జి ఫర్ గౌతమ్‌నంద
లుక్.. లుక్... గోపీచంద్ కొత్త లుక్ ఇదేనండీ. కొత్త హెయిర్ స్టైలు.. రఫ్‌గా పెంచిన గడ్డం.. ఓ చేతిలో కోటు.. మాంచి స్టైలిషగా ఉన్నారు కదూ. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రంలోని లుక్ ఇది. శ్రీ బాలజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్,జె. పుల్లారావులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గౌతమ్‌నంద’ అనే టైటిల్ ఖరారు చేశారు. మామూలుగా ‘జి’ ఫర్ గోపీచంద్.. కానీ, ఇప్పుడు మాత్రం ‘జి’ ఫర్ గౌతమ్‌నంద అనాలి. శనివారం గోపీచంద్ ఫస్ట్ లుక్ విడుదల చేసి, టైటిల్ అనౌన్స్ చేశారు.
నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో చివరి టాకీ షెడ్యూల్ మొదలవుతుంది. అది పూర్తయిన తర్వాత విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. మార్చిలో పాటల్ని, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్–లక్ష్మణ్, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఎస్. సౌందర్‌రాజన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్.