Gautam Nanda
-
హీరోకి స్ఫూర్తి
తుంబుర వాయిస్తూ మైమరచిపోతున్న ముద్దుగుమ్మ హన్సికను చూస్తే ‘భైరవద్వీపం’ సినిమాలోని ‘శ్రీ తుంబుర నారద నాదామృతం.. స్వరరాగ రసభావ తాలాన్వితం’ పాట గుర్తుకు రాక మానదు. అంతలా మైమరచిపోయారీ బ్యూటీ. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గౌతమ్ నంద’. హన్సిక, కేథరిన్ హీరోయన్లు. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల లుక్స్‌ను చిత్రబృందం విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా హన్సిక పోషిస్తున్న ‘స్ఫూర్తి’ పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావ్ మాట్లాడుతూ– ‘‘స్ఫూర్తి అనే సంప్రదాయ యువతిగా హన్సిక నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. హీరో క్యారెక్టర్‌కు స్ఫూర్తిగా నిలిచే పాత్ర ఆమెది. త్వరలోనే ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తాం’’ అన్నారు. -
ఇలాంటి రిస్క్ ఏ హీరో తీసుకోడు
– ‘దిల్’ రాజు ‘‘గౌతమ్ నంద’లో గోపీచంద్ హీరోగా, విలన్‌గా చేస్తున్నాడు. ఆ రెండు పాత్రలు ఆయనొక్కడే చేయగలడు. మరో తెలుగు హీరో ఇలాంటి రిస్క్‌లు తీసుకోడు. ట్రైలర్ చూస్తుంటే సంపత్ నంది సినిమా ఎంత బాగా తీశాడో తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. గోపీచంద్ హీరోగా, హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న సినిమా ‘గౌతమ్ నంద’. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘నన్ను, నా కథను నమ్మి గోపీచంద్ గారు ఈ సినిమా చేస్తున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెడతాను. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకపోవడంతో సినిమా చాలా క్వాలిటీగా వస్తోంది’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశమున్న చిత్రమిది. ఇందులో నా గత చిత్రాలకంటే డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తా. సంపత్ గారు సినిమా బాగా తీస్తున్నారు. గత ఏడాది మీడియా సమక్షంలో పుట్టినరోజు చేసుకున్నా. ఈ ఏడాది ‘గౌతమ్ నంద’ యూనిట్ సమక్షంలో జరుపుకున్నా’’ అన్నారు గోపీచంద్. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
కౌంట్ డౌన్ స్టార్ట్!
వన్, టు, త్రీ అంటూ ‘గౌతమ్ నంద’ యూనిట్ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. అందుకే ఈ లెక్క అన్నమాట. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో జె.భగవాన్, జె.పుల్లారావ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. హన్సిక, కేథరిన్ కథానాయికలు. ఈ నెల 12న గోపీచంద్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ పాత్రను సంపత్ నంది చాలా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాడు. కథ–కథనాలే ఈ చిత్రానికి బలం. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. మా బ్యానర్ నుండి వస్తున్న బెస్ట్ సినిమాగా ‘గౌతమ్ నంద’ నిలుస్తుంది. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో–ఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, సంగీతం: తమన్, కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్–లక్ష్మణ్. -
దూకింది ఎవరు?
ఎల్తైన ప్రదేశం నుంచి కిందకి చూడాలంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అలాంటిది విమానం నుంచి అమాంతం దూకమంటే... ‘బతికుంటే బలిసాకైనా తిని బతకొచ్చు’ అని పారిపోతారు. అదే గోపీచంద్‌లాంటి డేర్ అండ్ డ్యాషింగ్ వ్యక్తులైతే ఆలోచించకుండా ‘ఓకే’ అనేస్తారు. దర్శకుడు సంపత్ నంది ఈ ‘స్కై డైవింగ్’ గురించి చెప్పగానే గోపీచంద్ ‘సై’ అన్నారు. ప్రస్తుతం గోపీ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘గౌతమ్ నంద’ చిత్రం కోసమే ఈ స్కై డైవ్ సీన్స్ చిత్రీకరించారు. ‘‘సౌతిండియన్ మూవీస్‌లో పూర్తి స్థాయి ‘స్కై డైవ్’ ఎపిసోడ్ ఉన్న మొదటి సినిమా మాదే. గోపీచంద్‌గారి ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. ఆయన అభిమానులకు కచ్చితంగా పండగే’’ అని సంపత్ నంది పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఫస్ట్ లుక్ పోస్టర్లో సై్టలిష్ లుక్స్‌తో ఇప్పటికే గోపీచంద్ ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన ‘గౌతమ్ ఘట్టమనేని’, ‘నందకిషోర్’గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇంతకీ స్కై డైవ్ చేసింది గౌతమా? లేక నందకిషోరా?... ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పం అంటోంది ‘గౌతమ్ నంద’ యూనిట్. శ్రీ బాలజీ సినీమీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, కేథరిన్ కథానాయికలు. -
జి ఫర్ గౌతమ్‌నంద
లుక్.. లుక్... గోపీచంద్ కొత్త లుక్ ఇదేనండీ. కొత్త హెయిర్ స్టైలు.. రఫ్‌గా పెంచిన గడ్డం.. ఓ చేతిలో కోటు.. మాంచి స్టైలిషగా ఉన్నారు కదూ. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రంలోని లుక్ ఇది. శ్రీ బాలజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్,జె. పుల్లారావులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గౌతమ్‌నంద’ అనే టైటిల్ ఖరారు చేశారు. మామూలుగా ‘జి’ ఫర్ గోపీచంద్.. కానీ, ఇప్పుడు మాత్రం ‘జి’ ఫర్ గౌతమ్‌నంద అనాలి. శనివారం గోపీచంద్ ఫస్ట్ లుక్ విడుదల చేసి, టైటిల్ అనౌన్స్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో చివరి టాకీ షెడ్యూల్ మొదలవుతుంది. అది పూర్తయిన తర్వాత విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. మార్చిలో పాటల్ని, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్–లక్ష్మణ్, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఎస్. సౌందర్‌రాజన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్.