అడవిలో గజేంద్రుడు | Arya and Catherine new movie "Gajendrudu ' | Sakshi
Sakshi News home page

అడవిలో గజేంద్రుడు

Published Thu, Apr 13 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

అడవిలో గజేంద్రుడు

అడవిలో గజేంద్రుడు

ఆర్య, కేథరీన్‌ జంటగా రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజేంద్రుడు’. సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్‌.బి.చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్‌.బి.చౌదరి మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో తెరకెక్కిన 89వ చిత్రమిది. కుటుంబమంతా కలసి చూసి, ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. హీరో హీరోయిన్‌ పాత్రలకు తగ్గట్టు అద్భుతంగా నటించారు.

యువన్‌ శంకర్‌ రాజా స్వరపరచిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు. ‘‘అడవి నేపథ్యంలో మొత్తం సినిమా చేయడమంటే అంత సులభం కాదు. చౌదరిగారి సపోర్ట్‌ లేకుంటే ఈ సినిమా చేసేవాâý్లం కాదు. రాఘవ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. తను భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో పెద్ద దర్శకుడిగా ఎదుగుతాడు’’ అని ఆర్య అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement