
తమ్ముడు తరువాత అన్నయ్యతో..
కోలీవుడ్ నటి క్యాథరిన్‌కు కలిసొచ్చిందా?.. అవుననే సమాధానమే వస్తోంది. టాలీవుడ్‌లో తొలుత ఎంటర్ అయిన ఈ నార్త్ బ్యూటీకి అక్కడ తొలి చిత్రం ఇద్దరమ్మాయిలతో నిరాశ పరచింది. అయితే కోలీవుడ్ అక్కున చేర్చుకుంది. కార్తీ సరసన నటించిన మెడ్రాస్ చిత్రం క్యాథరిన్‌కు మంచి విజయాన్ని ఇచ్చింది. అమ్మడి నటనకూ మంచి మార్కులే పడ్డాయి. దీంతో మంచి జోష్‌లో ఉంది. అంతకంటే క్యాథరిన్‌ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం మరొకటుంది. అదే సూర్యతో రొమాన్స్‌చేసే అవకావం రావడం. సూర్య ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మాస్ చిత్రంలో నటిస్తున్నారు.
ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న సూర్య సరసన నయనతార, ఎమిజాక్సన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం తరువాత సూర్య మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రంలో ఆయనతో రొమాన్స్‌చేసే అవకాశం లక్కీగర్ల్ క్యాథరిన్‌ను వరించనుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రంలోని నాయికి పాత్రకు క్యాథరిన్ చక్కగా సరిపోతుందని దర్శక, హీరోలు భావించారట. దర్శకుడు క్యాథరిన్‌కు కథ కూడా వినిపించారట.
విన్నవెంటనే మరో మాట లేకుండా ఓకే చెప్పేసిందట ఈ ముద్దుగుమ్మ. విక్రమ్‌కుమార్ చిత్రాలలో కథానాయకుడితో పాటు కథానాయికకు నటించడానికి స్కోప్ ఉంటుందని ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అని క్యాథరిన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. సూర్య లాంటి స్టార్ హీరో సరసన నటించే చాన్స్ రావడం నిజంగా లక్కీ అంది. అయితే సూర్య సరసన క్యాథరిన్ నటించే విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయని యూనిట్ వర్గాలంటున్నారు. ఏదేమైనా తమ్ముడు (కార్తి) సరసన నటించిన క్యాథరిన్‌కు అన్నయ్య (సూర్య)తో నటించే అవకాశం రావడం ఒక రకంగా ప్రమోషన్ లాంటిదే. ప్రస్తుతం క్యాథరిన్ అధర్వ సరసన కణిదన్ చిత్రంలో నటిస్తోంది.