రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. ఆ డేట్‌ ఫిక్స్ అయినట్టే! | Thaman Reveals Ram Charan's Latest Movie Game Changer Release Date | Sakshi
Sakshi News home page

Game Changer: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. రిలీజ్‌ డేట్‌పై తమన్‌ పోస్ట్!

Published Thu, Sep 19 2024 12:23 PM | Last Updated on Thu, Sep 19 2024 12:34 PM

Thaman Reveals Ram Charan's Latest Movie Game Changer Release Date

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా హీరో నటిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్షన్‌లో ఈ మూవీని పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది.

అయితే మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్‌ కోసం తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది క్రిస్‌మస్‌కు రిలీజవుతుందని నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. కానీ విడుదల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై హింట్‌ ఇచ్చాడు. వచ్చే వారం నుంచే గేమ్ ఛేంజర్‌కు సంబంధించిన అన్‌స్టాపబుల్ ఈవెంట్స్‌ డిసెంబర్‌ 20 వరకు జరుగుతాయని పోస్ట్ చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ డిసెంబర్‌ 20న రిలీజ్‌ కానుందని అభిమానులు భావిస్తున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారు అయినట్లే. కాగా.. ఈ చిత్రం శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.

రామ్ చరణ్‌ బిజీ..

గేమ్ ఛేంజర్ షూటింగ్‌ పూర్తి కావడంతో రామ్ చరణ్ నెక్స్ట్‌ మూవీకి రెడీ అవుతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో చెర్రీ నటిస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇటీవల ఈ మూవీ కోసం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శివోహంతో కలిసి కసరత్తులు చేస్తున్నట్లు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement