New Zealand tour
-
Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన!
న్యూఢిల్లీ: భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ చాలా కాలంగా టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. షమీ కూడా లేకపోవడంతో బుమ్రాకు జతగా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే పేస్‌కు అనుకూలించే విదేశీ మైదానాలతో పోలిస్తే సొంతగడ్డపై అతని ప్రదర్శన పేలవంగా ఉంది. 17 విదేశీ టెస్టుల్లో సిరాజ్ 61 వికెట్లు పడగొట్టాడు. భారత గడ్డపై మాత్రం 13 టెస్టుల్లో 192.2 ఓవర్లు బౌలింగ్ చేసి 36.15 సగటుతో 19 వికెట్లే తీయగలిగాడు! ఇందులో కొన్ని సార్లు స్పిన్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లపై దాదాపుగా బౌలింగ్ చేసే అవకాశమే రాకపోవడం కూడా ఒక కారణం. అయితే పిచ్‌తో సంబంధం లేకుండా స్వదేశంలో కూడా ప్రత్యరి్థపై చెలరేగే బుమ్రా, షమీలతో పోలిస్తే సిరాజ్ విఫలమవుతున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బుమ్రా తరహాలో వికెట్లు అందించలేకపోతున్నాడు. ముఖ్యంగా గత ఏడు టెస్టుల్లో అతను 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో పుణేలో జరిగే రెండో టెస్టులో అతని స్థానంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. సిరాజ్ స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరును మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ బౌలింగ్‌లో స్వల్ప సాంకేతిక లోపాలే భారత్‌లో వైఫల్యాన్ని కారణమని మాజీ కోచ్ ఒకరు విశ్లేíÙంచారు. ‘టెస్టుల్లో సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శనలన్నీ కేప్‌టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, బ్రిస్బేన్వంటి బౌన్సీ పిచ్‌లపైనే వచ్చాయి. బంతి పిచ్ అయిన తర్వాత బ్యాటర్ వరకు చేరే క్రమంలో అక్కడి లెంగ్త్‌కు ఇక్కడి లెంగ్త్‌కు చాలా తేడా ఉంటుంది. దీనిని అతను గుర్తించకుండా విదేశీ బౌన్సీ వికెట్ల తరహా లెంగ్త్‌లో ఇక్కడా బౌలింగ్ చేస్తున్నాడు. దీనికి అనుగుణంగా తన లెంగ్త్‌ను మార్చుకోకపోవడంతో ఫలితం ప్రతికూలంగా వస్తోంది. ఈ లోపాన్ని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. వన్డే, టి20ల్లో అయితే లెంగ్త్ ఎలా ఉన్నా కొన్ని సార్లు వికెట్లు లభిస్తాయి. కానీ టెస్టుల్లో అలా కుదరదు. బ్యాటర్ తగిన విధంగా సన్నద్ధమై ఉంటాడు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఆ్రస్టేలియాకు వెళితే సిరాజ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు’ అని ఆయన వివరించారు. -
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (డిసెంబర్ 30) 14 మంది సభ్యుల టెస్ట్ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు నీల్ బ్రాండ్ నాయకత్వం వహించనుండగా.. సభ్యులంతా కొత్తవారు. ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో టీ20 లీగ్ (SA20) జరుగనుండటంతో న్యూజిలాండ్ సిరీస్ కోసం అనామక జట్టును ఎంపిక చేశారు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉంటారు. న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో డేవిడ్ బెడింగ్హమ్, జుబేర్ హంజా, డ్యుయన్ ఒలివియర్, కీగన్ పీటర్సన్, ఖాయా జోండో మాత్రమే కాస్తోకూస్తో సుపరిచిత ఆటగాళ్లు. న్యూజిలాండ్ పర్యటనలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు మౌంట్ మాంగనూయ్‌లో తొలి టెస్ట్.. అనంతరం ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు హ్యామిల్టన్‌లో రెండో టెస్ట్ జరుగనుంది. 🟢 SQUAD ANNOUNCEMENT 🟡 CSA has today announced a 14-player squad for the Proteas two-match Test tour of New Zealand next month🇿🇦🇳🇿#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/pLBxCrNvJF — Proteas Men (@ProteasMenCSA) December 30, 2023 ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు పూర్తి కాగా.. టెస్ట్ సిరీస్ నడుస్తుంది. రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓటమిపాలుకాగా.. రెండో మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జరుగనుంది. ఈ పర్యటనలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: నీల్ బ్రాండ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డ్యుయన్ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్, ఖాయా జోండో. -
గెలిస్తే... సిరీస్ మన చేతికి.. సంజూ సామ్సన్, యువ పేసర్‌కు అవకాశం?
నేపియర్: న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్ గెలుపే లక్ష్యంగా టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది. మంగళవారం ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టి20 జరుగుతుంది. ఇదివరకే రెండో మ్యాచ్ గెలిచిన భారత్ 1–0తో ఆధిక్యంలో ఉండగా.. ఇదే ఉత్సాహంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి 2–0తో కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. మ్యాచ్ ఓడినా సిరీస్ పోయేదిలేదు కాబట్టి తుదిజట్టులో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌తో పాటు బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌కు అవకాశమివ్వాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. మరోవైపు సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్ కీలకమైన మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ లేకుండా బరిలోకి దిగుతోంది. దాంతో సీనియర్ సీమర్ సౌతీ సారథ్యం వహిస్తాడు. నేపియర్ పిచ్ బ్యాటింగ్ పిచ్ కాగా... మ్యాచ్‌కు వానముప్పు పొంచి ఉంది. -
పరాజయంతో ప్రారంభం
క్వీన్స్టౌన్: భారత మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనను పరాజయంతో మొదలుపెట్టింది. బుధవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ 18 పరుగుల తేడాతో గెలిచింది. మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (36; 2 ఫోర్లు), కెప్టెన్ సోఫీ డివైన్ (31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. పూజ, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేసింది. ఆంధ్రపదేశ్‌కు చెందిన సబ్బినేని మేఘన (30 బంతుల్లో 37; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (12) నిరాశపరిచింది. క్వారంటైన్ లో ఉండటంతో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరమైంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఈనెల 12న జరిగే తొలి వన్డేలోనూ స్మృతి బరిలో దిగే అవకాశం కనిపించడంలేదు. -
షోయబ్ మాలిక్‌కు ఉద్వాసన
కరాచీ: న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌తోపాటు పేసర్ మొహమ్మద్ అమీర్‌కు చోటు దక్కలేదు. కేవలం టి20 క్రికెట్ మాత్రమే ఆడుతోన్న 38 ఏళ్ల మాలిక్‌ను తాజాగా ముగిసిన జింబాబ్వే సిరీస్‌కు కూడా పక్కనబెట్టారు. తాజా పరిణామంతో అతను వచ్చే ఏడాది భారత్‌లో జరుగనున్న టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేది అనుమానంగా మారింది. పాక్, న్యూజిలాండ్ జట్ల మధ్య డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో 3 టి20 మ్యాచ్‌లు... మౌంట్ మాంగనీ (డిసెంబర్ 26–30), క్రైస్ట్‌చర్చ్ (జనవరి 3–7) వేదికల్లో రెండు టెస్టులు జరుగుతాయి. -
కలిసి...మెలిసి... అతిక్రమించారు!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటన కోసం వచ్చిన వెస్టిండీస్ ఆటగాళ్లు కరోనా వైరస్ ప్రొటోకాల్‌ను విస్మరించారు. క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు నిబంధనల్ని అతిక్రమించి ప్రవర్తించడం న్యూజిలాండ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. 14 రోజుల క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు తాము బస చేసిన హోటల్లో ఏ మాత్రం భౌతిక దూరం పాటించలేదు. పైగా భోజనాల సమయంలో ఒకరి ప్లేట్లోని పదార్థాల్ని ఇంకొకరు పంచుకున్నారు. ఇవన్నీ హోటల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీనిపై కివీస్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం 12 రోజుల క్వారంటైన్ పూర్తయినప్పటికీ... ఈ అతిక్రమణ వల్ల కరోన పరీక్షల్లో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్ వ్యవధిని పొడిగిస్తారు. కరీబియన్ క్రికెటర్లు నిబంధనలకు విరుద్ధంగా కలిసిమెలిసి తిని తిరిగిన వీడియో ఫుటేజీలను విండీస్ బోర్డుకు పంపించామని కివీస్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. -
యాదవ్ ఏం తప్పు చేశాడు: భజ్జీ
ముంబై: టీమిండియా సెలక్టర్ల తీరును క్రికెటర్ హర్భజన్ సింగ్ తప్పుబట్టాడు. సెలక్షన్ కమిటీ వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు కలిగి ఉంటుందని విమర్శించాడు. వచ్చే నెలలో భారత ‘ఏ’ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అదే విధంగా కోహ్లి సేన శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా, భారత ఏ జట్లను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సోమవారం ప్రకటించింది. కాగా కొన్ని రోజులుగా నిలకడగా రాణిస్తున్న ముంబై క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్.. భారత ‘ఏ’ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ శ్రీలంక, ఆసీస్‌లతో తలపడనున్న టీమిండియా జట్టులో మాత్రం అతడు స్థానం సంపాదించలేకపోయాడు. ఈ విషయంపై స్పందించిన భజ్జీ.. టీమిండియా సెలక్టర్ల తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘ అసలు సూర్యకుమార్ యాదవ్ ఏం తప్పు చేశాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. టీమిండియా ఏ, ఇండియా బీ జట్లకు ఎంపికైన ఇతర ఆటగాళ్లతో పోలిస్తే అతడు ఎక్కువగానే పరుగులు చేశాడు. కానీ వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు ఎందుకు’ ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. కాగా గతంలో సంజూ శాంసన్ విషయంలోనూ భజ్జీ ఇదే తీరుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక న్యూజిలాండ్ టూర్లో భాగంగా ‘ఎ’ జట్టు 3 వన్డేలు, 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు (అనధికారిక టెస్టులు) ఆడుతుంది. జనవరి 19, 22, 24 తేదీల్లో వన్డేలు... జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10 మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగనున్నాయి. I keep wondering what’s wrong @surya_14kumar hv done ? Apart from scoring runs like others who keep getting picked for Team india india/A india /B why different rules for different players ??? — Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2019 -
భారత ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా విహారి
న్యూఢిల్లీ: వచ్చే నెలలో న్యూజిలాండ్ పర్యటించే భారత ‘ఎ’ జట్లను సెలక్టర్లు ప్రకటించారు. ఈ టూర్లో భాగంగా ‘ఎ’ టీమ్ 3 వన్డేలు, 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు (అనధికారిక టెస్టులు) ఆడుతుంది. జనవరి 19, 22, 24 తేదీల్లో వన్డేలు... జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10 మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. భారత టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యులైన పలువురు ఆటగాళ్లను రెండు అనధికారిక టెస్టుల కోసం ఎంపిక చేశారు. ఈ రెండు టెస్టులకు ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి నాయకత్వం వహిస్తాడు. చతేశ్వర్ పుజారా, రహానే, మయాంక్ అగర్వాల్, సాహా, అశ్విన్ ఈ మ్యాచ్‌లో ఆడతారు. డోపింగ్ నిషేధం ముగిసిన మళ్లీ దేశవాళీ బరిలోకి దిగిన పృథ్వీ షాకు కూడా ఇందులో చోటు దక్కింది. ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ కూడా రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ రెండు టీమ్‌లలోనూ ఉన్నాడు. వన్డే జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టీమ్‌లో కూడా సిరాజ్‌కు అవకాశం దక్కింది. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయడం విశేషం. ‘ఎ’ సిరీస్ తర్వాత భారత సీనియర్ జట్టు కివీస్‌తో తలపడనున్న నేపథ్యంలో సన్నాహకంగా అనేక మంది రెగ్యులర్ ఆటగాళ్లను ముందే న్యూజిలాండ్‌కు బీసీసీఐ పంపిస్తోంది. 24 జనవరి నుంచి భారత సీనియర్ టీమ్ పర్యటన మొదలవుతుంది. -
నగరానికి చేరుకున్న వైఎస్ జగన్
ముగిసిన న్యూజిలాండ్ పర్యటన సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. గతనెల 25వ తేదీన ఆయన కుటుంబ సభ్యులతో కలసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానా శ్రయంలో జగన్‌కు పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, సైకం శ్రీనివాస రెడ్డి, పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శులు బసిరెడ్డి సిద్ధారెడ్డి, రామయ్య, గుడివాడ అమర్నాథ్లతో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి జగన్ నేరుగా ఇంటికి చేరుకున్నారు. -
న్యూజిలాండ్ పర్యటనకు జగన్ పయనం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాత్రి 11 గంటలకు న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుటుంబ సభ్యులతో కలసి జగన్ పయనమయ్యారు. రెండు వారాల అనంతరం జగన్ స్వదేశానికి తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా భారత సీనియర్ మహిళల హాకీ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈనెల 14 నుంచి 20 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడే భారత జట్టును గురువారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని ఎతిమరపు జట్టులో రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇటీవలే చిలీలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ రెండో రౌండ్ టోర్నీలో ‘ఉత్తమ గోల్‌కీపర్’ పురస్కారాన్ని గెల్చుకున్న సవిత తొలి గోల్‌కీపర్‌గా వ్యవహరించనుంది. 20 మంది సభ్యులుగల జట్టుకు రాణి రాంపాల్ సారథ్యం వహించనుంది. సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లు వరుసగా ఈనెల 14, 16, 17, 19, 20వ తేదీల్లో జరుగుతాయి. భారత మహిళల జట్టు: సవిత, రజని ఎతిమరపు (గోల్‌కీపర్లు), రాణి(కెప్టెన్), సుశీలా(వైస్ కెప్టెన్), దీప్ గ్రేస్ , ఉదిత, సునీతా , గుర్జీత్ కౌర్, నమిత, రీతూ రాణి, లిలిమా, నవ్‌జ్యోత్, మోనిక, రేణుక , నిక్కీ , రీనా ఖోకర్, వందన , ప్రీతి దూబే, సోనిక, అనూపా బార్లా. -
‘గులాబీ’ టెస్టును జరపలేం
బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలనే ఆలోచనను విరమించుకున్నట్టు బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌధరి తేల్చారు. ఇప్పటికిప్పుడు తొలిసారిగా గులాబీ బంతితో మ్యాచ్‌ను జరపలేమని, దులీప్ ట్రోఫీలో ముందుగా ఈ ప్రయోగం చేస్తామని ఆయన తెలిపారు. ‘ఇలాంటి మ్యాచ్‌ను నిర్వహించే ముందు పిచ్ పరిస్థితి, ఆటగాళ్ల అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మేం ఎప్పటినుంచో చెబుతున్నట్టుగానే దులీప్ ట్రోఫీని డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరిపి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఆ తర్వాతే ఇంగ్లండ్, ఆసీస్‌లతో జరిగే టెస్టు సిరీస్‌లో దీని అమలు గురించి ఆలోచిస్తాం’ అని అమితాబ్ తెలిపారు. కివీస్‌తో తొలి టెస్టుకు ముందు దులీప్ ట్రోఫీ జరగనుండగా దీంట్లో పలువురు స్టార్ క్రికెటర్లు ఆడనున్నారు. అటు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) కూడా భారత్‌లో ఫ్లడ్‌లైట్ల కింద టెస్టును ఆడేందుకు గతంలోనే సుముఖత వ్యక్తం చేయలేదు. -
ఫారిన్ టూర్ లో బుల్లి ప్రిన్స్ హల్ చల్!
బ్రిటన్ బుల్లి యువరాజు జార్జ్ బయటకు అడుగుపెట్టిన తొలి రోజునే ఆకట్టుకోవడమే కాకుండా, పతాక శీర్షికలోకెక్కాడు. ప్రిన్స్ విలియమ్, కేథరిన్ ల ముద్దుల తనయుడు జార్జ్ న్యూజిలాండ్ లో తొలి అధికార పర్యటనను చేశాడు. వెల్లింగ్టన్ లో బలమైన గాలులు, వర్షం, మసక చీకటి స్వాగత పలికినా.. బుల్లి యువరాజు ముఖంలో నవ్వు చెక్కుచెదరలేదు. మూడు వారాల పర్యటనలో భాగంగా తన తల్లితండ్రులతో కలిసి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో బుడతడు పర్యటించనున్నాడు. జూలై 22 తేదిన జన్మించిన తర్వాత జార్జ్ బహ్యప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. -
కివీస్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియా
-
కివీస్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియా
ముంబై: కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీం ఇండియా ఆటగాళ్లు ఆదివారం న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ భారత్ జట్టు ఐదు వన్డే మ్యాచ్ లు, రెండు టెస్టు మ్యాచ్ ల్లో పాల్గొననుంది. జనవరి 19 నుంచి జరిగే పరిమిత ఓవర్ల వన్డే మ్యాచ్ లు ఆరంభకానున్నాయి. అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు టీం ఇండియా వారం రోజులు ముందుగానే న్యూజిలాండ్ కు చేరుకుంది. జనవరి 19వ తేదీ నుంచి 31 వ తేదీ వరకూ వన్డే సిరీస్ జరుగనుంది. జనవరి 19న నాపియర్ లో తొలి వన్డే, జనవరి 22న హమిల్టన్ లో రెండో వన్డే , జనవరి 25న అక్లాండ్ లోమూడో వన్డే, జనవరి 28న హమిల్టన్ లో నాలుగు వన్డే, జనవరి 31 వ తేదీన వెల్టింగ్టన్ లో ఐదో వన్డే జరుగనుంది. అనంతరం రెండు టెస్టుల మ్యాచ్ సిరీస్ ఆరంభకానుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10 వ తేదీ వరకూ ఆక్లాండ్ లో తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి 18 వరకూ వెల్టింగ్టన్ లో రెండో టెస్టు మ్యాచ్ ఆరంభమవుతుంది. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు.ఇప్పటి వరకూ భారత్ 9సార్లు న్యూజిలాండ్ లో పర్యటించింది. టీం ఇండియా వన్డే సభ్యులు.. మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ థావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింకా రహేనా, అంబటి రాయుడు, సురేష్ రైనా, అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సమీ, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఈశ్వర్ పాండే, స్టువార్ట బిన్నీ, వరణ్ ఆరూన్.