సౌతాఫ్రికా జట్టు 30 ఏళ్ల తమ వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. ప్రపంచకప్ టోర్నీల్లో ప్రొటీస్ ప్రస్తానం 1992 వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌తో మొదలు కాగా.. తొలిసారి ఆ జట్టు సెమీస్ గండం దాటింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేయడంతో సఫారీల మూడు దశాబ్దాల కల సారాకమైంది.
సౌతాఫ్రికా 1992, 1999, 2007, 2015, 2023 వన్డే ప్రపంచకప్ ఎడిషన్లలో సెమీఫైనల్ వరకు చేరినా ఫైనల్‌కు చేరలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో ఆరంభ ఎడిషన్ నుంచి పాల్గొనినా రెండు సార్లు (2009, 2024) మాత్రమే అతికష్టం మీద సెమీస్‌కు చేరింది.
బలాబలాల పరంగా సౌతాఫ్రికా పటిష్టమైన జట్టే అయినా.. క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు అత్యంత దురదృష్టవంతమైన జట్టుగా పేరుంది. ఇనేళ్ల ఆ జట్టు చరిత్రలో ప్రతిసారి బలమైన జట్టుతోనే బరిలోకి దిగినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఒక్క ఐసీసీ కూడా టైటిల్ (వరల్డ్‌కప్) గెలవలేకపోయింది.
ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాలన్న ఆ జట్టు కలను ఎయిడెన్ మార్క్రమ్ సార్దకం చేశాడు. సౌతాఫ్రికాను వరల్డ్‌కప్ (టీ20) ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా మార్క్రమ్ రికార్డుల్లోకెక్కాడు. మార్క్రమ్‌కు అండర్-19 విభాగంలో సౌతాఫ్రికాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గానూ రికార్ంది. మార్క్రమ్ సెంటిమెంట్ తమకు మరోసారి రిపీట్ అవుతుందని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ట్రినిడాడ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. రెండో సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment