Gautamandha
-
ఇరగదీసావ్ రా అని ఫ్రెండ్స్ అంటున్నారు
– గోపీచంద్ ‘‘ఒక మంచి కథతో ‘గౌతమ్ నంద’ సినిమా చేశా. చాలా రోజుల తర్వాత నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేశాను. నేను చేసిన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాకి అధిక వసూళ్లు వచ్చాయి. ఫ్రెండ్స్ అందరూ ఇరగదీసావ్ రా అని మెచ్చుకుంటున్నారు’’ అన్నారు గోపీచంద్. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ‘గౌతమ్‌నంద’ సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గౌతమ్‌నంద’ 6 రోజులకి రూ. 22,25,47,433 వసూలు చేసింది. మంచి కలెక్షన్స్ సాధిస్తూ సినిమా కొన్నవారందరికీ లాభాలను తెస్తోంది’’ అన్నారు. ‘‘ఇంతకు ముందు నేను చేసిన అన్ని సినిమాల్లో కంటే కథ పరంగా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. కథ పాతదే అయినా కొత్తగా చెప్పాలని ట్రై చేశా. ఎమోషనల్ సీన్స్, ట్విస్ట్‌లు మనసుకి హత్తుకునేలా ఉన్నాయని చెప్తున్నారు. ‘నువ్వు చేసిన అన్ని సినిమాల్లో కంటే నాకు బాగా నచ్చిన సినిమా ఇది’ అని మా నాన్న ఫోన్ చేసి చెప్పారు. బెస్ట్ మూవీ అని నా ఫ్రెండ్ ఫాదర్ సాంబశివరావుగారు చెప్పారు. ఇవి రెండు నా లైఫ్‌లో బెస్ట్ కాంప్లిమెంట్స్. సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. -
అందుకే బరువు తగ్గా!
‘‘స్ట్రాంగ్ అండ్ ఎనర్జిటిక్ క్యారెక్టర్లంటే నాకిష్టం. పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉండాలి’’ అన్నారు హీరోయిన్ కేథరిన్. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘గౌతమ్‌నంద’ చిత్రంలో ఆమె ఓ కథానాయిక. హన్సిక మరో కథానాయిక. జె.భగవాన్, జె.పుల్లారావ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ చెప్పిన విశేషాలు... ♦ ఇందులో నాది యాక్ట్ చేయడానికి స్కోప్ ఉన్న ఎనర్జిటిక్ అండ్ గ్లామరస్ క్యారెక్టర్. పేరు ముగ్ధ. ‘సరైనోడు’లో నా ఎమ్.ఎల్.ఎ. క్యారెక్టర్‌కు వచ్చినంత మంచి రెస్పాన్స్ ముగ్ధ పాత్రకు వస్తుందనుకుంటున్నా. ♦ ఈ సినిమాలో హన్సిక కొన్ని సీన్స్‌లో మేకప్ లేకుండా చేశారు. మా కాంబినేషన్ సీన్స్ తక్కువ. సెట్లో హన్సిక ఎనర్జిటిక్‌గా యాక్ట్ చేయడం నచ్చింది. ♦ గోపీచంద్‌గారు ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కోసం హార్డ్‌వర్క్ చేశారు. ఈ స్క్రిప్ట్ బాగుంది. సంపత్‌గారు హీరోయిజమ్ మీద కాకుండా స్క్రిప్ట్ పై కాన్సన్ట్రేట్ చేశారు. ♦ ‘హూ యామ్ ఐ. ఏ జర్నీ ఇన్ టూ యువర్ సెల్ఫ్’ అనే మేసేజ్ ఈ సినిమాలో ఉంటుంది. నా గురించి నిత్యం ఎంతో కొంత కొత్తగా తెలుసుకునేందుకు ట్రై చేస్తుంటాను. అయితే ‘నువ్వెవరు?’ అనడిగితే.. ఇప్పుడు చెప్పలేను. నా 50 ఏళ్ల వయసులో చెప్పగలుగుతా. ♦ స్పీడ్‌గా డ్యాన్స్ చేసేందుకే వెయిట్‌లాస్ అయ్యాను. ఈ సినిమాలోని రెయిన్‌సాంగ్ వన్నాఫ్ మై ఫేవరెట్స్. బరువు తగ్గింది స్పెషల్‌గా ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం కాదు. బరువు తగ్గడం ఈ మూవీకి ప్లస్ అయింది. ♦ నాకు హైదరాబాదీలంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను. నేనేదో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాలని తాపత్రయపడటం లేదు. మంచి సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్లు చేయాలనుకుంటాను. ఒక ఐడియాను ఎగ్జాట్లీ స్క్రీన్‌పై ఎగ్జిక్యూట్ చేసే ఒక గుడ్ టీమ్‌తో వర్క్ చేయాలనుకుంటున్నాను. సినిమా అనేది టీమ్ ఎఫెర్ట్. ఇవి నా రాబోయే రెండు సినిమాల్లో మీకు కనిపిస్తాయనుకుంటున్నాను. ♦ ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. ‘ఇద్దరమ్మాయిలతో..’ అప్పుడు పూరీగారు ట్రై చేయమన్నారు. సెట్ కాలేదు. ఎందుకంటే నాకప్పుడు పెద్దగా తెలుగు రాదు. కృష్ణవంశీగారు ఛాన్స్ ఇచ్చి, సూట్ కాలేదన్నారు. ‘గౌతమ్‌నంద’తో సెట్ అయినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇంకా నేర్చుకుంటున్నా. ఓ లెక్చరర్‌ను పెట్టుకున్నా. చిన్నప్పుడు చర్చిలో పాడేదాన్ని. భవిష్యత్‌లో ఏదైనా సినిమాకి పాడతారా అంటే దాని గురించి ఇప్పుడే చెప్పలేను. ♦ హీరోయిన్గా విభిన్న కోణాలను చూపించాలని ‘నేనే రాజు నేనే మంత్రి ’లో దేవికారాణి పాత్ర చేశా. పర్సనల్‌గా స్మోక్ చేయను. కానీ, ఈ సినిమా కోసం చేశాను. అలా చేస్తేనే కరెక్ట్ అని, సినిమా చూశాక ఆడియన్స్ కూడా అంటారు. డ్రగ్స్ వల్ల లైఫ్ వేస్ట్ అవుతుంది డ్రగ్స్ వ్యవహారం గురించి నేను పెద్దగా ఫాలో అవ్వడంలేదు. డ్రగ్స్ అనేది వేస్ట్ ఆఫ్ టైమ్. వేస్ట్ ఆఫ్ లైఫ్. అందుకే అవి తీసుకోవద్దని కోరుతున్నా. ప్రపంచంలో ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి. లైఫ్ అనేది గాడ్స్ గిఫ్ట్. దానిని వేస్ట్ చేసుకోకూడదు. -
చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేశా
– గోపీచంద్చ్– గోపీచంద్చ్– గోపీచంద్ ‘‘సంపత్ రెండున్నర గంటలు ఈ కథ చెప్పాడు. మొత్తం విన్న నెక్ట్స్ మినిట్ ఓకే చెప్పాను. అయితే ఎక్కువ బడ్జెట్ అవుతుందేమోనని నిర్మాతలతో అన్నాను. కథను నమ్మి, వారు ఖర్చు పెట్టారు. ఈ నిర్మాతలతో మళ్లీ ఓ సినిమా చేయాలనుంది’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్ హీరోగా, హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన చిత్రం ‘గౌతమ్‌నంద’. ఎస్.ఎస్. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని కేథరిన్ రిలీజ్ చేసి గోపీచంద్‌కి అందించారు. నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘కెమెరామెన్ సౌందర రాజన్ గురించి విన్నా... ఈ సినిమా ద్వారా ఆయన వర్క్‌ని స్వయంగా చూశా. డైరెక్టర్‌గారి విజన్‌ను విజువల్‌గా వంద శాతం తెరపైకి తీసుకొచ్చారాయన. తొలిసారి ఇద్దరు హీరోయిన్లతో నటించా. ‘శంఖం’ తర్వాత తమన్‌తో ఈ సినిమా చేశా. సంగీతం కంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం. ‘గౌతమ్‌నంద’ తన మనసుకు నచ్చిన సినిమా అని తమన్ అన్నాడంటే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీసుంటాడు. నేను చేసిన బెస్ట్ డైరెక్టర్లలో సంపత్ ఒకరు. తనతో ఎప్పుడైనా మరో సినిమా చేస్తా. అంత నమ్మకం వచ్చింది. నేను గుండెలపై చేయి వేసుకుని చెప్పగలను. చాలా రోజుల తర్వాత బాగా యాక్ట్ చేశాననే సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. ‘గౌతమ్‌నంద’ వంటి మంచి సినిమా చేశానని ఎప్పుడైనా ధైర్యంగా నా కుటుంబ సభ్యులకు, పిల్లలకు కూడా చెప్పగలను. ఈ సినిమా ప్రేక్షకుణ్ణి డిజప్పాయింట్ చేయదు’’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘భగవాన్ శ్రీ రమణ మహర్షిగారి ఒక అక్షరాన్ని తీసుకుని ఈ కథ తయారు చేశా. టాప్ టెన్ మంచి కథల్లో ఈ సినిమా ఉంటుంది. మంచి కథకి తగ్గట్టు హీరో దొరకాలి. రెండున్నర గంటలు కథ విని ఒక్క అక్షరం కూడా మార్చమనకుండా అలాగే తీయమని గోపీగారు అన్న మాటలే నాకు ఆక్సిజన్‌లా పనిచేశాయి. గోపీగారి నుంచి వంద శాతం నటన ఎక్స్పెక్ట్ చేస్తే వెయ్యి శాతం ఇచ్చారాయన. ఈ సినిమాలో అభిమానులు ఆయన విశ్వరూపం చూడబోతున్నారు. ఈ నెల 28న మీ ముందుకు రానున్న ఈ చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘తొంభై రోజుల్లో కంప్లీట్ చేద్దామని ఈ సినిమాను స్టార్ట్ చేసి 115 రోజుల్లో ఏ సమస్యా లేకుండా కంప్లీట్ చేశాం. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత పుల్లారావు. తమన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ గారితో ‘శంఖం’ తర్వాత ‘గౌతమ్‌నంద’ చేశాను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. సంపత్‌కి బ్రెయిన్లో హార్డ్‌డిస్క్ ఉంది. తనను సంతృప్తి పరచడం ఈజీ కాదు’’ అన్నారు. కేథరిన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, కెమెరామెన్ సౌందర రాజన్, ఎడిటర్ గౌతమ్ రాజు, ‘గౌతమ్‌నంద’ ప్రమోషన్ పార్టనర్ ఏ.ఎం. రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. -
రెండూ కష్టమైన పాత్రలే!
‘‘ఇప్పుడు పరిస్థితులు, కథలు మారాయి. కథలు రాసే విధానం మారింది. ప్రేక్షకులు కథలో కొత్తదనం ఉంటేనే ఆదరిస్తున్నారు. పక్కా కమర్షియల్, ఊర మాస్ సినిమాలు చేస్తే క్రెడిబిలిటీ దొరకడం లేదు. కథలో ఏదైనా నావల్టీ ఉంటేనే ముందుకు వెళ్లాలని నా ఆలోచన’’ అన్నారు దర్శకుడు సంపత్ నంది.ఈ రోజు ఆయన బర్త్‌డే. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘గౌతమ్‌నంద’ తెరకెక్కిస్తున్న సంపత్ నంది ఈ సందర్భంగా చెప్పిన ముచ్చట్లు.... ► ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి? చెన్నైలో ‘గౌతమ్‌నంద’ చిత్రీకరణలో పుట్టినరోజు జరుపుకుంటున్నా. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ను ఇప్పటివరకు 25 లక్షలమంది చూశారు. దీన్ని ప్రేక్షకులు నాకు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా. ► తొలిసారి గోపీచంద్ గడ్డంతో కనిపిస్తున్నారు. ఈ ఐడియా ఎవరిది? ఫోర్బ్స్ మ్యాగజీన్లో స్థానం సంపాదించిన బిలియనీర్ కొడుకు పాత్ర గోపీచంద్గారిది. ప్రపంచవ్యాప్తంగా ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించిన వ్యక్తులు, వాళ్ల పిల్లల లైఫ్ సై్టల్ ఎలా ఉంది? అని రీసెర్చ్ చేసి ఈ లుక్ ఫైనలైజ్ చేశాం. కథ, క్యారెక్టర్ ప్రకారం చేసింది తప్ప... ఏదో సై్టల్ కోసం పెట్టలేదు. హీరోను నేను ఎలా ఊహించుకున్నానో... గోపీచంద్‌గారు అంతకంటే బాగున్నారు. సినిమా కోసం ఆయన స్కైడైవ్, వింగ్ వాక్ (ఫ్లైట్‌పై నుంచుని నడిచే షాట్స్), ఎడారిలో బైక్ రైడింగ్ వంటి వైల్డ్ అడ్వంచర్స్ అన్నీ చేశారు. దర్శకుడిగా నేను ఏదైనా రాసుకోవచ్చు. కానీ, హీరో నుంచి సహకారం లేకుంటే ఏదీ చేయలేను. గోపీచంద్‌గారు ఎంత కష్టపడ్డారంటే ఒక్కో షాట్‌కు 200 కిలోమీటర్లు జర్నీ చేసిన రోజులున్నాయి. ► ఇందులో గోపీచంద్ హీరోగా, విలన్‌గా నటిస్తున్నారట! నిజమేనా? కాదు. హీరో క్యారెక్టర్లో రెండు షేడ్స్ ఉంటాయి. హిందీ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో తంగబలిగా నటించిన నికితిన్ ధీర్, ముఖేష్ రుషి... ఇద్దరూ విలన్లుగా నటిస్తున్నారు. అలాగే, పవన్‌కల్యాణ్‌గారి కోసం రాసిన కథ కాదిది. ఎవరి దగ్గరో మార్కులు కొట్టేయడానికి ‘గౌతమ్‌నంద’ టైటిల్ పెట్టలేదు. సినిమా చూస్తే టైటిల్ జస్టిఫికేషన్ తెలుస్తుంది. ► రమణ మహర్షి ‘హూ యామ్ ఐ’ పుస్తకం స్ఫూర్తితో ‘గౌతమ్‌నంద’ తీస్తున్నట్టు చెప్పారు. అంత ఫిలాసఫీ ప్రేక్షకులకు బోర్ కొడుతుందేమో? ప్రజలకు లేదా ఊరికి కష్టం వస్తే హీరో ఆదుకున్నాడనే అంశాల చుట్టూ ఇంతకు ముందు నేను చేసిన కమర్షియల్ సినిమాలు తిరిగాయి. కానీ, తొలిసారి ప్రజల కోసమో, ఇంకెవరి కోసమో కాకుండా... తన కోసం తాను ప్రయాణించే వ్యక్తి (హీరో) కథను తెరపై చూపించబోతున్నా. ‘నువ్వు ప్రపంచానికి పరిచయం చేసుకో’ అని కుమారుణ్ణి బయటకు పంపిస్తాడు ఓ తండ్రి. అప్పుడు వేమనగారిని వాళ్ల వదినగారు తిట్టినప్పుడు, రైల్వే కంపార్ట్మెంట్ నుంచి గాంధీగారిని తోసేసినప్పుడు మన విలువ ఏంటి? అని వాళ్లు తెలుసుకున్నట్టు... హీరో సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎలా క్రియేట్ చేశాడు? అనేదాన్ని చూపిస్తున్నాం. ఆర్ట్ ఫిల్మ్‌లా ఉండదు. పక్కా కమర్షియల్ సినిమా. ► దర్శకుడిగా, నిర్మాతగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రెండిటిలో ఏ రోల్ బాగుంది? రెండూ కష్టమైన పాత్రలే. నిర్మాతగా చేయడానికి కారణం ఏంటంటే... అప్పుడప్పుడూ ఓ ప్రేమకథ ఐడియా వస్తుంది. దాన్ని రాసుకుని ఎక్కడో లోపల పెట్టుకోవడం కంటే... బయటకు పంపిస్తే పదిమందికి నచ్చొచ్చు. అందుకే, క్యూట్ లవ్‌స్టోరీ ఐడియా వస్తే నిర్మాతగా మారుతున్నా. ► స్టార్స్‌తో సినిమాలు చేశాక మీలాంటి దర్శకులు మళ్లీ చిన్నవాళ్లతో సినిమా చేయరెందుకు? నిజం చెప్పాలంటే... ఎక్కడో ఇన్సెక్యూరిటీ! సడన్‌గా చిన్నవాళ్లతో సినిమా చేస్తే అదేమైనా అయితే ప్రాబ్లెమ్ అవుతుందేమోనని! భారీ సినిమా ఛాన్స్ ఉన్నప్పుడు ఎవరూ చిన్న సినిమా చేయరేమోనని నా ఫీలింగ్. ► ‘గౌతమ్‌నంద’ తర్వాత ఏంటి? ఏ కథతో తర్వాత సినిమా చేస్తున్నారని అడిగితే చెప్పగలను. కానీ, ఎవరితో అనేది చెప్పలేను. ఈ సినిమా తర్వాత మంచి కథ రాసి, అది ఎవరికి నచ్చితే ఆ హీరోతో సినిమా చేద్దామనేది నా ఆశ. -
రమణ మహర్షి స్ఫూర్తితో...
‘గౌతమ్‌నంద’... సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా పేరు. ఈ టైటిల్ అనౌన్స్ చేయగానే ‘‘అరే... ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌కల్యాణ్ పేరును గోపీచంద్ సిన్మాకు టైటిల్‌గా పెట్టారు’’ అనుకున్నారంతా. ఈ టైటిలే కాదు... కథతో కూడా పవన్‌కు లింక్ ఉందట! అంటే... గతంలో పవన్‌కల్యాణ్‌కు చెప్పిన కథతోనే దర్శకుడు సంపత్ నంది ఈ సినిమా తీస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్! ‘రచ్చ’ సూపర్ హిట్టయిన తర్వాత పవన్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో రెండేళ్ల పాటు కష్టపడి, సంపత్ ఓ స్క్రిప్ట్ రెడీ చేశారు. కానీ, సిట్యువేషన్స్ సెట్ కాలేదు. సినిమా పట్టాలు ఎక్కలేదు. అప్పుడు పవన్‌కు చెప్పిన కథతో ఇప్పుడీ ‘గౌతమ్‌నంద’ తీస్తున్నారని కృష్ణానగర్ కుర్రాళ్లు అంటున్నారు. దర్శకుడు సంపత్ నంది ఈ పుకార్లను ఖండించారు. కంప్లీట్ కొత్త కథతో ఈ సినిమా తీస్తున్నట్టు చెప్పారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ను 20 లక్షల మంది నెటిజన్లు చూశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలో ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన పాటల్ని, ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు. తనలో తన ప్రయాణం...తన కోసం తన ప్రయాణం! పవన్‌కల్యాణ్‌గారి కోసమే ప్రత్యేకంగా కథ రాశా. ఆయనకు చెప్పిన కథకు, ‘గౌతమ్‌నంద’కు సంబంధం లేదు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో తీస్తున్నాను. రమణ మహర్షి ‘హూ యామ్ ఐ’ పుస్తకం స్ఫూర్తితో ఈ కథ రాశా. రెండు మూడేళ్లు ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేశా. గౌతమ్ అనే ఓ బిలీనియర్ తనను తాను వెతుక్కునే జర్నీలో ఏం తెలుసుకున్నాడనేది చిత్రకథ. ‘తనలో తన ప్రయాణం. తన కోసం తన ప్రయాణం’ అనేది థీమ్. అందుకే ‘ఎజర్నీ ఇన్టు ద సెల్ఫ్’ అని క్యాప్షన్ పెట్టాను. – సంపత్ నంది