ఫారిన్ టూర్ లో బుల్లి ప్రిన్స్ హల్ చల్!
బ్రిటన్ బుల్లి యువరాజు జార్జ్ బయటకు అడుగుపెట్టిన తొలి రోజునే ఆకట్టుకోవడమే కాకుండా, పతాక శీర్షికలోకెక్కాడు. ప్రిన్స్ విలియమ్, కేథరిన్ ల ముద్దుల తనయుడు జార్జ్ న్యూజిలాండ్ లో తొలి అధికార పర్యటనను చేశాడు. వెల్లింగ్టన్ లో బలమైన గాలులు, వర్షం, మసక చీకటి స్వాగత పలికినా.. బుల్లి యువరాజు ముఖంలో నవ్వు చెక్కుచెదరలేదు.

మూడు వారాల పర్యటనలో భాగంగా తన తల్లితండ్రులతో కలిసి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో బుడతడు పర్యటించనున్నాడు. జూలై 22 తేదిన జన్మించిన తర్వాత జార్జ్ బహ్యప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి.
