Natural Star Nani Latest Movie Dasara First Song Release On 3rd October - Sakshi
Sakshi News home page

Nani Dasara Movie: 'ధూమ్ ధామ్ దోస్తాన్' సాంగ్ .. రిలీజ్ డేట్ ఫిక్స్

Published Sat, Oct 1 2022 6:45 PM | Last Updated on Sat, Oct 1 2022 8:23 PM

Natural Star Nani Latest Movie Dasara First Song Release On 3rd October - Sakshi

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'దసరా'. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. నానికి జోడీగా కీర్తి సురేశ్ ఈ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనెల 3న 'ధూమ్ ధామ్ దోస్తాన్' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి రిలీజైన పోస్టర్‌లో నాని లుక్ పక్కా మాస్‌ను తలపిస్తోంది.  

అయితే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. నాని ఇంతకు ముందెన్నడు చేయని మాస్‌ లుక్‌లో అభిమానులను అలరించబోతున్నారు. ఈ సినిమాలో కొత్త నానిని చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.  ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement