
సంగీతం దర్శకుడు తమన్ (SS Thaman) పై మెగా అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. రామ్ చరణ్(Ram Charan ) నటించిన ‘గేమ్ ఛేంజర్’ పాటలపై ఆయన చేసిన కామెంట్సే అందుకు కారణం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్’(Game Changer) పాటలకు యూట్యూబ్‌లో ఎక్కువ అనుకున్నంత వ్యూస్ రాబట్టలేకపోయాయి. ఆ పాటలకు సరైన హుక్ స్టెప్పులు లేకపోవడమే అందుకు కారణం. ‘రా మచ్చా..’, ‘నానా హైరానా’, ‘జరగండి జరగండి..’ ఈ పాటల్లో ఒక్క దాంట్లో కూడా హుక్ స్టెప్ లేదు. ఒక మంచి పాటకి మంచి స్టెప్పులు ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’అని చెప్పుకొచ్చాడు.
తమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ అతన్ని బాగా ట్రోల్ చేశారు. అంతేకాదు రామ్ చరణ్ సైతం సోషల్ మీడియాలో తమన్‌ని అన్‌ఫాలో చేశారనే వార్తలు కూడా వచ్చాయి. మెగా అభిమానులే ఈ పుకారుని బాగా వైరల్ చేశారు.
అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. రామ్ చరణ్ అసలు తమన్‌ని ఫాలోనే అవ్వడం లేదట. అన్‌ఫాలో చేశారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘రామ్ చరణ్ ఇన్‌స్టాలో కానీ ఎక్స్‌లో కానీ తక్కువ మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. తమన్‌ని చరణ్ అన్‌ఫాటో చేశారనే వార్తల్లో నిజం లేదు’ అని చరణ్ టీమ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment