ఇరగదీసావ్‌ రా అని ఫ్రెండ్స్‌ అంటున్నారు | Gautamandha 'for Rs 6 a day 22,25,47,433 has been charged | Sakshi
Sakshi News home page

ఇరగదీసావ్‌ రా అని ఫ్రెండ్స్‌ అంటున్నారు

Published Thu, Aug 3 2017 11:18 PM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

ఇరగదీసావ్‌ రా అని ఫ్రెండ్స్‌ అంటున్నారు

ఇరగదీసావ్‌ రా అని ఫ్రెండ్స్‌ అంటున్నారు

– గోపీచంద్‌
‘‘ఒక మంచి కథతో ‘గౌతమ్‌ నంద’ సినిమా చేశా. చాలా రోజుల తర్వాత నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు చేశాను. నేను చేసిన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాకి అధిక వసూళ్లు వచ్చాయి. ఫ్రెండ్స్‌ అందరూ ఇరగదీసావ్‌ రా అని మెచ్చుకుంటున్నారు’’ అన్నారు  గోపీచంద్‌. సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్, హన్సిక, కేథరిన్‌ హీరో హీరోయిన్లుగా జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ‘గౌతమ్‌నంద’ సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గౌతమ్‌నంద’ 6 రోజులకి రూ. 22,25,47,433 వసూలు చేసింది. మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ సినిమా కొన్నవారందరికీ లాభాలను తెస్తోంది’’ అన్నారు. ‘‘ఇంతకు ముందు నేను చేసిన అన్ని సినిమాల్లో కంటే కథ పరంగా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. కథ పాతదే అయినా కొత్తగా చెప్పాలని ట్రై చేశా. ఎమోషనల్‌ సీన్స్, ట్విస్ట్‌లు మనసుకి హత్తుకునేలా ఉన్నాయని చెప్తున్నారు. ‘నువ్వు చేసిన అన్ని సినిమాల్లో కంటే నాకు బాగా నచ్చిన సినిమా ఇది’ అని మా నాన్న ఫోన్‌ చేసి చెప్పారు. బెస్ట్‌ మూవీ అని నా ఫ్రెండ్‌ ఫాదర్‌ సాంబశివరావుగారు చెప్పారు. ఇవి రెండు నా లైఫ్‌లో బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌. సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement