
క్లైమాక్స్ గురూ!
సెట్‌లో దర్శకులు షాట్ తీసే ముందు ‘స్టార్ట్.. కెమేరా.. యాక్షన్’ అనడం సహజమే. దర్శకుడు సంపత్ నంది ఏమో ‘యాక్షన్.. యాక్షన్.. యాక్షన్’ అంటున్నారు. ఎకో ఎఫెక్ట్ ఏమీ కాదండీ! గోపీచంద్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అంత హై–ఎండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయట! శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న ఈ సినిమా నాలుగో షెడ్యూల్ మంగళవారం మొదలైంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్‌తో పాటు హీరో గోపీచంద్, హీరోయిన్లు హన్సిక, కేథరిన్‌లపై కీలక సన్నివేశాల్ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నాం.
రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో తీసిన యాక్షన్ సీన్లు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. సినిమాలో యాక్షన్‌తో పాటు మంచి ప్రేమకథ, ఎమోషనల్ సీన్లను దర్శకుడు సంపత్‌నంది బాగా హ్యాండిల్ చేశారు. ఫిబ్రవరి 20తో నాలుగో షెడ్యూల్ ముగుస్తుంది. త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల చేసి, టైటిల్ ప్రకటిస్తాం. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నికితిన్ ధీర్, తనికెళ్ల భరణి, ముఖేశ్‌రుషి, అజయ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్.