ఇలాంటి రిస్క్‌ ఏ హీరో తీసుకోడు | Gopichand's Gautam Nanda teaser impresses | Sakshi
Sakshi News home page

ఇలాంటి రిస్క్‌ ఏ హీరో తీసుకోడు

Published Tue, Jun 13 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

ఇలాంటి రిస్క్‌ ఏ హీరో తీసుకోడు

ఇలాంటి రిస్క్‌ ఏ హీరో తీసుకోడు

– ‘దిల్‌’ రాజు
‘‘గౌతమ్‌ నంద’లో గోపీచంద్‌ హీరోగా, విలన్‌గా చేస్తున్నాడు. ఆ రెండు పాత్రలు ఆయనొక్కడే చేయగలడు. మరో తెలుగు హీరో ఇలాంటి రిస్క్‌లు తీసుకోడు. ట్రైలర్‌ చూస్తుంటే సంపత్‌ నంది సినిమా ఎంత బాగా తీశాడో తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. గోపీచంద్‌ హీరోగా, హన్సిక, కేథరిన్‌ హీరోయిన్లుగా సంపత్‌ నంది దర్శకత్వంలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న సినిమా ‘గౌతమ్‌ నంద’. గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేశారు.

సంపత్‌ నంది మాట్లాడుతూ– ‘‘నన్ను, నా కథను నమ్మి గోపీచంద్‌ గారు ఈ సినిమా చేస్తున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెడతాను. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకపోవడంతో సినిమా చాలా క్వాలిటీగా వస్తోంది’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశమున్న చిత్రమిది. ఇందులో నా గత చిత్రాలకంటే డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తా. సంపత్‌ గారు సినిమా బాగా తీస్తున్నారు. గత ఏడాది మీడియా సమక్షంలో పుట్టినరోజు చేసుకున్నా. ఈ ఏడాది ‘గౌతమ్‌ నంద’ యూనిట్‌ సమక్షంలో జరుపుకున్నా’’ అన్నారు గోపీచంద్‌. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement