అందుకే బరువు తగ్గా! | "Gautamandha will be released on the 28th of this month | Sakshi
Sakshi News home page

అందుకే బరువు తగ్గా!

Published Wed, Jul 26 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

అందుకే బరువు తగ్గా!

అందుకే బరువు తగ్గా!

‘‘స్ట్రాంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ క్యారెక్టర్లంటే నాకిష్టం. పెర్ఫార్మ్‌  చేయడానికి స్కోప్‌ ఉండాలి’’ అన్నారు హీరోయిన్‌ కేథరిన్‌. గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందిన ‘గౌతమ్‌నంద’ చిత్రంలో ఆమె ఓ కథానాయిక. హన్సిక మరో కథానాయిక. జె.భగవాన్, జె.పుల్లారావ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్‌ చెప్పిన విశేషాలు...

ఇందులో నాది యాక్ట్‌ చేయడానికి స్కోప్‌ ఉన్న ఎనర్జిటిక్‌ అండ్‌ గ్లామరస్‌ క్యారెక్టర్‌. పేరు ముగ్ధ. ‘సరైనోడు’లో నా ఎమ్‌.ఎల్‌.ఎ. క్యారెక్టర్‌కు వచ్చినంత మంచి రెస్పాన్స్‌ ముగ్ధ పాత్రకు వస్తుందనుకుంటున్నా.

ఈ సినిమాలో హన్సిక కొన్ని సీన్స్‌లో మేకప్‌ లేకుండా చేశారు. మా కాంబినేషన్‌ సీన్స్‌ తక్కువ. సెట్‌లో హన్సిక ఎనర్జిటిక్‌గా యాక్ట్‌ చేయడం నచ్చింది. 

గోపీచంద్‌గారు ఈ సినిమాలో రెండు షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ కోసం హార్డ్‌వర్క్‌ చేశారు. ఈ స్క్రిప్ట్‌ బాగుంది. సంపత్‌గారు హీరోయిజమ్‌ మీద కాకుండా స్క్రిప్ట్‌ పై కాన్సన్‌ట్రేట్‌ చేశారు.

‘హూ యామ్‌ ఐ. ఏ జర్నీ ఇన్‌ టూ యువర్‌ సెల్ఫ్‌’ అనే మేసేజ్‌ ఈ సినిమాలో ఉంటుంది. నా గురించి నిత్యం ఎంతో కొంత కొత్తగా తెలుసుకునేందుకు ట్రై చేస్తుంటాను. అయితే ‘నువ్వెవరు?’ అనడిగితే.. ఇప్పుడు చెప్పలేను. నా 50 ఏళ్ల వయసులో చెప్పగలుగుతా.

స్పీడ్‌గా డ్యాన్స్‌ చేసేందుకే వెయిట్‌లాస్‌ అయ్యాను. ఈ సినిమాలోని రెయిన్‌సాంగ్‌ వన్నాఫ్‌ మై ఫేవరెట్స్‌. బరువు తగ్గింది స్పెషల్‌గా ఈ సినిమాలోని క్యారెక్టర్‌ కోసం కాదు. బరువు తగ్గడం ఈ మూవీకి ప్లస్‌ అయింది.

నాకు హైదరాబాదీలంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను. నేనేదో నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాలని తాపత్రయపడటం లేదు. మంచి సినిమాల్లో స్ట్రాంగ్‌ క్యారెక్టర్లు చేయాలనుకుంటాను.  ఒక ఐడియాను ఎగ్జాట్లీ స్క్రీన్‌పై ఎగ్జిక్యూట్‌ చేసే ఒక గుడ్‌ టీమ్‌తో వర్క్‌ చేయాలనుకుంటున్నాను. సినిమా అనేది టీమ్‌ ఎఫెర్ట్‌. ఇవి నా రాబోయే రెండు సినిమాల్లో మీకు కనిపిస్తాయనుకుంటున్నాను.

ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. ‘ఇద్దరమ్మాయిలతో..’ అప్పుడు పూరీగారు ట్రై చేయమన్నారు. సెట్‌ కాలేదు. ఎందుకంటే నాకప్పుడు పెద్దగా తెలుగు రాదు. కృష్ణవంశీగారు ఛాన్స్‌ ఇచ్చి, సూట్‌ కాలేదన్నారు. ‘గౌతమ్‌నంద’తో సెట్‌ అయినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇంకా నేర్చుకుంటున్నా. ఓ లెక్చరర్‌ను పెట్టుకున్నా. చిన్నప్పుడు చర్చిలో పాడేదాన్ని. భవిష్యత్‌లో ఏదైనా సినిమాకి పాడతారా అంటే దాని గురించి ఇప్పుడే చెప్పలేను.

హీరోయిన్‌గా విభిన్న కోణాలను చూపించాలని ‘నేనే రాజు నేనే మంత్రి ’లో దేవికారాణి పాత్ర చేశా. పర్సనల్‌గా స్మోక్‌ చేయను. కానీ, ఈ సినిమా కోసం చేశాను. అలా చేస్తేనే కరెక్ట్‌ అని, సినిమా చూశాక ఆడియన్స్‌ కూడా అంటారు.

డ్రగ్స్‌ వల్ల లైఫ్‌ వేస్ట్‌ అవుతుంది
డ్రగ్స్‌ వ్యవహారం గురించి నేను పెద్దగా ఫాలో అవ్వడంలేదు. డ్రగ్స్‌ అనేది వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌. వేస్ట్‌ ఆఫ్‌ లైఫ్‌. అందుకే అవి తీసుకోవద్దని కోరుతున్నా. ప్రపంచంలో ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి. లైఫ్‌ అనేది గాడ్స్‌ గిఫ్ట్‌. దానిని వేస్ట్‌ చేసుకోకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement