
రెండోసారి ఇద్దరమ్మాయిలతో...
మన స్టార్ హీరోలు నటించే చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండటం సహజం. కానీ, గోపీచంద్ మాత్రం ఇప్పటివరకూ పదిహేడు చిత్రాలు చేస్తే వాటిలో పదహారు చిత్రాల్లో సోలో హీరోయిన్‌తోనే చేశారు. ‘మొగుడు’ చిత్రంలో తొలిసారి ఇద్దరు హీరోయిన్లు తాప్సీ, శ్రద్ధాదాస్‌తో జతకట్టారాయన. మళ్లీ ఐదేళ్లకు రెండోసారి ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.
సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో గోపీచంద్ సరసన హన్సిక ఒక హీరోయిన్‌గా ఫిక్సయిన విషయం తెలిసిందే. తాజాగా కేథరిన్‌ను మరో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మాస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో, హీరోయిన్లను తెరపై అందంగా చూపించడంలో సంపత్‌నందిది ప్రత్యేకశైలి. మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం విందు భోజనంలా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్.