‘ఆది’ ఫేమ్‌ కీర్తీ చావ్లా.. ఈ సినిమాతో రీఎంట్రీ | Catherine Tresa and Hero Sandeep Madhav New Movie shooting starts | Sakshi
Sakshi News home page

‘ఆది’ ఫేమ్‌ కీర్తీ చావ్లా.. ఈ సినిమాతో రీఎంట్రీ

Published Fri, Sep 1 2023 4:17 AM | Last Updated on Fri, Sep 1 2023 7:04 AM

Catherine Tresa and Hero Sandeep Madhav New Movie shooting starts - Sakshi

కేథరిన్‌, సందీప్‌ మాధవ్‌

‘సందీప్‌ మాధవ్‌ హీరోగా, కేథరిన్‌ హీరోయిన్‌గా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అశోక్‌ తేజ దర్శకత్వంలో సోమా విజయ్‌ ప్రకాష్‌ నిర్మాణంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయిన సందర్భంగా దావులూరి జగదీష్‌ మాట్లాడుతూ – ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సందీప్‌ ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ క్యారక్టర్‌ చేస్తున్నారు. రెండో షెడ్యూల్‌ని ఈ నెల 4న ఆరంభిస్తాం. ప్రముఖ దర్శకుడు సంపత్‌ నందిగారు మా కథ విని ఇంప్రెస్‌ అయి, ఓ క్రేజీ టైటిల్‌ సూచించారు. ఆ టైటిల్‌ని ఈ నెల 6న ప్రకటిస్తాం. చాలా గ్యాప్‌ తర్వాత ‘ఆది’ ఫేమ్‌ కీర్తీ చావ్లా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: సతీష్‌ ముత్యాల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement