– సంగీత దర్శకుడు థమన్
హైదరాబాద్: క్రీడలు శారీరక దేహ దారుడ్యానికే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి కూడా ఎంతో దోహదం చేస్తాయని సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 2025 జాతీయ సదస్సు హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి మహాలింగప్పతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నిత్యం జీవితంలోని ఎన్నో టెన్షన్స్‌ను, పని ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా క్రీడలు ఆడాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో సౌత్ జోన్ సభ్యులు విజేతలుగా నిలిచారు. వారికి థమన్ ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అశ్విన్ బాబు, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. కిషన్, సెక్రటరీ డాక్టర్ ఉమా శంకర్, కోశాధికారి డాక్టర్ జార్జ్ రెడ్డి, డాక్టర్ విశాల్ ఆకుల, న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment