Catherine
-
‘ఆది’ ఫేమ్ కీర్తీ చావ్లా.. ఈ సినిమాతో రీఎంట్రీ
‘సందీప్ మాధవ్ హీరోగా, కేథరిన్ హీరోయిన్గా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అశోక్ తేజ దర్శకత్వంలో సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దావులూరి జగదీష్ మాట్లాడుతూ – ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సందీప్ ఓ పవర్ఫుల్ పోలీస్ క్యారక్టర్ చేస్తున్నారు. రెండో షెడ్యూల్‌ని ఈ నెల 4న ఆరంభిస్తాం. ప్రముఖ దర్శకుడు సంపత్ నందిగారు మా కథ విని ఇంప్రెస్ అయి, ఓ క్రేజీ టైటిల్ సూచించారు. ఆ టైటిల్‌ని ఈ నెల 6న ప్రకటిస్తాం. చాలా గ్యాప్ తర్వాత ‘ఆది’ ఫేమ్ కీర్తీ చావ్లా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సతీష్ ముత్యాల. -
ఏ మహిళా వెళ్లని జలధి అగాధంలోకి..
కలల నిర్మాణాన్ని కాంట్రాక్టుకివ్వొద్దంటారు క్యాథరీన్. ‘మనల్ని బాగు చేయనివ్వొద్దు.. పాడు చేయనివ్వొద్దు..’ క్యాథరీన్ ఎవరికైనా చెప్పే మాట! అంతరిక్షంలో నడిచిన ఈ తొలి అమెరికన్ మహిళ..నేడు కడలి ‘అడుగు’ను తాకివచ్చిన తొలి సాగరిక! భూ ఉపరితలాన, గగన వీధుల్లో, సముద్రపు లోతుల్లో... ఆమె కెరీర్ కలలన్నీ ఇష్టంగా ఆమె నిర్మించుకున్నవే. భూమి పుట్టి జ్ఞానమెరిగాక ఏ మహిళా వెళ్లని జలధి అగాధంలోకి వెళ్లి విజేతగా తిరిగి వచ్చారు క్యాథరీన్ సలవీన్! భూఉపరితలం నుంచి సముద్ర గర్భంలోకి ఏ ప్రాంతంలోనైతే లోతు ఎక్కువగా ఉంటుందో అంత అడుగుకూ వెళ్లగలిగారు క్యాథరీన్. కేవలం దీన్నొక సాహసంగా చూస్తే మాత్రం ఆమెను మనం తక్కువ చేసినట్లే. ‘దుస్సాహసం’ అనాలి. నింగిపైన భూకక్ష్య చుట్టూ తిరుగుతుండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రూట్ మ్యాప్‌ను చూసుకుంటూ సముద్రం లోపలికి 35 వేల అడుగుల గమ్యస్థానానికి చేరుకోవడం అంటే మత్స్యయంత్రాన్ని కొట్టడమే! నీళ్లలో కాదు, శూన్యంలో ఈదడం అది. ముప్పైఏడేళ్ల క్రితమే అంతరిక్షంలో నడిచిన ఈ తొలి అమెరికన్ మహిళ ఇప్పుడు సముద్ర గర్భంలోని ‘ఛాలెంజర్ డీప్’ వరకు వెళ్లిన తొలి ప్రపంచ మహిళ అయ్యారు. జూన్ 7 ఆదివారం క్యాథరీన్ ఈ ఘనతను సాధించారు. నాడు ‘ఛాలెంజర్ మిషన్’లో నింగిలోకి. ‘ఛాలెంజర్ డీప్’ అనేది మారియానా అగాధంలో ఉండే ఒక సముద్ర కేంద్రం. అక్కడికి ‘లిమిటింగ్ ఫ్యాక్టర్’ అనే జలాంతర్నౌకలో చేరుకున్నారు క్యాథరీన్. అంత లోతులో నీటి పీడనం సముద్ర ఉపరితలం మీద ఉండేదాని కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి చాలు బలంగా లేని జలాంతర్నౌక పేలిపోడానికి. ఇదే ప్రమాదం మనిషి వేసుకున్న రక్షణ కవచానికీ ఉంటుంది. ఇక పీడనం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉంటే శిఖరస్థాయి. లేకుంటే పాతాళం. సూక్ష్మక్రిములు మాత్రమే తట్టుకుని జీవించగల అస్థిరతలు అవి. పైగా చీకటి! క్యాథరీన్ సముద్ర విజ్ఞాన పరిశోధకురాలు కనుక తేలిగ్గా ఈదుకొచ్చేశారు. నాసా వ్యోమగామి కూడా అయిన క్యాథరీన్ గగన– సాగర అనుభవం జలాంతర్నౌక పైలట్ విక్టర్ వెస్కోవో పనిని సులభతరం చేసింది. లేకుంటే మారియానా అగాధం అతడిని తిప్పలుపెట్టి ఉండేదే. నేడు నీటిలోని ‘ఛాలెంజర్ డీప్’ లోనికి (లిమిటింగ్ ఫ్యాక్టర్ జలాంతర్నౌకలో క్యాథరీన్, పైలట్ విక్టర్ – ఆ చివర). మారియానా అగాధం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని మారియానా దీవులకు తూర్పు వైపున ఉంటుంది. ప్రపంచపటంలో పైన ఉత్తరం నుంచి నుంచి.. కింద దక్షిణానికి జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను ఒక లెఫ్ట్ బ్రాకెట్లా అర్ధచంద్రాకారంలో పేర్చుకుంటూ వస్తే.. నెలవంక మధ్యలో నక్షత్రం ఉన్నట్లు... ఆ మధ్య భాగంలో ఉంటుంది మారియానా అగాధం. మొత్తం భూగోళం మీదే అతి లోతైన సముద్ర గర్భం అది. లోపల 11 వేల మీటర్ల కింద ఉండే ప్రదేశమే.. ’ఛాలెంజర్ డీప్’. అక్కడికి చేరుకున్నారు క్యాథరీన్. ఇంతవరకు మహిళలెవరూ సాధించని విజయాన్ని ప్రపంచ మహిళావనికి సంపాదించి పెట్టారామె! ఇదంతా ఆమె అధ్యయంలో ఒక భాగం. క్యాథరీన్ అట్లాంటిక్ మహా సముద్రం పైన కూడా సాహసయాత్రలు చేశారు. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చేశారు క్యాథరీన్. ‘యు.ఎస్.నేవల్ రిజర్వు’లో ఓషనోగ్రఫీ ఆఫీసర్‌గా పని చేశారు. తర్వాత ‘నాసా’కు వెళ్లిపోయారు. భూమి, సముద్రం, ఆకాశం! ‘నాసా’లో పదిహేనేళ్లు పరిశోధనలు చేసి రిటైర్ అయ్యాక అమెరికా ప్రభుత్వ సముద్ర వాణిజ్య, వాతావరణ శాఖ సలహాదారుగా పని చేశారు. కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రావడంతో ఆ పదవి వేరే వారితో భర్తీ అయింది. ‘‘నీ దారి నువ్వే వేసుకోవాలి’’ అంటారు క్యాథరీన్. ‘‘నీ జీవితాన్ని నీకు నిర్మించి ఇచ్చేందుకు ఎప్పుడూ కొందరు సిద్ధంగా ఉంటారు. వాళ్లకు అవకాశం ఇవ్వకు. ఇస్తే వారు చెప్పే సాకులను నువ్వు వినవలసి వస్తుంది. సాకులు వెదుక్కునే వాళ్ల నుంచి మనం ఏదీ నిర్మించుకోలేం. అలాంటి వారికి మన కలల్ని ఎందుకివ్వాలి?’’ అని కూడా ప్రశ్నిస్తారు. 37 ఏళ్ల క్రితం ముప్పై ఒక్కేళ్ల వయసులో తను చేసిన ‘స్పేస్ వాక్’కి గగన సోపానాలను నిర్మించకున్నదీ, ఇప్పుడీ 68 ఏళ్ల వయసులో సముద్రగర్భంలో తను వదలి వచ్చిన ‘అడుగు’ జాడలకు దారులు నిర్మించుకున్నది పూర్తిగా తనే. తన కెరీర్‌ను ఇంకొకర్ని బాగు చేయనివ్వలేదు. పాడు చేయనివ్వలేదు క్యాథరీన్. -
బాలీవుడ్ పాటకు హాలీవుడ్ భామ డ్యాన్స్
-
కాలా చష్మా పాటతో అదరగొట్టిన కేథరిన్
హాలీవుడ్ నటి కేథరిన్ జెటా జోన్స్‌కు బాలీవుడ్ అంటే ఎంతో ఇష్టం. బాలీవుడ్ హిట్ సినిమా పాటలకు డాన్స్ చేసి అభిమానులతో పంచుకుంటారు. భర్త మైఖేల్ డగ్లస్‌తో కలిసి కేథరిన్ ఈ మధ్యే భారత పర్యటనకు వచ్చారు. ఈ జంట మనదేశానికి రావడం ఇది రెండోసారి కావడం విశేషం. భారత పర్యటన విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ హాలీవుడ్ భామ.. తాజాగా ‘బార్బార్ దేఖో’ చిత్రంలో అత్యంత పాపులర్ అయిన ‘కాలా చష్మా’పాటకు డ్యాన్స్ చేసిన వీడియాను పోస్టు చేశారు. మిగతా డ్యాన్సర్లతో కలిసి అలవోకగా కేథరిన్ స్టెప్పులేశారు. ‘డ్సాన్స్ లేకుండా నేను ఉండలేను’ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. కొద్దిరోజుల క్రితం ముంబైలో జరిగిన కార్యక్రమంలోనూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌తో కలిసి ఓం శాంతి ఓం సినిమాలోని ‘దీవాంగీ దీవాంగీ’ పాటకు ఆమె డ్యాన్స్ చేశారు. -
ప్రజల సహకారంతో మెరుగైన సేవలు
హైదరాబాద్: ప్రభుత్వంతోపాటు అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే హైదరాబాద్‌లో అమెరికా దౌత్య కార్యాలయం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా అన్నారు. నగరంలో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమీర్ పేట మెట్రోరైలు స్టేషన్లో బుధవారం ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలసి ఆమె ప్రదర్శనను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి రాష్ట్రంలో పర్యటించిన ఫొటోలు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయని అన్నారు. ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 2006 సంవత్సరంలో నగర పర్యటనకు వచ్చిన జార్జిబుష్ హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయ ఏర్పాటుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఫొటో ప్రదర్శన రెండు రోజుల పాటు ఉంటుందని తెలిపారు. -
వేసవిలో నాగకన్య
జై, వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘నీయా 2’. తెలుగులో ‘నాగకన్య’ అనే టైటిల్ పెట్టారు. ఎల్. సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ. శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని వరలక్ష్మి శరత్‌కుమార్, లక్ష్మీ రాయ్ ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు క్యాథరీన్ లుక్‌ను రిలీజ్ చేస్తారు. రేపు ‘నాగకన్య’ టీజర్ విడుదల అవుతుంది. ‘‘రిలీజ్ చేసిన లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. సినిమాలో హీరో జై క్యారెక్టర్ హైలైట్‌గా ఉంటుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ ఆడియన్స్‌ను అబ్బుర పరుస్తాయి. వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
యాంత్రికంగా బతకడమూ అవసరమైనప్పుడు
కాథరిన్ లేసీ రాసిన ప్రప్రథమ నవల ‘నోబడీ ఈజ్ ఎవర్ మిస్సింగ్’లో 28 ఏళ్ళ వయసున్న కథకురాలైన ఎలిరియ రయిలీది ప్రధాన పాత్ర. బెనార్డ్ గ్రేడ్యుయేట్. టీవీ సీరియళ్ళు రాస్తుంటుంది. మనహాటన్లో ఉంటుంది. న్యూయార్క్ నుండీ న్యూజెర్సీకి వన్ వే టికెట్టు కొనుక్కుని ఆరేళ్ళ కిందట పెళ్ళి చేసుకున్న ప్రొఫెసర్ అయిన భర్తకు కూడా ఒక్క ముక్కా చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఎవరికీ ఫోన్ చేయదు, మెయిల్ చేయదు. భర్తని ‘భర్త’ అని, లేక ‘ప్రొఫెసర్’ అని తప్ప, పేరుతో ప్రస్తావించదు. న్యూయార్కులో జరిగిన ఒక కవి సమ్మేళనంలో వర్నర్ అనే పేరున్న కవి ఆమెకు తన న్యూజెలాండ్ చిరునామా కాగితం మీద రాసిస్తాడు. న్యూజెలాండ్లో ఎలిరియ వీపు మీద బ్యాగ్ తగిలించుకుని అపరిచితులని లిఫ్టు అడుగుతూ, తల దాచుకోడానికీ, తినడానికీ చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదించుకుంటుంది. లేనప్పుడు పొలాల్లో, అడవుల్లో, పార్కుల్లో పడుకుంటుంది. భయప్రమాదాలని ఎదుర్కుంటూ దేశం తిరుగుతుంటుంది. తన్ని తాను ‘అడవి మృగం’ అనుకుంటుంది. నిజానికి ఇలా తిరగడానికి కారణం ఆమె తన నుంచి తానే పారిపోవడమే కాక, తనకున్న భయానికి గల మూలకారణాన్ని వెతుక్కోవడం కూడా. తను ‘ప్రతీదీ తప్పుగా చేసింది’ అన్న భయం. ఎలిరియ మనసులో జరిగే అంతర్గత పోరాటం గురించి పాఠకులకి అర్థం అవుతూనే ఉంటుంది. వర్నర్ ఇంటికి ఆమె చేరేటప్పటికే ఈ చిన్న నవలలో వంద పేజీలు దాటతాయి. అప్పటికే, పాఠకులకు ఆమె గురించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వయస్సు తేడా ఉన్న భర్తతో ఆమెకి పెళ్ళి జరిగిన అసాధారణమైన పరిస్థితులు, తను పొరపాటు చేసినప్పుడల్లా తనేదో చిన్నపిల్లయినట్టు, ‘ఏం? నోరు పెగలడం లేదా!’ అని మందలించే భర్త, తను గడిపే జీవితం తనదే అనిపించని భావన... తల్లి దత్తత తీసుకున్న కొరియా అమ్మాయి రూబీ ఆత్మహత్య, తనకన్నా రూబీని ఎక్కువ ప్రేమించే మద్యానికి బానిస అయిన తల్లితో తనకున్న సంతోషం లోపించిన సంబంధం... వర్నర్ ఆమెకొక గది కేటాయించి మొదట ఆమె పట్ల ఆకర్షితుడైనప్పటికీ, కొన్నాళ్ళ తరువాత ఆమెని భరించడం చాలా బాధాకరం అనుకుని ఆమెని రోడ్డుమీద వదిలేస్తాడు. ఆఖర్న ఏ ప్రేరణా, యోచనా, పరిష్కారమూ లేకుండానే ఇంటికి తిరిగి వెళ్తుంది. నెమ్మది నెమ్మదిగా ఏఏ పరిస్థితుల్లో, ఎంత యాంత్రికంగా ప్రవర్తించాలో అని నేర్చుకుంటుంది. చైతన్య స్రవంతిలో నడిచే ఈ నవల ఎలిరియ తనలో తను పడే తర్జన భర్జన గురించినది. సంభాషణలని సూచించడానికి కొటేషన్ మార్క్స్ చోట ఇటాలిక్స్ ఉపయోగిస్తారు రచయిత్రి. నవలలో కనబరిచిన హాస్యం వ్యంగ్యంగా ఉండి, బాధ కలిగిస్తుంది. శైలి స్ఫుటంగా, కచ్చితంగా ఉంటుంది. కథ ప్రారంభం పాఠకులు కథకురాలితో సంభాషిస్తూ ఉండి, వారికి ముందే సగం కథ తెలిసినట్టు అనిపించేలా ఉంటుంది. వ్యక్తిగత సంక్షోభం అనుభవిస్తున్న ఒక యువతి యొక్క అధివాస్తవిక చిత్రం ఈ పుస్తకం. నవల శీర్షిక, జాన్ బెరీమాన్ కవిత ‘డ్రీమ్ సాంగ్ 29’ నుంచి తీసుకోబడినది. ఫర్రార్, స్ట్రౌస్ మరియు జిరూ కంపనీ ఈ నవలని 2014లో ప్రచురించింది. 2016లో రచయిత్రి కాథరీన్ లేసీ ‘వైటిన్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిక్షన్’ అవార్డు గెలుచుకున్నారు. కాథరిన్ లేసీ, రచయిత్రి -కృష్ణ వేణి -
మెట్రో జర్నీ సూపర్బ్.. క్యాథరీన్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ క్యాథరీన్ బి. హడ్డా గురువారం మెట్రో జర్నీ చేశారు. రసూల్‌పురా–మెట్టుగూ డ మార్గం లో మెట్రోలో ప్రయాణించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణీకులతో సరదాగా గడి పారు. ఆమెకు మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులకు కల్పించిన వసతులు, సౌకర్యాలను ఎండీ ఎన్వీఎస్రెడ్డి వివరించారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించిన ఆధునిక సాంకేతికత, పీపీపీ ఆర్థిక నమూన, అధిగమించిన ఇంజినీరింగ్ సవాళ్లను ఆయన వివరించారు. ఆమె వెంట అమెరికా రాయబార కార్యాలయం అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ ఆకాశ్ సూరీ, ఇతర ఉన్నతాధికారులున్నారు. -
సందడి సందడిగా
హైదరాబాద్‌లోని ఫైనల్ షెడ్యూల్‌తో సందడి కంప్లీట్ అయ్యింది. కానీ సినిమాలో యాక్టర్స్ చేసిన సందడి థియేటర్లో ప్రేక్షకులను ఏ లెవెల్లో నవ్విస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగక తప్పదు. జీవా, జై, శివ, నిక్కీ గల్రానీ, కేథరిన్ ముఖ్య తారలుగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కలకలప్పు–2’. ఐదేళ్ల క్రితం సుందర్. సి దర్శకత్వంలోనే వచ్చిన ‘కలకలప్పు’ చిత్రానికి ఇది సీక్వెల్. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మొదట్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘కలకలప్పు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. థియేటర్లో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా సుందర్ తెరకెక్కించారు. లవ్లీ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు హీరో జీవా. ఇంతకీ కలకలప్పు అంటే ఏంటో తెలుసా? సందడి అని అర్థం. ఇక్కడున్న ఫొటోలో తారలు ఎలా సందడి చేశారో చూస్తున్నారుగా. షూటింగ్ చివరి రోజు స్టిల్ ఇది. సినిమాలో డబుల్ సందడి ఉంటుందట. -
సంఘమిత్రకు ముందు సందడి
కలకలప్పు... అంటే సందడి అని అర్థం. ఇప్పుడు డైరెక్టర్ సుందర్ .సి అండ్ టీమ్ సందడి సందడి చేస్తున్నారు. ఇంతకీ సుందర్ ఎవరో కాదు. రజనీకాంత్ హీరోగా వచ్చిన హిట్ మూవీ ‘అరుణాచలం’కి దర్శకుడు. ఆ తర్వాత ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అరణ్మణై–2’ తెలుగులో ‘కళావతి’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 250కోట్ల బడ్జెట్‌తో దిశా పాట్నీ, జయం రవి, ఆర్య లీడ్ రోల్స్‌లో తేనాండాళ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ‘సంఘమిత్ర’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు సుందర్. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ సినిమా వచ్చే లోపు సుందర్ .సి నుంచి ‘కలకలప్పు 2’ వస్తుంది. 2012లో ఆయన తెరకెక్కించిన హిట్ మూవీ ‘కలకలప్పు’కు సీక్వెల్ ఇది. జీవ, జై, శివ, క్యాథరిన్, నిక్కీ గల్రానీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ వారణాసిలో జరుగుతోంది. ‘సంఘమిత్ర’ షూట్‌ను డిసెంబర్లో ప్రారంభించాలనుకుంటున్నారట. ఆ లోపు ‘కలకలప్పు 2’ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. -
ఇరగదీసావ్ రా అని ఫ్రెండ్స్ అంటున్నారు
– గోపీచంద్ ‘‘ఒక మంచి కథతో ‘గౌతమ్ నంద’ సినిమా చేశా. చాలా రోజుల తర్వాత నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేశాను. నేను చేసిన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాకి అధిక వసూళ్లు వచ్చాయి. ఫ్రెండ్స్ అందరూ ఇరగదీసావ్ రా అని మెచ్చుకుంటున్నారు’’ అన్నారు గోపీచంద్. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ‘గౌతమ్‌నంద’ సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గౌతమ్‌నంద’ 6 రోజులకి రూ. 22,25,47,433 వసూలు చేసింది. మంచి కలెక్షన్స్ సాధిస్తూ సినిమా కొన్నవారందరికీ లాభాలను తెస్తోంది’’ అన్నారు. ‘‘ఇంతకు ముందు నేను చేసిన అన్ని సినిమాల్లో కంటే కథ పరంగా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. కథ పాతదే అయినా కొత్తగా చెప్పాలని ట్రై చేశా. ఎమోషనల్ సీన్స్, ట్విస్ట్‌లు మనసుకి హత్తుకునేలా ఉన్నాయని చెప్తున్నారు. ‘నువ్వు చేసిన అన్ని సినిమాల్లో కంటే నాకు బాగా నచ్చిన సినిమా ఇది’ అని మా నాన్న ఫోన్ చేసి చెప్పారు. బెస్ట్ మూవీ అని నా ఫ్రెండ్ ఫాదర్ సాంబశివరావుగారు చెప్పారు. ఇవి రెండు నా లైఫ్‌లో బెస్ట్ కాంప్లిమెంట్స్. సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. -
రానాకి యాక్టింగ్ వస్తుందా.. రాదా?అనే భయం ఉండేది .
– నిర్మాత డి. సురేశ్‌బాబు ‘‘మా వాడు(రానా) హీరో అయ్యాక తనతో నేను తీస్తున్న తొలి చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. మామూలుగా కథలంటే నాకు చాలా భయం. కథ సెలక్ట్ చేయడం కష్టం. నా కొడుకు సినిమాకి కథ అంటే ఇంకా కష్టం’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు. రానా, కాజల్, కేథరిన్, నవదీప్ ముఖ్య పాత్రల్లో తేజ దర్శకత్వంలో డి.రామానాయుడు సమర్పణలో సురేశ్‌బాబు, ఎం.వి. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో రానా చేసిన జోగేంద్ర పాత్ర పేరుతో ‘జోగేంద్ర యువగర్జన’ అనే కార్యక్రమం నిర్వహించారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘తేజ చెప్పిన కథ బాగుందనిపించి వినమని రానాకు చెప్పా. రానాకూ నచ్చింది. నేను తండ్రిని కాబట్టి.. వీడికి యాక్టింగ్ వస్తుందా? రాదా? అనే భయం ఉండేది. తొలి షెడ్యూల్ ఫస్ట్ కాపీ చూసిన కిరణ్‌రెడ్డి ‘అదిరిపోయింది సార్’ అనడంతో ధైర ్యం వచ్చింది’’ అన్నారు. రానా మాట్లాడుతూ– ‘‘వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేనెప్పుడూ దేవుడిగా చూసే వ్యక్తి ఎన్టీఆర్‌గారు. ఈ చిత్రంలోని నా పాత్రలో (జోగేంద్ర) ఎన్టీఆర్‌గారి, ఎం.జీ.ఆర్.గారి ఫిలాసఫీ ఉంటాయి. అందుకే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశా. ఈ చిత్రం మా తాత (రామానాయుడు) చూడలేకపోయారనే లోటు ఉంది. ఈ రోజు ఇక్కడ నిలుచున్నానంటే ఆయనవల్లే. ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేదనే బాధ కూడా ఉంది. మా నాన్న చాలా మంచి నిర్మాత. తేజగారి వద్ద చాలా చాలా నేర్చుకున్నా. మంచి సినిమాలు చేద్దామనే నటుణ్ణి అయ్యా. వెంకటేశ్‌గారి ఫ్యాన్స్ అండగా ఉన్నారనే ధైర్యంతో ముందుకెళుతున్నా. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇతర భాషల సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమా అయినా చేస్తా’’ అన్నారు. ‘‘కథ రాయగానే రానాకి కరెక్ట్‌గా సరిపోతుందనుకున్నా. కథ వినగానే రానా, కాజల్ ఓకే అన్నారు’’ అని తేజ చెప్పారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి, మాటల రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, లక్ష్మీ భూపాల్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు. -
అందుకే బరువు తగ్గా!
‘‘స్ట్రాంగ్ అండ్ ఎనర్జిటిక్ క్యారెక్టర్లంటే నాకిష్టం. పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉండాలి’’ అన్నారు హీరోయిన్ కేథరిన్. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘గౌతమ్‌నంద’ చిత్రంలో ఆమె ఓ కథానాయిక. హన్సిక మరో కథానాయిక. జె.భగవాన్, జె.పుల్లారావ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ చెప్పిన విశేషాలు... ♦ ఇందులో నాది యాక్ట్ చేయడానికి స్కోప్ ఉన్న ఎనర్జిటిక్ అండ్ గ్లామరస్ క్యారెక్టర్. పేరు ముగ్ధ. ‘సరైనోడు’లో నా ఎమ్.ఎల్.ఎ. క్యారెక్టర్‌కు వచ్చినంత మంచి రెస్పాన్స్ ముగ్ధ పాత్రకు వస్తుందనుకుంటున్నా. ♦ ఈ సినిమాలో హన్సిక కొన్ని సీన్స్‌లో మేకప్ లేకుండా చేశారు. మా కాంబినేషన్ సీన్స్ తక్కువ. సెట్లో హన్సిక ఎనర్జిటిక్‌గా యాక్ట్ చేయడం నచ్చింది. ♦ గోపీచంద్‌గారు ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కోసం హార్డ్‌వర్క్ చేశారు. ఈ స్క్రిప్ట్ బాగుంది. సంపత్‌గారు హీరోయిజమ్ మీద కాకుండా స్క్రిప్ట్ పై కాన్సన్ట్రేట్ చేశారు. ♦ ‘హూ యామ్ ఐ. ఏ జర్నీ ఇన్ టూ యువర్ సెల్ఫ్’ అనే మేసేజ్ ఈ సినిమాలో ఉంటుంది. నా గురించి నిత్యం ఎంతో కొంత కొత్తగా తెలుసుకునేందుకు ట్రై చేస్తుంటాను. అయితే ‘నువ్వెవరు?’ అనడిగితే.. ఇప్పుడు చెప్పలేను. నా 50 ఏళ్ల వయసులో చెప్పగలుగుతా. ♦ స్పీడ్‌గా డ్యాన్స్ చేసేందుకే వెయిట్‌లాస్ అయ్యాను. ఈ సినిమాలోని రెయిన్‌సాంగ్ వన్నాఫ్ మై ఫేవరెట్స్. బరువు తగ్గింది స్పెషల్‌గా ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం కాదు. బరువు తగ్గడం ఈ మూవీకి ప్లస్ అయింది. ♦ నాకు హైదరాబాదీలంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను. నేనేదో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాలని తాపత్రయపడటం లేదు. మంచి సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్లు చేయాలనుకుంటాను. ఒక ఐడియాను ఎగ్జాట్లీ స్క్రీన్‌పై ఎగ్జిక్యూట్ చేసే ఒక గుడ్ టీమ్‌తో వర్క్ చేయాలనుకుంటున్నాను. సినిమా అనేది టీమ్ ఎఫెర్ట్. ఇవి నా రాబోయే రెండు సినిమాల్లో మీకు కనిపిస్తాయనుకుంటున్నాను. ♦ ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. ‘ఇద్దరమ్మాయిలతో..’ అప్పుడు పూరీగారు ట్రై చేయమన్నారు. సెట్ కాలేదు. ఎందుకంటే నాకప్పుడు పెద్దగా తెలుగు రాదు. కృష్ణవంశీగారు ఛాన్స్ ఇచ్చి, సూట్ కాలేదన్నారు. ‘గౌతమ్‌నంద’తో సెట్ అయినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇంకా నేర్చుకుంటున్నా. ఓ లెక్చరర్‌ను పెట్టుకున్నా. చిన్నప్పుడు చర్చిలో పాడేదాన్ని. భవిష్యత్‌లో ఏదైనా సినిమాకి పాడతారా అంటే దాని గురించి ఇప్పుడే చెప్పలేను. ♦ హీరోయిన్గా విభిన్న కోణాలను చూపించాలని ‘నేనే రాజు నేనే మంత్రి ’లో దేవికారాణి పాత్ర చేశా. పర్సనల్‌గా స్మోక్ చేయను. కానీ, ఈ సినిమా కోసం చేశాను. అలా చేస్తేనే కరెక్ట్ అని, సినిమా చూశాక ఆడియన్స్ కూడా అంటారు. డ్రగ్స్ వల్ల లైఫ్ వేస్ట్ అవుతుంది డ్రగ్స్ వ్యవహారం గురించి నేను పెద్దగా ఫాలో అవ్వడంలేదు. డ్రగ్స్ అనేది వేస్ట్ ఆఫ్ టైమ్. వేస్ట్ ఆఫ్ లైఫ్. అందుకే అవి తీసుకోవద్దని కోరుతున్నా. ప్రపంచంలో ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి. లైఫ్ అనేది గాడ్స్ గిఫ్ట్. దానిని వేస్ట్ చేసుకోకూడదు. -
చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేశా
– గోపీచంద్చ్– గోపీచంద్చ్– గోపీచంద్ ‘‘సంపత్ రెండున్నర గంటలు ఈ కథ చెప్పాడు. మొత్తం విన్న నెక్ట్స్ మినిట్ ఓకే చెప్పాను. అయితే ఎక్కువ బడ్జెట్ అవుతుందేమోనని నిర్మాతలతో అన్నాను. కథను నమ్మి, వారు ఖర్చు పెట్టారు. ఈ నిర్మాతలతో మళ్లీ ఓ సినిమా చేయాలనుంది’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్ హీరోగా, హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన చిత్రం ‘గౌతమ్‌నంద’. ఎస్.ఎస్. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని కేథరిన్ రిలీజ్ చేసి గోపీచంద్‌కి అందించారు. నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘కెమెరామెన్ సౌందర రాజన్ గురించి విన్నా... ఈ సినిమా ద్వారా ఆయన వర్క్‌ని స్వయంగా చూశా. డైరెక్టర్‌గారి విజన్‌ను విజువల్‌గా వంద శాతం తెరపైకి తీసుకొచ్చారాయన. తొలిసారి ఇద్దరు హీరోయిన్లతో నటించా. ‘శంఖం’ తర్వాత తమన్‌తో ఈ సినిమా చేశా. సంగీతం కంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం. ‘గౌతమ్‌నంద’ తన మనసుకు నచ్చిన సినిమా అని తమన్ అన్నాడంటే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీసుంటాడు. నేను చేసిన బెస్ట్ డైరెక్టర్లలో సంపత్ ఒకరు. తనతో ఎప్పుడైనా మరో సినిమా చేస్తా. అంత నమ్మకం వచ్చింది. నేను గుండెలపై చేయి వేసుకుని చెప్పగలను. చాలా రోజుల తర్వాత బాగా యాక్ట్ చేశాననే సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. ‘గౌతమ్‌నంద’ వంటి మంచి సినిమా చేశానని ఎప్పుడైనా ధైర్యంగా నా కుటుంబ సభ్యులకు, పిల్లలకు కూడా చెప్పగలను. ఈ సినిమా ప్రేక్షకుణ్ణి డిజప్పాయింట్ చేయదు’’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘భగవాన్ శ్రీ రమణ మహర్షిగారి ఒక అక్షరాన్ని తీసుకుని ఈ కథ తయారు చేశా. టాప్ టెన్ మంచి కథల్లో ఈ సినిమా ఉంటుంది. మంచి కథకి తగ్గట్టు హీరో దొరకాలి. రెండున్నర గంటలు కథ విని ఒక్క అక్షరం కూడా మార్చమనకుండా అలాగే తీయమని గోపీగారు అన్న మాటలే నాకు ఆక్సిజన్‌లా పనిచేశాయి. గోపీగారి నుంచి వంద శాతం నటన ఎక్స్పెక్ట్ చేస్తే వెయ్యి శాతం ఇచ్చారాయన. ఈ సినిమాలో అభిమానులు ఆయన విశ్వరూపం చూడబోతున్నారు. ఈ నెల 28న మీ ముందుకు రానున్న ఈ చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘తొంభై రోజుల్లో కంప్లీట్ చేద్దామని ఈ సినిమాను స్టార్ట్ చేసి 115 రోజుల్లో ఏ సమస్యా లేకుండా కంప్లీట్ చేశాం. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత పుల్లారావు. తమన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ గారితో ‘శంఖం’ తర్వాత ‘గౌతమ్‌నంద’ చేశాను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. సంపత్‌కి బ్రెయిన్లో హార్డ్‌డిస్క్ ఉంది. తనను సంతృప్తి పరచడం ఈజీ కాదు’’ అన్నారు. కేథరిన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, కెమెరామెన్ సౌందర రాజన్, ఎడిటర్ గౌతమ్ రాజు, ‘గౌతమ్‌నంద’ ప్రమోషన్ పార్టనర్ ఏ.ఎం. రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. -
హీరోకి స్ఫూర్తి
తుంబుర వాయిస్తూ మైమరచిపోతున్న ముద్దుగుమ్మ హన్సికను చూస్తే ‘భైరవద్వీపం’ సినిమాలోని ‘శ్రీ తుంబుర నారద నాదామృతం.. స్వరరాగ రసభావ తాలాన్వితం’ పాట గుర్తుకు రాక మానదు. అంతలా మైమరచిపోయారీ బ్యూటీ. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గౌతమ్ నంద’. హన్సిక, కేథరిన్ హీరోయన్లు. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల లుక్స్‌ను చిత్రబృందం విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా హన్సిక పోషిస్తున్న ‘స్ఫూర్తి’ పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావ్ మాట్లాడుతూ– ‘‘స్ఫూర్తి అనే సంప్రదాయ యువతిగా హన్సిక నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. హీరో క్యారెక్టర్‌కు స్ఫూర్తిగా నిలిచే పాత్ర ఆమెది. త్వరలోనే ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తాం’’ అన్నారు. -
రమణ మహర్షి స్ఫూర్తితో...
‘గౌతమ్‌నంద’... సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా పేరు. ఈ టైటిల్ అనౌన్స్ చేయగానే ‘‘అరే... ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌కల్యాణ్ పేరును గోపీచంద్ సిన్మాకు టైటిల్‌గా పెట్టారు’’ అనుకున్నారంతా. ఈ టైటిలే కాదు... కథతో కూడా పవన్‌కు లింక్ ఉందట! అంటే... గతంలో పవన్‌కల్యాణ్‌కు చెప్పిన కథతోనే దర్శకుడు సంపత్ నంది ఈ సినిమా తీస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్! ‘రచ్చ’ సూపర్ హిట్టయిన తర్వాత పవన్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో రెండేళ్ల పాటు కష్టపడి, సంపత్ ఓ స్క్రిప్ట్ రెడీ చేశారు. కానీ, సిట్యువేషన్స్ సెట్ కాలేదు. సినిమా పట్టాలు ఎక్కలేదు. అప్పుడు పవన్‌కు చెప్పిన కథతో ఇప్పుడీ ‘గౌతమ్‌నంద’ తీస్తున్నారని కృష్ణానగర్ కుర్రాళ్లు అంటున్నారు. దర్శకుడు సంపత్ నంది ఈ పుకార్లను ఖండించారు. కంప్లీట్ కొత్త కథతో ఈ సినిమా తీస్తున్నట్టు చెప్పారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ను 20 లక్షల మంది నెటిజన్లు చూశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలో ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన పాటల్ని, ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు. తనలో తన ప్రయాణం...తన కోసం తన ప్రయాణం! పవన్‌కల్యాణ్‌గారి కోసమే ప్రత్యేకంగా కథ రాశా. ఆయనకు చెప్పిన కథకు, ‘గౌతమ్‌నంద’కు సంబంధం లేదు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో తీస్తున్నాను. రమణ మహర్షి ‘హూ యామ్ ఐ’ పుస్తకం స్ఫూర్తితో ఈ కథ రాశా. రెండు మూడేళ్లు ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేశా. గౌతమ్ అనే ఓ బిలీనియర్ తనను తాను వెతుక్కునే జర్నీలో ఏం తెలుసుకున్నాడనేది చిత్రకథ. ‘తనలో తన ప్రయాణం. తన కోసం తన ప్రయాణం’ అనేది థీమ్. అందుకే ‘ఎజర్నీ ఇన్టు ద సెల్ఫ్’ అని క్యాప్షన్ పెట్టాను. – సంపత్ నంది -
కౌంట్ డౌన్ స్టార్ట్!
వన్, టు, త్రీ అంటూ ‘గౌతమ్ నంద’ యూనిట్ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. అందుకే ఈ లెక్క అన్నమాట. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో జె.భగవాన్, జె.పుల్లారావ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. హన్సిక, కేథరిన్ కథానాయికలు. ఈ నెల 12న గోపీచంద్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ పాత్రను సంపత్ నంది చాలా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాడు. కథ–కథనాలే ఈ చిత్రానికి బలం. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. మా బ్యానర్ నుండి వస్తున్న బెస్ట్ సినిమాగా ‘గౌతమ్ నంద’ నిలుస్తుంది. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో–ఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, సంగీతం: తమన్, కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్–లక్ష్మణ్. -
పట్టుదలే పరుగెత్తించింది
50 ఏళ్ల తర్వాత మళ్లీ బోస్టన్ మారథాన్ పూర్తి చేసిన కేథరిన్ 1967... అలనాడు అడ్డుకున్నారు... అమ్మాయిలకు మారథాన్‌లో ప్రవేశం లేదన్నారు... ఎలాగైనా పరుగెత్తాలన్న ఆశ... బరిలోకి దిగితే పక్కకు నెట్టేశారు... కానీ... ఆమె మారథాన్‌ను పూర్తి చేసింది. 20 ఏళ్లప్పుడు ఉన్న పట్టుదలే 70 ఏళ్లప్పుడు మళ్లీ పరుగెత్తించింది. ఆమె... కేథరిన్ స్విట్జెర్. 50 ఏళ్ల తర్వాత తన పరుగు ముచ్చట మరోసారి తీర్చుకుంది. 1967లోనే మహిళలకు సమాన హక్కులనే పోరాటం చేసిన కేథరిన్ అమెరికాలో ప్రతిష్టాత్మక బోస్టన్ మారథాన్‌లో పరుగు పెట్టేందుకు స్విట్జెర్ పేరుతో లింగ ప్రస్తావన లేకుండా అర్హతలన్నీ పూర్తిచేసింది. ఇక మిగిలింది ఫైనల్ మారథాన్ రేస్. ఆశల పల్లకిలో స్విట్జర్... కుతూహలంకొద్దీ బరిలోకి... ప్చ్..! పరుగు మొదలైన కాసేపటికే నిలువరింత..! నీకు ఆ చాన్సేలేదన్నా... ఆమె ఆశలపై నీళ్లు చల్లినా... బెదరలేదు. సంకల్పం గట్టిగా ఉంటే సాధన సులభమవుతుందని తన పరుగుతో చాటి చెప్పింది కేథరిన్! 2017... కాలచక్రం గిర్రున తిరిగి యాభై ఏళ్లయింది. సోమవారం బోస్టన్ మారథాన్ ఫైనల్ రేసు జరిగింది. అమెరికా రన్నర్ కేథరిన్ మళ్లీ బరిలోకి దిగింది. ఇందులో పరుగందుకున్న 70 ఏళ్ల కేథరిన్ మొత్తం 42.195 కిలోమీటర్ల పరుగును 4 గంటల 44 నిమిషాల 31 సెకన్లలో పూర్తి చేసింది. తన వయసు కేటగిరీలో 8వ స్థానంలో నిలిచింది. 120 ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్ మారథాన్‌ను పూర్తి చేసిన అలనాటి తొలి మహిళగా మరోసారి రికార్డులకెక్కింది. ఈ మారథాన్‌లో 1972 నుంచి అధికారికంగా మహిళలకు ప్రవేశం కల్పించారు. నాడు కేథరిన్నుఅడ్డుకుంటున్న నిర్వాహకులు భారతీయుడి ఘనత... ఇదే మారథాన్‌లో బెంగళూరుకు చెందిన సాగర్ బహేతి కూడా రికార్డులకెక్కాడు. పాక్షిక అంధత్వమున్న సాగర్ ఈ రేసును 4 గంటల 14 నిమిషాల 7 సెకన్లలో పూర్తిచేసి 18వ స్థానంలో నిలిచాడు. కేవలం ఒక మీటర్ దూరమే చూడగలిగే సాగర్ మారథాన్ లక్ష్యంపై గురిపెట్టడం విశేషం. దీంతో రేసు పూర్తి చేసిన తొలి భారతీయ అంధ రేసర్‌గా అతను ఘనతకెక్కాడు. తమ కుమారుడి పరుగును ప్రోత్సహించేందుకు అతని తల్లిదండ్రులు విష్ణుకాంత, నరేశ్ బహేతి భారత్ నుంచి అమెరికా వెళ్లారు. -
అడవిలో గజేంద్రుడు
ఆర్య, కేథరీన్ జంటగా రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజేంద్రుడు’. సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో తెరకెక్కిన 89వ చిత్రమిది. కుటుంబమంతా కలసి చూసి, ఎంజాయ్ చేసేలా ఉంటుంది. హీరో హీరోయిన్ పాత్రలకు తగ్గట్టు అద్భుతంగా నటించారు. యువన్ శంకర్ రాజా స్వరపరచిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు. ‘‘అడవి నేపథ్యంలో మొత్తం సినిమా చేయడమంటే అంత సులభం కాదు. చౌదరిగారి సపోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాâý్లం కాదు. రాఘవ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. తను భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో పెద్ద దర్శకుడిగా ఎదుగుతాడు’’ అని ఆర్య అన్నారు. -
దూకింది ఎవరు?
ఎల్తైన ప్రదేశం నుంచి కిందకి చూడాలంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అలాంటిది విమానం నుంచి అమాంతం దూకమంటే... ‘బతికుంటే బలిసాకైనా తిని బతకొచ్చు’ అని పారిపోతారు. అదే గోపీచంద్‌లాంటి డేర్ అండ్ డ్యాషింగ్ వ్యక్తులైతే ఆలోచించకుండా ‘ఓకే’ అనేస్తారు. దర్శకుడు సంపత్ నంది ఈ ‘స్కై డైవింగ్’ గురించి చెప్పగానే గోపీచంద్ ‘సై’ అన్నారు. ప్రస్తుతం గోపీ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘గౌతమ్ నంద’ చిత్రం కోసమే ఈ స్కై డైవ్ సీన్స్ చిత్రీకరించారు. ‘‘సౌతిండియన్ మూవీస్‌లో పూర్తి స్థాయి ‘స్కై డైవ్’ ఎపిసోడ్ ఉన్న మొదటి సినిమా మాదే. గోపీచంద్‌గారి ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. ఆయన అభిమానులకు కచ్చితంగా పండగే’’ అని సంపత్ నంది పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఫస్ట్ లుక్ పోస్టర్లో సై్టలిష్ లుక్స్‌తో ఇప్పటికే గోపీచంద్ ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన ‘గౌతమ్ ఘట్టమనేని’, ‘నందకిషోర్’గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇంతకీ స్కై డైవ్ చేసింది గౌతమా? లేక నందకిషోరా?... ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పం అంటోంది ‘గౌతమ్ నంద’ యూనిట్. శ్రీ బాలజీ సినీమీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, కేథరిన్ కథానాయికలు. -
జి ఫర్ గౌతమ్‌నంద
లుక్.. లుక్... గోపీచంద్ కొత్త లుక్ ఇదేనండీ. కొత్త హెయిర్ స్టైలు.. రఫ్‌గా పెంచిన గడ్డం.. ఓ చేతిలో కోటు.. మాంచి స్టైలిషగా ఉన్నారు కదూ. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రంలోని లుక్ ఇది. శ్రీ బాలజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్,జె. పుల్లారావులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గౌతమ్‌నంద’ అనే టైటిల్ ఖరారు చేశారు. మామూలుగా ‘జి’ ఫర్ గోపీచంద్.. కానీ, ఇప్పుడు మాత్రం ‘జి’ ఫర్ గౌతమ్‌నంద అనాలి. శనివారం గోపీచంద్ ఫస్ట్ లుక్ విడుదల చేసి, టైటిల్ అనౌన్స్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో చివరి టాకీ షెడ్యూల్ మొదలవుతుంది. అది పూర్తయిన తర్వాత విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. మార్చిలో పాటల్ని, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్–లక్ష్మణ్, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఎస్. సౌందర్‌రాజన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
విశాఖలో సినీనటి కెథరిన్ సందడి
-
క్లైమాక్స్ గురూ!
సెట్లో దర్శకులు షాట్ తీసే ముందు ‘స్టార్ట్.. కెమేరా.. యాక్షన్’ అనడం సహజమే. దర్శకుడు సంపత్ నంది ఏమో ‘యాక్షన్.. యాక్షన్.. యాక్షన్’ అంటున్నారు. ఎకో ఎఫెక్ట్ ఏమీ కాదండీ! గోపీచంద్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అంత హై–ఎండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయట! శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న ఈ సినిమా నాలుగో షెడ్యూల్ మంగళవారం మొదలైంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్‌తో పాటు హీరో గోపీచంద్, హీరోయిన్లు హన్సిక, కేథరిన్‌లపై కీలక సన్నివేశాల్ని ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నాం. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో తీసిన యాక్షన్ సీన్లు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. సినిమాలో యాక్షన్‌తో పాటు మంచి ప్రేమకథ, ఎమోషనల్ సీన్లను దర్శకుడు సంపత్‌నంది బాగా హ్యాండిల్ చేశారు. ఫిబ్రవరి 20తో నాలుగో షెడ్యూల్ ముగుస్తుంది. త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల చేసి, టైటిల్ ప్రకటిస్తాం. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నికితిన్ ధీర్, తనికెళ్ల భరణి, ముఖేశ్‌రుషి, అజయ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
ఆ ఇద్దరూ అవుట్..ఈ ఇద్దరూ ఇన్..!
ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరూ చెప్పలేరు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అంతే. కథ, నటీనటులు, టెక్నీషియన్లు.. అనూహ్యంగా మారుతుంటారు. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, విశాల్ కొత్త సినిమాలోనూ ఇటువంటి మార్పులే చోటు చేసుకున్నాయి. ‘ఖైదీ నంబర్ 150’ నుంచి కేథరిన్, విశాల్ సినిమా నుంచి రకుల్ ప్రీత్‌సింగ్ బయటకు వచ్చేయగా.. వాళ్ల ప్లేస్సుల్లోకి రాయ్ లక్ష్మి, అనూ ఇమ్మాన్యుయేల్ ఎంటరయ్యారు. అప్పుడు తమ్ముడితో.. ఇప్పుడు అన్నయ్యతో..! పవన్ కల్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ‘తప్పు తప్పే.. శుద్ధ తప్పే’ పాటలో డ్యాన్స్ చేసిన రాయ్ లక్ష్మి, ఇప్పుడు అన్నయ్య చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’లో ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేస్తున్నారు. మొదట ఈ పాటలో నటించే అవకాశం ఇటీవల ‘సరైనోడు’లో ఓ హీరోయిన్గా నటించిన కేథరిన్‌కు దక్కింది. చిరంజీవి, కేథరిన్‌లపై ఓ రోజు షూటింగ్ కూడా చేశారట. కానీ, హఠాత్తుగా సీన్లోకి రాయ్ లక్ష్మి వచ్చేశారు. ఈ మార్పుకి కారణం చిత్ర బృందానికే ఎరుక. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిత్రకథానాయకుడు చిరంజీవి, రాయ్‌లక్ష్మి పాల్గొనగా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి రాఘవా లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రకుల్ బిజీ.. అనూ రెడీ..! మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించనున్న సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. మూడేళ్ల విరామం తర్వాత కోలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి రకుల్ కూడా రెడీ అన్నారు. అయితే.. విశాల్ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే సమయానికి, రకుల్ తెలుగులో బాగా బిజీ అయ్యారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘ధృవ’, మహేశ్‌బాబు-ఏఆర్ మురుగదాస్ సినిమాల్లో నటిస్తున్నారామె. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న సాయిధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లోనూ రకులే హీరోయిన్. తెలుగులో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రకుల్‌కు, విశాల్ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదట. చేసేదేం లేక చిత్రబృందం మలయాళీ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌ను సంప్రదించారట. ఇటీవల చెన్నై వెళ్లిన అనూ.. కథ, అందులో తన క్యారెక్టర్ గురించి దర్శకుడితో డిస్కస్ చేశారట. కథ, ఆమె పాత్ర బాగా నచ్చడంతో విశాల్ సరసన నటించడానికి వెంటనే అంగీకరించారని సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే బ్యాలెన్స్. ఇంతకీ.. ఈ అనూ ఇమ్మాన్యుయేల్ ఎవరనుకున్నారు? ఇటీవల విడుదలైన నాని ‘మజ్ను’లో మెయిన్ హీరోయిన్గా నటించారు. గోపీచంద్ ‘ఆక్సిజన్’లోనూ తనే హీరోయిన్. -
ఖైదీతో ఆటా పాటా?
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. వీవీ వినాయక్ దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ ఐటెమ్ సాంగ్ చేయనున్నారని తాజా సమాచారం. వాస్తవానికి చిరూ సరసన తమన్నా ఐటెమ్ సాంగ్ చేయనున్నారని ఓ వార్త వినిపించింది. ‘తమన్నాతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది’ అంటూ గతంలో చిరు ఓ ఫంక్షన్లో చెప్పారు కూడా. దాంతో అందరూ ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం తమన్నాకే ఉంటుందనుకున్నారు. కానీ, ఎవరి ఊహలకూ అందని విధంగా సీన్లోకి సడెన్‌గా కేథరిన్ పేరు వచ్చింది. త్వరలో చిరు, కేథరిన్ పాల్గొనగా హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో పాటను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
అప్పట్నుంచి అవార్డులు మొదలుపెట్టా!
-
అప్పట్నుంచి అవార్డులు మొదలుపెట్టా!
‘నేను చిన్నప్పట్నుంచీ సంతోషం అవార్డు వేడుకలు చూస్తున్నా. నంది, ఫిలింఫేర్ అవార్డుల తర్వాత ఆ స్థాయిలో నటీనటులు, టెక్నీషియన్స్‌ను ఎంకరేజ్ చేస్తూ జరుగుతున్న అవార్డుల కార్యక్రమం ఇదే. ఈ వేడుక ఇలానే కొనసాగాలి’’అని హీరో నిఖిల్ అన్నారు. ‘సంతోషం’ వార పత్రిక ఈ నెల 2న 14 వసంతాలు పూర్తి చేసుకుని, పదిహేనో ఏట అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఈ నెల 14న హైదరాబాద్‌లో ‘సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్’ వేడుకలు జరగనున్నాయి. విశ్వ రాసి, కంపోజ్ చేసిన ‘సంతోషం’ సాంగ్‌ను నిఖిల్ విడుదల చేశారు. ీహ రోయిన్ కేథరిన్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ వేడుక ఇన్విటేషన్స్ అందుకున్నారు. పత్రికాధినేత సురేశ్ కొండేటి మాట్లాడుతూ- ‘‘సంతోషం’ పత్రిక ప్రారంభించిన రెండో ఏడాది బాలకృష్ణగారు ‘సంతోషం’ పేరున అవార్డులు ఇస్తే బాగుంటుందని చెప్పారు. అప్పట్నుంచి అవార్డులిస్తున్నా. నేను బ్రతికి ఉన్నంత కాలం ఈ అవార్డులను అందిస్తూనే ఉంటా’’ అన్నారు. దర్శకుడు కల్యాణ్ కృష్ణ, నటులు శివాజీ రాజా, ఏడిద శ్రీరాం, గాయకుడు సింహా, తదితరులు పాల్గొన్నారు. -
రెండోసారి ఇద్దరమ్మాయిలతో...
మన స్టార్ హీరోలు నటించే చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండటం సహజం. కానీ, గోపీచంద్ మాత్రం ఇప్పటివరకూ పదిహేడు చిత్రాలు చేస్తే వాటిలో పదహారు చిత్రాల్లో సోలో హీరోయిన్‌తోనే చేశారు. ‘మొగుడు’ చిత్రంలో తొలిసారి ఇద్దరు హీరోయిన్లు తాప్సీ, శ్రద్ధాదాస్‌తో జతకట్టారాయన. మళ్లీ ఐదేళ్లకు రెండోసారి ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో గోపీచంద్ సరసన హన్సిక ఒక హీరోయిన్గా ఫిక్సయిన విషయం తెలిసిందే. తాజాగా కేథరిన్‌ను మరో హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో, హీరోయిన్లను తెరపై అందంగా చూపించడంలో సంపత్నందిది ప్రత్యేకశైలి. మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం విందు భోజనంలా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్. -
నెత్తుటి జ్ఞాపకం
నిజాలు దేవుడికెరుక ఫిబ్రవరి 4, 1986... ఆస్ట్రేలియా... ‘‘ఊరుకో గ్రేస్. అనీటాకేమీ కాదు’’... గుమ్మం దగ్గరే నిలబడి కన్నీళ్లు పెట్టుకుం టోన్న భార్యకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు గ్యారీ లిన్ష్. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. గ్రేస్ కన్నీళ్లు ఆగలేదు. ‘‘ఎలా ఊరుకోమంటావు గ్యారీ? ఒకటా రెండా... నలభై ఎనిమిది గంటలయ్యింది అనీటా జాడ తెలియక. తనకి ఏమయ్యిందో ఎలా ఉందో తెలీక ఈ తల్లి ప్రాణం ఎంతగా కొట్టుకుంటోందో నీకు అర్థం కాదు.’’ గ్యారీ మాట్లాడలేదు. ఏం మాట్లాడ తాడు! పాపం అతని పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. రెండు రోజుల య్యింది అనీటా ఇంటికి రాక. చుట్టు పక్కలంతా వెతికారు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. కానీ తన జాడ మాత్రం తెలియ లేదు. కూతుర్ని తలచుకుంటూ గ్రేస్ కుమిలిపోతోంది. ఆమెను ఓదార్చలేక, తనను తాను సంభాళించుకోలేక గ్యారీ అవస్థ పడుతున్నాడు. అంతలో వచ్చింది వాళ్ల చిన్న కూతురు క్యాథరీన్. ‘‘అమ్మా... నాన్నా... ఇలా దిగాలు పడిపోతే ఎలా? పోలీస్ కంప్లయింట్ ఇచ్చాం కదా? ధైర్యంగా ఉం.... క్యాథరీన్ మాట పూర్తి కాకముందే ఏదో వాహనం వచ్చి గేటు ముందు ఆగింది. చూస్తే పోలీస్ జీప్. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కెనడీ జీపు దిగి వస్తున్నాడు. అనీటా గురించి ఏమైనా తెలిసిందే మోనన్న ఆశ ఓపక్క, అది తాము విని తట్టుకోలేని వార్త అవుతుందేమోనన్న భయం మరోపక్క ఆ ముగ్గురినీ ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. ‘‘ఎలా ఉన్నారు మిస్టర్ గ్యారీ’’ అన్నాడు కెనడీ, వాళ్ల దగ్గరకు వచ్చి. గ్యారీ సమాధానం చెప్పేలోపే గ్రేస్ ఆతృతగా అడిగింది... ‘‘అనీటా గురించి ఏమైనా తెలిసిందా?’’ ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు కెనడీ. తర్వాత జేబులోంచి ఓ ఉంగరాన్ని బయటకు తీశాడు. ‘‘ఇక్కడికి కొన్ని కిలో మీటర్ల దూరంలో పొలాలు ఉన్నాయి. వాటిలో ఓ యువతి మృతదేహం దొరి కింది. గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. తన చేతికి ఒక ఉంగరం ఉంది. అది మీ అమ్మాయిదేమో చూస్తారని...’’ ‘‘నో’’... పరిసరాలు దద్దరిల్లేలా అరిచింది గ్రేస్. ‘‘అలా అనొద్దు ఇన్స్పెక్టర్. నా బిడ్డకి ఏమీ కాదు. తను ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటుంది.’’ జాలేసింది కెనడీకి. ఆ అమ్మాయి అనీటాయో కాదో తనకీ తెలియదు. కన్ఫామ్ చేసుకోవాలని వచ్చాడు. కానీ గ్రేస్ పరిస్థితి చూశాక ఆమెను కదిలించ డానికే బాధనిపిస్తోంది. అందుకే ఆ ఉంగరాన్ని గ్యారీకి అందించాడు. ‘‘మీరైనా చెప్పండి. ఇది మీ అమ్మాయి అనీటదా?’’ ఆ ఉంగరాన్ని గబుక్కున లాక్కుంది గ్రేస్. అటూ ఇటూ తిప్పి చూసింది. ‘‘ఏంటి సర్ ఇది? దీన్నిండా మట్టి పేరుకు పోయి ఉంది. ఇది అనీటాది ఎందుకవు తుంది? తనది కాదు’’ అంది తిరిగిచ్చేస్తూ. కెనడీ ఉంగరాన్ని అందుకోలేదు. ‘‘అది మట్టి కాదు మిసెస్ గ్యారీ... రక్తం. ఎండిపోయి అలా కనిపిస్తోంది.’’ ఉలిక్కిపడింది గ్రేస్. ఠక్కున ఆ ఉంగ రాన్ని వదిలేసింది. ‘‘రక్తమా?’’ అంది కంగారుగా. అవునన్నట్టు తలూపాడు కెనడీ. క్యాథరీన్ ఆ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుంది. దాన్ని చూస్తూనే ఆమె కళ్లు కన్నీటి చెలమలయ్యాయి. ‘‘అక్కా’’ అంటూ బావురుమంది. కెనడీకి అర్థమైంది. ఆ ఉంగరం అనీటాదే. ‘‘సారీ... బాడీ మార్చురీలో ఉంది. ఓసారి వచ్చి చూస్తే మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం’’ అంటూ గేటువైపు నడిచాడు. ‘‘అనీటా... నా తల్లీ... నన్ను వదిలేసి వెళ్లిపోయావా?’’... కూతురి మృతదేహం మీద పడి గ్రేస్ హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆమెని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. గ్యారీ అయితే ప్రాణమున్న బొమ్మలా నిలబడ్డాడు. తన బిడ్డకు పట్టిన గతికి కుమిలిపోతున్నాడు. కానీ క్యాథరీన్ ఏడవడం లేదు. కూర్చుని కుమిలిపోవడం లేదు. తన అక్కకి ఎందుకా పరిస్థితి ఏర్పడిందా అని యోచిస్తోంది. అంతలో కెనడీ వచ్చాడు. ‘‘మిస్ క్యాథరీన్... ఇది అనీటా పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్. మీరిక బాడీని తీసుకెళ్లవచ్చు.’’ రిపోర్ట్ అందుకోలేదు క్యాథరీన్. కెనడీ వైపు తీక్షణంగా చూసింది. ‘‘మా అక్కకి ఏం జరిగింది సర్?’’ అంది సూటిగా. కెనడీ మాట్లాడలేదు. తన అక్కకి ఏం జరిగిందో తెలిస్తే ఆ అమ్మాయి తట్టుకో గలదా? ఎంత దారుణంగా తమ కూతురు మరణించిందో, కన్ను మూసేముందు ఎంత నరకం అనుభవించిందో తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోవా? అని ఆలోచిస్తున్నాడు. ‘‘చెప్పండి సర్. మా అక్కని ఎవరు చంపారు?’’ పెదవి విప్పక తప్పలేదు కెనడీకి. ‘‘తనమీద గ్యాంగ్‌రేప్ జరిగింది క్యాథరీన్. వాళ్లు కొట్టిన దెబ్బలకి మీ అక్క ఒంట్లో ఎముకలు చాలావరకూ విరిగిపోయాయి. నరాలు చిట్లిపోయాయి. ఒళ్లంతా పదునైన ఆయుధాలతో గాట్లు పెట్టారు. చివరికి తన చేతివేళ్లు కూడా కోసేశారు. ఇంత ఘోరమైన రేప్‌ని నేనెప్పుడూ చూడలేదు.’’ మౌనంగా వింటోంది క్యాథరీన్. అప్పుడు కూడా ఆమె కళ్లు వర్షించడం లేదు. నిప్పులు కురుస్తున్నాయి. ‘‘నేను వాళ్లని చూడాలి సర్’’ అంది నిశ్చలంగా. ‘‘ఇంకా దొరకలేదు. ఆ ప్రయత్నం లోనే ఉన్నాం. త్వరలోనే కేసు ఛేదిస్తాం. ఐ ప్రామిస్’’ అన్నాడు కెనడీ. అన్న మాటను నిలబెట్టుకోవడానికి అతనికి దాదాపు నెల రోజులు పట్టింది. అనీటా మృతదేహం దొరికిన చోట ఎటు వంటి ఆధారాలూ దొరకలేదు. కానీ పోస్ట్ మార్టమ్ రిపోర్టును బట్టి ఆమెను రేప్ చేసింది ఐదుగురు వ్యక్తులని తెలిసింది. ఆధారాలు దొరకనప్పుడు ఒక్క నిందితు డిని పట్టుకోవడమే కష్టం. అలాంటిది ఐదుగురిని పట్టుకోవాలి. అయినా అతడు టెన్షన్ పడలేదు. తన తెలివిని, అనుభ వాన్ని ఉపయోగించి ఇన్వెస్టిగేట్ చేశాడు. అనీటా నర్స్‌గా పని చేస్తోన్న హాస్పి టల్ దగ్గర మొదలైంది వేట. రెండో తేదీ సాయంత్రం ఎనిమిది గంటలకు అనీటా డ్యూటీ ముగిసింది. తర్వాత చిన్న పార్టీ ఉంటే స్నేహితులతో కలిసి రెస్టారెంటుకు వెళ్లి భోంచేసింది. ఆపైన ఇంటికెళ్లేందుకు రోజూలాగే లోకల్ ట్రైన్ ఎక్కింది. స్టేషన్లో రైలు దిగింది. బయటకు వచ్చి, ట్యాక్సీ కోసం వెతికింది. కానీ అక్కడ ఒక్క ట్యాక్సీ కూడా లేదు. దాంతో నడక అందుకుంది. హాస్పిటల్ డ్యూటీ రికార్డులు, రెస్టా రెంట్, రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ద్వారా ఇంతవరకూ తెలిసింది. అప్పటి వరకూ అనీటా క్షేమంగానే ఉంది. కానీ స్టేషన్ నుంచి ఇంటికి నడక ప్రారంభించిన తర్వాతే ఏదో జరిగింది. అదే అర్థం కాలేదు పోలీసులకి. అనీటా ఫొటోలతో పోస్టర్లు తయారు చేశారు. ఆమె రోజూ ప్రయాణించే లోకల్ రైళ్లలో, స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనీటా ఇంటి వరకూ ఉన్న ప్రతి వీధిలో అంటించారు. ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పమన్నారు. వారి ప్రయత్నం ఫలించింది. అనీటా పోస్టర్లు చూసిన ఓ పదిహే నేళ్ల పిల్లాడు తల్లిదండ్రుల్ని తీసుకుని పోలీ సుల దగ్గరకు వచ్చాడు. ఆ రోజు జరిగిం దంతా పోలీసులకు వివరించాడు. రోడ్డు మీద నడుస్తోన్న అనీటా దగ్గరకు ఓ కారు వచ్చి ఆగింది. ఐదుగురు యువకులు దిగారు. అనీటాని అసభ్యమైన మాటలతో వేధించారు. ఆమె తప్పించుకు వెళ్లాలని చూసింది. కానీ వాళ్లు వదిలి పెట్టలేదు. లాక్కెళ్లి కారులో పడేశారు. ఏడుస్తున్నా కనికరించలేదు. ఇదంతా తాను చూశానని ఆ పిల్లాడు పోలీసులకు చెప్పాడు. అతను చెప్పిన కారు వివరాలను బట్టి ఇన్వెస్టిగేషన్ మొదలైంది. చివరికి ఆ కారే ఐదుగురు నిందితులనూ పట్టించింది. ఆ ఐదుగురిలో ముగ్గురు అన్నదమ్ములే కావడం విచిత్రం! ‘‘మానవత్వమన్నదే మర్చిపోయి రాక్షసుల్లా ప్రవర్తించిన వీరికి మనుషుల మధ్య బతికే హక్కు లేదు. అందుకే వీరు జీవితాంతం జైలు గోడల మధ్యే మగ్గాలని తీర్పు ఇస్తున్నాను.’’ న్యాయమూర్తి ఈ తీర్పు చెబుతున్న ప్పుడు క్యాథరీన్ కళ్లు తొలిసారి వర్షిం చాయి. అవి ఆనంద బాష్పాలు కాదు. తన అక్కను క్రూరంగా చంపిన కామాంధులను చంపేయకుండా జైలులో పెట్టమన్నందుకు బాధతో వచ్చిన కన్నీళ్లు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒకే మాట అంది. ‘‘మా అక్కకి నరకం చూపించి చంపిన వాళ్లను సుఖంగా జైలులో విశ్రాంతి తీసుకొమ్మని తీర్పు ఇచ్చారు. వాళ్లకంటే న్యాయస్థానమే మా అక్కకు ఎక్కువ అన్యాయం చేసింది.’’ క్యాథరీన్ మాటలతో కొన్ని లక్షల మంది ఏకీభవించారు. వాళ్లంతా నేటికీ అనీటాకి న్యాయం జరగలేదని బాధపడు తున్నారు. యేటా ఫిబ్రవరి 2న ఆమె వర్థంతి సందర్భంగా రోడ్ల మీదకు వచ్చి సంతాపం తెల్పుతూనే ఉన్నారు. ఆమె ఆత్మశాంతికై ప్రార్థనలూ చేస్తున్నారు. ఆ ప్రార్థనలు అనీటా ఆత్మకు శాంతిని కలిగిస్తున్నాయా? లేక ఆమె కూడా తనకు న్యాయం జరగలేదని ఘోషిస్తోందా?! అనీటా మరణం ఆస్ట్రేలియా దేశాన్ని కుదిపేసింది. ప్రభుత్వం మహిళల భద్రత కోసం అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకోవడం మొదలుపెట్టింది. కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెట్టింది. వాటిని సక్రమంగా అమలయ్యేలా అధికారులు చూస్తున్నారు. అది అనీటాకు తాము ఇచ్చే గౌరవం అంటున్నారు. వాళ్లు ప్రతియేటా అనీటా వర్థంతి రోజున, ఆమె పేరుమీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కులో జరిగే సంతాప సభల్లో పాల్గొంటు న్నారు. పోలీసులైతే ఆరోజున మహిళల రక్షణ గురించి క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. మరణించి ఇరవై తొమ్మిదేళ్లయినా అనీటా ఎవ్వరి మనసుల నుంచీ వెళ్లలేదు అనడానికి అనడానికి ఇదే సాక్ష్యం. ఆమె... తుడిచివేద్దామన్నా తుడవలేని ఓ నెత్తుటి జ్ఞాపకం! - సమీర నేలపూడి -
విదేశాల్లో కూడా ఆ సినిమా విడుదల
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ థ్రిల్లర్ సినిమా 'ఖాన్'ను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నారు. శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి భాషలైన స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వంటి భాషల్లో కూడా తర్జుమా చేయనున్నారు. తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గొప్పగా ఆధరిస్తారన్న నమ్మకం తనకు ఉందంటూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మొత్తం పది అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో తాప్సీ, కేథరిన్లు హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ అంతర్జాతీయంగా విడుదల చేసే చిత్రంలో పాటలు ఉండవని, సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే దర్శకుడు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
తమ్ముడు తరువాత అన్నయ్యతో..
కోలీవుడ్ నటి క్యాథరిన్‌కు కలిసొచ్చిందా?.. అవుననే సమాధానమే వస్తోంది. టాలీవుడ్లో తొలుత ఎంటర్ అయిన ఈ నార్త్ బ్యూటీకి అక్కడ తొలి చిత్రం ఇద్దరమ్మాయిలతో నిరాశ పరచింది. అయితే కోలీవుడ్ అక్కున చేర్చుకుంది. కార్తీ సరసన నటించిన మెడ్రాస్ చిత్రం క్యాథరిన్‌కు మంచి విజయాన్ని ఇచ్చింది. అమ్మడి నటనకూ మంచి మార్కులే పడ్డాయి. దీంతో మంచి జోష్‌లో ఉంది. అంతకంటే క్యాథరిన్‌ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం మరొకటుంది. అదే సూర్యతో రొమాన్స్చేసే అవకావం రావడం. సూర్య ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మాస్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న సూర్య సరసన నయనతార, ఎమిజాక్సన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం తరువాత సూర్య మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రంలో ఆయనతో రొమాన్స్చేసే అవకాశం లక్కీగర్ల్ క్యాథరిన్‌ను వరించనుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రంలోని నాయికి పాత్రకు క్యాథరిన్ చక్కగా సరిపోతుందని దర్శక, హీరోలు భావించారట. దర్శకుడు క్యాథరిన్‌కు కథ కూడా వినిపించారట. విన్నవెంటనే మరో మాట లేకుండా ఓకే చెప్పేసిందట ఈ ముద్దుగుమ్మ. విక్రమ్‌కుమార్ చిత్రాలలో కథానాయకుడితో పాటు కథానాయికకు నటించడానికి స్కోప్ ఉంటుందని ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అని క్యాథరిన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. సూర్య లాంటి స్టార్ హీరో సరసన నటించే చాన్స్ రావడం నిజంగా లక్కీ అంది. అయితే సూర్య సరసన క్యాథరిన్ నటించే విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయని యూనిట్ వర్గాలంటున్నారు. ఏదేమైనా తమ్ముడు (కార్తి) సరసన నటించిన క్యాథరిన్‌కు అన్నయ్య (సూర్య)తో నటించే అవకాశం రావడం ఒక రకంగా ప్రమోషన్ లాంటిదే. ప్రస్తుతం క్యాథరిన్ అధర్వ సరసన కణిదన్ చిత్రంలో నటిస్తోంది. -
ఫారిన్ టూర్ లో బుల్లి ప్రిన్స్ హల్ చల్!
బ్రిటన్ బుల్లి యువరాజు జార్జ్ బయటకు అడుగుపెట్టిన తొలి రోజునే ఆకట్టుకోవడమే కాకుండా, పతాక శీర్షికలోకెక్కాడు. ప్రిన్స్ విలియమ్, కేథరిన్ ల ముద్దుల తనయుడు జార్జ్ న్యూజిలాండ్ లో తొలి అధికార పర్యటనను చేశాడు. వెల్లింగ్టన్ లో బలమైన గాలులు, వర్షం, మసక చీకటి స్వాగత పలికినా.. బుల్లి యువరాజు ముఖంలో నవ్వు చెక్కుచెదరలేదు. మూడు వారాల పర్యటనలో భాగంగా తన తల్లితండ్రులతో కలిసి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో బుడతడు పర్యటించనున్నాడు. జూలై 22 తేదిన జన్మించిన తర్వాత జార్జ్ బహ్యప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి.