సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు (SA20) సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. లీగ్ మూడో ఎడిషన్ (2025) ప్రారంభ తేదీ, ఫైనల్ మ్యాచ్ జరుగబోయే తేదీలను క్రికెట్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గ్రేమ్ స్మిత్ ప్రకటించారు.
SA20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభై, ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుందని స్మిత్ వెల్లడించాడు. పూర్తి షెడ్యూల్, ఆటగాళ్ల వేలం తదితర అంశాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్మిత్ తెలిపాడు.
కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆథ్వర్యంలో నడుస్తుంది. గడిచిన సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
దీనికి ముందు జరిగిన అరంగేట్రం సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై విజేతగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. ఈ లీగ్‌లోని ఫ్రాంచైలన్నీ వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్ల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి.
ఈ లీగ్‌లో అత్యధిక పరుగుల రికార్డు హెన్రిచ్ క్లాసెన్ (810 పరుగులు) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల ఘనత ఓట్నీల్ బార్ట్‌మన్‌కు (30 వికెట్లు) దక్కుతుంది.
కెప్టెన్ల విషయానికొస్తే.. ఎంఐ కేప్‌టౌన్‌కు కీరన్ పోలార్డ్ నాయకత్వం వహిస్తుండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు కేశవ్ మహారాజ్, జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు డెప్లెసిస్, పార్ల్ రాయల్స్‌కు డేవిడ్ మిల్లర్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు వేన్ పార్నెల్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌కు ఎయిడెన్ మార్క్రమ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment