
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో సెక్స్ రాకెట్ గుట్టురట్టయినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి పొత్కపల్లి పోలీసులు గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా అసలు విషయం బయట పడినట్లు సమాచారం. గత కొంతకాలంగా మడకకే చెందిన ఓ యువతితో రాకేశ్, మరికొందరు నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, నీలి క్యాసెట్ల దందాను నడుపుతున్నట్లు తెలిసింది.
పోలీసులు పక్కా సమాచారంతో ఆ యువకుడిని పట్టుకోగా వీణవంక మండలంలోని చల్లూరు సెల్ పాయింట్‌లో నీలి క్యాసెట్లు లభ్యమైనట్లు విశ్వసనీయ సమాచారం. నీలి చిత్రాల ముఠా గత కొంతకాలంగా యువతులను, మహిళలను లొంగదీసుకొని వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెనక చాలామంది ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై పొత్కపల్లి ఎస్సై ఎస్.లక్ష్మణ్‌ను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, వివరాలు తర్వాత చెబుతామని పేర్కొన్నారు.
(చదవండి: Health Benefits of Butter: ఇమ్యూనిటీని పెంచడంలో ఇదే కీలకం.. దూరంపెట్టకండి)
Comments
Please login to add a commentAdd a comment