![T20 World Cup 2024 IND vs SA Final: Heavy Rain In Match Venue Barbados](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/29/asafe.jpg.webp?itok=HAa-yUvR)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇదో చేదు వార్త. భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలనున్నాడు. మ్యాచ్‌కు వేదిక అయినా బార్బడోస్‌లో మ్యాచ్ జరిగే సమయానికి (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
HEAVY RAIN IN BARBADOS. 🌧️
- We've a Reserve Day for the Final. (Revsportz).pic.twitter.com/dmCnirETxv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2024
మ్యాచ్‌కు ముందు రోజు బార్బడోస్‌లో భారీ వర్షం పడింది. ఈ వర్షంతో బార్బడోస్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ముందు రోజు వర్షం పడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ షెడ్యూలైన రోజు రద్దైతే రిజ్వర్ డే రోజున కొనసాగిస్తారు. ఒకవేళ ఆ రోజు కూడా రద్దైతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు కప్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మ్యాచ్ జరగాలనే కోరుకుంటున్నారు. ఈ కప్ గెలిస్తే సౌతాఫ్రికాకు చిరకాల కోరిక నెరవేరనుండగా.. భారత్‌కు 13 ఏళ్ల కరువు తీరనుంది. సౌతాఫ్రికా ఇంత వరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్‌కు కూడా గెలవకపోగా.. భారత్ చివరిసారిగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది.
కాగా భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై ఘన విజయాలు సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇరు జట్లు అజేయ జట్లు అజేయ జట్లుగా ఫైనల్స్‌కు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment