రమణ మహర్షి స్ఫూర్తితో...
‘గౌతమ్‌నంద’... సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా పేరు. ఈ టైటిల్ అనౌన్స్ చేయగానే ‘‘అరే... ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌కల్యాణ్ పేరును గోపీచంద్ సిన్మాకు టైటిల్‌గా పెట్టారు’’ అనుకున్నారంతా. ఈ టైటిలే కాదు... కథతో కూడా పవన్‌కు లింక్ ఉందట! అంటే... గతంలో పవన్‌కల్యాణ్‌కు చెప్పిన కథతోనే దర్శకుడు సంపత్ నంది ఈ సినిమా తీస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్! ‘రచ్చ’ సూపర్ హిట్టయిన తర్వాత పవన్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో రెండేళ్ల పాటు కష్టపడి, సంపత్ ఓ స్క్రిప్ట్ రెడీ చేశారు.
కానీ, సిట్యువేషన్స్ సెట్ కాలేదు. సినిమా పట్టాలు ఎక్కలేదు. అప్పుడు పవన్‌కు చెప్పిన కథతో ఇప్పుడీ ‘గౌతమ్‌నంద’ తీస్తున్నారని కృష్ణానగర్ కుర్రాళ్లు అంటున్నారు. దర్శకుడు సంపత్ నంది ఈ పుకార్లను ఖండించారు. కంప్లీట్ కొత్త కథతో ఈ సినిమా తీస్తున్నట్టు చెప్పారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ను 20 లక్షల మంది నెటిజన్లు చూశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలో ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన పాటల్ని, ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు.
తనలో తన ప్రయాణం...తన కోసం తన ప్రయాణం!
పవన్‌కల్యాణ్‌గారి కోసమే ప్రత్యేకంగా కథ రాశా. ఆయనకు చెప్పిన కథకు, ‘గౌతమ్‌నంద’కు సంబంధం లేదు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో తీస్తున్నాను. రమణ మహర్షి ‘హూ యామ్ ఐ’ పుస్తకం స్ఫూర్తితో ఈ కథ రాశా. రెండు మూడేళ్లు ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేశా. గౌతమ్ అనే ఓ బిలీనియర్ తనను తాను వెతుక్కునే జర్నీలో ఏం తెలుసుకున్నాడనేది చిత్రకథ. ‘తనలో తన ప్రయాణం. తన కోసం తన ప్రయాణం’ అనేది థీమ్. అందుకే ‘ఎజర్నీ ఇన్‌టు ద సెల్ఫ్’ అని క్యాప్షన్ పెట్టాను.
– సంపత్ నంది