టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో తలపడే టీమ్‌లో అన్రిచ్ నోర్జే, క్వింటన్ డికాక్‌లకు చోటు ఇవ్వడం గమనార్హం.
కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆన్రిచ్ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండగా.. వరల్డ్‌కప్-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు డికాక్.
అన్‌క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది!
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన ఇద్దరు అన్‌క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్ రికెల్టన్, ఒట్‌నీల్ బార్ట్‌మన్‌లు ఏకంగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు.
ఎంఐ కేప్‌టౌన్ తరఫున రికెల్టన్ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ తరఫున బరిలోకి దిగిన బార్ట్‌మన్ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్‌లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్ 1న ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. జూన్ 3న సౌతాఫ్రికా న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:
ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ఒట్‌నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొయోట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి.
Comments
Please login to add a commentAdd a comment