జలకాలాట  కాదు! | Third Poster Of Hansika Motwani's 'Maha' Released | Sakshi
Sakshi News home page

జలకాలాట  కాదు!

Published Wed, Jan 2 2019 12:42 AM | Last Updated on Wed, Jan 2 2019 12:42 AM

 Third Poster Of Hansika Motwani's 'Maha' Released - Sakshi

రక్తాన్ని చూస్తే చాలు కొంతమంది కళ్లు తిరిగి ఢామ్మని కిందపడిపోతారు. అలాంటిది హీరోయిన్‌ హన్సిక మాత్రం జలకాలాట కాదు.. ఏకంగా రక్తస్నానం చేస్తున్నారు. ఇది ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘మహా’లోని ఓ పోస్టర్‌. న్యూ ఇయర్‌ సందర్భంగా రిలీజ్‌ చేశారు. హన్సిక కాషాయ వస్త్రాలు ధరించి  ధూమపానం చేస్తున్నట్లు ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ వివాదమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేయడం విశేషం.
 

యుఆర్‌. జమ్మిల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హన్సిక కెరీర్‌లో 50వ చిత్రం కావడం మరో విశేషం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ కెరీర్లో ఇది 25వ చిత్రం. ఈ సినిమా కాకుండా హన్సిక నటించిన ‘100’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక తెలుగులో ‘యన్‌.టీ.ఆర్‌’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారామె. హీరోయిన్‌గా సందీప్‌ కిషన్‌ సరసన ఓ సినిమా చేయనున్నారు హన్సిక. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement