
హాలీవుడ్ నటి కేథరిన్ జెటా జోన్స్‌కు బాలీవుడ్ అంటే ఎంతో ఇష్టం. బాలీవుడ్ హిట్ సినిమా పాటలకు డాన్స్ చేసి అభిమానులతో పంచుకుంటారు. భర్త మైఖేల్ డగ్లస్‌తో కలిసి కేథరిన్ ఈ మధ్యే భారత పర్యటనకు వచ్చారు. ఈ జంట మనదేశానికి రావడం ఇది రెండోసారి కావడం విశేషం. భారత పర్యటన విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ హాలీవుడ్ భామ.. తాజాగా ‘బార్‌బార్ దేఖో’ చిత్రంలో అత్యంత పాపులర్ అయిన ‘కాలా చష్మా’పాటకు డ్యాన్స్ చేసిన వీడియాను పోస్టు చేశారు. మిగతా డ్యాన్సర్లతో కలిసి అలవోకగా కేథరిన్ స్టెప్పులేశారు. ‘డ్సాన్స్ లేకుండా నేను ఉండలేను’ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. కొద్దిరోజుల క్రితం ముంబైలో జరిగిన కార్యక్రమంలోనూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌తో కలిసి ఓం శాంతి ఓం సినిమాలోని ‘దీవాంగీ దీవాంగీ’ పాటకు ఆమె డ్యాన్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment