కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌! | Gopichand's 'Gautam Nanda' is releasing the teaser in the week | Sakshi
Sakshi News home page

కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌!

Published Tue, Jun 6 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌!

కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌!

వన్, టు, త్రీ అంటూ ‘గౌతమ్‌ నంద’ యూనిట్‌ కౌంట్‌ డౌన్‌ మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. అందుకే ఈ లెక్క అన్నమాట. గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో జె.భగవాన్, జె.పుల్లారావ్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. హన్సిక, కేథరిన్‌ కథానాయికలు.


ఈ నెల 12న గోపీచంద్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌ పాత్రను సంపత్‌ నంది చాలా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాడు. కథ–కథనాలే ఈ చిత్రానికి బలం. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. మా బ్యానర్‌ నుండి వస్తున్న బెస్ట్‌ సినిమాగా ‘గౌతమ్‌ నంద’ నిలుస్తుంది. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి  స్క్రిప్ట్‌ కో–ఆర్డినేటర్‌: సుధాకర్‌ పవులూరి, సంగీతం: తమన్, కెమెరా: ఎస్‌. సౌందర్‌ రాజన్, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: రామ్‌–లక్ష్మణ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement