![హీరోకి స్ఫూర్తి](/styles/webp/s3/article_images/2017/09/5/71498244725_625x300.jpg.webp?itok=gptg5O1c)
హీరోకి స్ఫూర్తి
తుంబుర వాయిస్తూ మైమరచిపోతున్న ముద్దుగుమ్మ హన్సికను చూస్తే ‘భైరవద్వీపం’ సినిమాలోని ‘శ్రీ తుంబుర నారద నాదామృతం.. స్వరరాగ రసభావ తాలాన్వితం’ పాట గుర్తుకు రాక మానదు. అంతలా మైమరచిపోయారీ బ్యూటీ. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గౌతమ్ నంద’. హన్సిక, కేథరిన్ హీరోయన్లు.
ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల లుక్స్‌ను చిత్రబృందం విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా హన్సిక పోషిస్తున్న ‘స్ఫూర్తి’ పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావ్ మాట్లాడుతూ– ‘‘స్ఫూర్తి అనే సంప్రదాయ యువతిగా హన్సిక నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. హీరో క్యారెక్టర్‌కు స్ఫూర్తిగా నిలిచే పాత్ర ఆమెది. త్వరలోనే ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తాం’’ అన్నారు.