
అప్పట్నుంచి అవార్డులు మొదలుపెట్టా!
‘నేను చిన్నప్పట్నుంచీ సంతోషం అవార్డు వేడుకలు చూస్తున్నా. నంది, ఫిలింఫేర్ అవార్డుల తర్వాత ఆ స్థాయిలో నటీనటులు
‘నేను చిన్నప్పట్నుంచీ సంతోషం అవార్డు వేడుకలు చూస్తున్నా. నంది, ఫిలింఫేర్ అవార్డుల తర్వాత ఆ స్థాయిలో నటీనటులు, టెక్నీషియన్స్‌ను ఎంకరేజ్ చేస్తూ జరుగుతున్న అవార్డుల కార్యక్రమం ఇదే. ఈ వేడుక ఇలానే కొనసాగాలి’’అని హీరో నిఖిల్ అన్నారు. ‘సంతోషం’ వార పత్రిక ఈ నెల 2న 14 వసంతాలు పూర్తి చేసుకుని, పదిహేనో ఏట అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఈ నెల 14న హైదరాబాద్‌లో ‘సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్’ వేడుకలు జరగనున్నాయి.
విశ్వ రాసి, కంపోజ్ చేసిన ‘సంతోషం’ సాంగ్‌ను నిఖిల్ విడుదల చేశారు. ీహ రోయిన్ కేథరిన్, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ వేడుక ఇన్విటేషన్స్ అందుకున్నారు. పత్రికాధినేత సురేశ్ కొండేటి మాట్లాడుతూ- ‘‘సంతోషం’ పత్రిక ప్రారంభించిన రెండో ఏడాది బాలకృష్ణగారు ‘సంతోషం’ పేరున అవార్డులు ఇస్తే బాగుంటుందని చెప్పారు. అప్పట్నుంచి అవార్డులిస్తున్నా. నేను బ్రతికి ఉన్నంత కాలం ఈ అవార్డులను అందిస్తూనే ఉంటా’’ అన్నారు. దర్శకుడు కల్యాణ్ కృష్ణ, నటులు శివాజీ రాజా, ఏడిద శ్రీరాం, గాయకుడు సింహా, తదితరులు పాల్గొన్నారు.