంటి సౌకర్యాలు లేని పుష్‌పుల్‌ను ఏర్పాటు చేయటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. భద్రాచలం నుంచి సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌ల మధ్య అనేక మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. మూత్రశాలలు, మరగుదొడ్లులేని పుష్పుల్ బోగీలను ఏర్పాటు చేయటంతో రైలులో ప్రయాణించేవారు ఒంటికి రెంటికి వస్తే రైలు దిగాల్సివస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దారుణం. సింగరేణి రైలుకు బోగీలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు సులువుగా గమ్యం చేరేవారు. ప్రస్తుతం 12 బోగీలు మాత్రమే ఏర్పాటు చేయటంతో ప్రయాణికులు ప్రయాణం చేయలేకపోతున్నారు. ఒకవైపు మరుగుదొడ్ల లేమి, మరోవైపు బోగీలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రయాణం చేయటానికి బెంబేలెత్తుతున్నారు. మాకొద్దీ రైలు.. ఓదెల, పెద్దపల్లి, పొత్కపల్లి, కొలనూర్, మంచిర్యాల, జమ్మికుంట రైల్వేస్టేషన్లలో ఎక్కే ప్రయాణికులు ‘మాకొద్దు ఈ పుష్పుల్ రైలు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దపల్లి, రాంగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలో సింగరేణి కార్మికులు సింగరేణి రైలును యధావిధిగా నడపాలని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. 50 ఏళ్లుగా నడస్తున్న సింగరేణి రైలును మార్చటం ఏంటని విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత బోగీలతో సింగరేణి రైలును పునరుద్ధరించాలని ప్రయాణికులు కొరుతున్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు. రెండునెలల నుంచి నడస్తున్న ఎలాంటి సౌకర్యాలు లేని పుష్‌పుల్‌ను రద్దు చేయాలని ప్రయాణికులు, సింగరేణి కార్మికులు కోరుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కావున ప్రజాప్రతినిధులు దృష్టిసారించి సింగరేణి రైలును పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. -
పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టు?
హైదరాబాద్: నాగరాజు అనే మాజీ మావోయిస్టును పోలీసులు తీసుకెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఓదెల గ్రామానికి చెందిన నాగరాజు గతంలో దళంలో పనిచేశారని, కానీ గత ఆరు నెలలుగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో ఇంటివద్దనే ఉంటున్నాడని వారు తెలిపారు. గతంలో ఒకసారి ఆయనను అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా గురువారం మరోసారి తీసుకెళ్లారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజును వెంటనే విడుదల చేయాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు, పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శ పిలకా చంద్రశేఖర్ తదితరులు డిమాండ్ చేశారు.