న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన | Cricket South Africa Has Announced 14-Player Squad For Two-Match Test Tour Of New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

Published Sat, Dec 30 2023 6:16 PM | Last Updated on Sat, Dec 30 2023 6:22 PM

Cricket South Africa Has Announced 14 Player Squad For Two Match Test Tour Of New Zealand - Sakshi

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా ఇవాళ (డిసెంబర్‌ 30) 14 మంది సభ్యుల టెస్ట్‌ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు నీల్‌ బ్రాండ్‌ నాయకత్వం వహించనుండగా.. సభ్యులంతా కొత్తవారు. ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో టీ20 లీగ్‌ (SA20) జరుగనుండటంతో న్యూజిలాండ్‌ సిరీస్‌ కోసం అనామక జట్టును ఎంపిక చేశారు. ఆ సమయంలో సీనియర్‌ ఆటగాళ్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉంటారు.

న్యూజిలాండ్‌ సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో డేవిడ్‌ బెడింగ్హమ్‌, జుబేర్‌ హంజా, డ్యుయన్‌ ఒలివియర్‌, కీగన్‌ పీటర్సన్‌, ఖాయా జోండో మాత్రమే కాస్తోకూస్తో సుపరిచిత ఆటగాళ్లు. న్యూజిలాండ్‌ పర్యటనలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు మౌంట్‌ మాంగనూయ్‌లో తొలి టెస్ట్‌.. అనంతరం ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు హ్యామిల్టన్‌లో రెండో టెస్ట్‌ జరుగనుంది. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు పూర్తి కాగా..  టెస్ట్‌ సిరీస్‌ నడుస్తుంది. రెండు మ్యాచ్‌ల  ఈ టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓటమిపాలుకాగా.. రెండో మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్‌ వేదికగా జరుగనుంది. ఈ పర్యటనలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: నీల్ బ్రాండ్ (కెప్టెన్‌), డేవిడ్‌ బెడింగ్హమ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్‌ హంజా, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డ్యుయన్‌ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్‌ పీటర్సన్, డేన్‌ పీడ్ట్, రేనార్డ్‌ వాన్‌ టోండర్, షాన్ వాన్‌ బెర్గ్, ఖాయా జోండో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement