T20 World cup final
-
ఎన్నేళ్లయిందో.. నిన్ను కలవడం సంతోషంగా ఉంది మహీ (ఫొటోలు)
-
T20 World Cup 2024 Final: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇదో చేదు వార్త. భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలనున్నాడు. మ్యాచ్‌కు వేదిక అయినా బార్బడోస్‌లో మ్యాచ్ జరిగే సమయానికి (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. HEAVY RAIN IN BARBADOS. 🌧️- We've a Reserve Day for the Final. (Revsportz).pic.twitter.com/dmCnirETxv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2024మ్యాచ్‌కు ముందు రోజు బార్బడోస్‌లో భారీ వర్షం పడింది. ఈ వర్షంతో బార్బడోస్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ముందు రోజు వర్షం పడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ షెడ్యూలైన రోజు రద్దైతే రిజ్వర్ డే రోజున కొనసాగిస్తారు. ఒకవేళ ఆ రోజు కూడా రద్దైతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు కప్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మ్యాచ్ జరగాలనే కోరుకుంటున్నారు. ఈ కప్ గెలిస్తే సౌతాఫ్రికాకు చిరకాల కోరిక నెరవేరనుండగా.. భారత్‌కు 13 ఏళ్ల కరువు తీరనుంది. సౌతాఫ్రికా ఇంత వరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్‌కు కూడా గెలవకపోగా.. భారత్ చివరిసారిగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది. కాగా భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై ఘన విజయాలు సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇరు జట్లు అజేయ జట్లు అజేయ జట్లుగా ఫైనల్స్‌కు చేరాయి. -
ప్రపంచకప్ ఫైనల్.. ఒక జట్టుకేమో 13 ఏళ్ల కరువు.. ఇంకో జట్టుకు చిరకాల కోరిక
టీ20 వరల్డ్‌కప్ 2024 తుది అంకానికి చేరింది. భారత్, సౌతాఫ్రికా జట్లు ఫైనల్స్ చేరాయి. రేపు (జూన్ 29) జరుగబోయే ఫైనల్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. బార్బడోస్ వేదికగా రేపు రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.టీమిండియాకు 13 ఏళ్ల కరువుటీమిండియా ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు అవుతుంది. 2011లో భారత్ చివరిసారి (వన్డే వరల్డ్‌కప్) ప్రపంచకప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.టీ20 వరల్డ్‌కప్ విషయానికొస్తే.. పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా 2007 అరంగేట్రం ఎడిషన్‌లో సాధించింది. ఆతర్వాత 2014లో ఫైనల్‌కు చేరినా శ్రీలంక చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.మళ్లీ ఇన్నాళ్లకు భారత్‌కు పొట్టి ప్రపంచకప్ గెలిచే అవకాశం వచ్చింది. రేపు జరుగబోయే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాను చిత్తు చేసి 13 ఏళ్ల కరువు తీర్చుకోవాలని భావిస్తుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. 1992లో తొలి వరల్డ్‌కప్ (వన్డే) ఆడిన సఫారీలు.. ఆతర్వాత 8 వన్డే ప్రపంచకప్‌లు, 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడితే తొలిసారి (2024) ఫైనల్‌కు అర్హత సాధించారు. 33 ఏళ్ల తమ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో లభించిన తొలి అవకాశాన్ని సఫారీలు అందిపుచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. వరల్డ్‌కప్ గెలవడం సౌతాఫ్రికన్ల చిరకాల కోరికగా మిగిలిపోయింది.ఇదిలా ఉంటే, ఎయిడెన్ మార్క్రమ్ నేతృత్వంలోని సౌతాఫ్రికా తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఆజేయ జట్టుగా కొనసాగతుంది. మరోవైపు భారత్.. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. భారత్ సైతం ఈ టోర్నీలో అజేయ జట్టుగా కొనసాగుతుంది. అయితే సూపర్-8లో భారత్ ఆడాల్సిన ఓ మ్యాచ్ (కెనడా) వర్షం కారణంగా రద్దైంది. -
T20 WC: సఫారీల చరిత్రలో తొలిసారి.. ఫైనల్లో ఆసీస్‌తో పోరుకు సై
ICC Womens T20 World Cup 2023- SA_W Vs Eng_ W: ఐసీసీ టోర్నీల్లో ఆరంభ దశలో రాణించడం, అసలు మ్యాచ్‌లకు వచ్చేసరికి బోర్లా పడటం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు అలవాటే. పురుషులతో పాటు మహిళల టీమ్‌లోనూ ఇది చాలాసార్లు కనిపించింది. ఇప్పుడు వీటికి ముగింపు పలుకుతూ దక్షిణాఫ్రికా మహిళల టీమ్ టి20 ప్రపంచకప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల, మహిళల జట్లను కలిపి చూస్తే ఏ ఫార్మాట్లోనైనా సఫారీ టీమ్(సీనియర్) ఐసీసీ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సొంతగడ్డపై లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓడిన తర్వాత కోలుకున్న టీమ్ ఇప్పుడు తుది సమరానికి సిద్ధమైంది. కేప్‌టౌన్‌లో శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. బ్రిట్స్ హాఫ్ సెంచరీ ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తజ్మీన్ బ్రిట్స్ (55 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), లౌరా వాల్వర్ట్ (44 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 82 బంతుల్లో 96 పరుగులు జోడించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. నాట్ సీవర్ (34 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. షబ్నిమ్ ఇస్మాయిల్ (3/27), అయబొంగ ఖాక (4/29) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. షబ్నిమ్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా, ఇంగ్లండ్ 6 పరుగులే చేయగలిగింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. కాగా భారత జట్టుతో జరిగిన తొలి సెమీస్‌లో గెలుపొంది ఆసీస్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ ట్వంటీ ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్
-
వరల్డ్ కప్ ఫైనల్ ఆ టీమ్స్ మధ్యే మిథాలీ రాజ్ సంచలన కామెంట్స్
-
ముగ్గురూ క్రికెటర్లే.. 34 ఏళ్ల క్రితం అద్భుతం చేసిన తండ్రి.. ఇప్పుడు కొడుకు కూడా
T20 World Cup 2021 Final: Mitchell Marsh Repeats His Father's Geoff Marsh World Cup Winner 34 Years Record: ఆస్ట్రేలియాకు తీరని కలగా ఉన్న టీ20 ప్రపంచకప్ ఎట్టకేలకు కంగూరూల సొంతమైంది. నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మొదటిసారి టైటిల్‌ను గెలిచింది. ఐదు సిరీస్ పరాజయాల నుంచి చాంపియన్‌గా నిలిచి ఆరోన్ ఫించ్ తమ సత్తా ఏమిటో నిరూపించుకుంది. ముఖ్యంగా ఫైనల్లో స్టార్ ఓపెపర్ డేవిడ్ వార్నర్ (53 పరుగులు), మిచెల్ మార్ష్(77) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 34 ఏళ్ల క్రితం తండ్రి.. ప్రధానంగా మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆసీస్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, 34 ఏళ్ల క్రితం మార్ష్ తండ్రి జెఫ్ మార్ష్ కూడా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తొలిసారిగా విజేతగా నిలవడంలో కీలకంగా వ్యహరించాడు. ప్రపంచకప్-1987 టోర్నీలో మొత్తంగా 428 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాదు... రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌గా మారిన జెఫ్ మార్ష్... ఆసీస్ 1999లో తమ రెండో టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. తండ్రిలాగే కొడుకు తండ్రి జెఫ్ మార్ష్ అడుగుజాడల్లోనే నడిచాడు మిచెల్ మార్ష్(mitchell marsh). గత ఆరు పర్యాయాలుగా అందని ద్రాక్షగా ఆసీస్‌ను ఊరిస్తున్న టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో మార్ష్ మొత్తంగా.. ఐదు ఇన్నింగ్స్‌లో మార్ష్ 185 పరుగులతో రాణించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జెఫ్ మార్ష్ మరో తనయుడు, మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ సైతం క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఇలా కుటుంబమంతా ఆసీస్ జట్టులో చోటు సంపాదించడమే కాకుండా పలు కీలక సమయాల్లో విజయాలు అందించడం విశేషం. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. -
ఆసీస్‌కు అందిన ద్రాక్ష
-
T20 WC Final: వావ్.. మిచెల్ మార్ష్ అరుదైన రికార్డు.. కేన్ మామ, వార్నర్ భాయ్ కూడా!
T20 WC 2021 Winner Australia: Mitchell Marsh Kane Williamson Warner Rare Record In Final: టీ20 వరల్డ్‌కప్ కొత్త చాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి సారి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీ-2021 కైవసం చేసుకుని సత్తా చాటింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్ మార్ష్(50 బంతుల్లో 77 పరుగులు, నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించి టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మార్ష్ తక్కువ బంతుల్లోనే.. ఇక నవంబరు 14 నాటి ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించారు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మార్ష్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. విలియమ్సన్ 32 బంతులు, వార్నర్ 34 బంతుల్లో ఈ రికార్డు సాధించారు. అంతకుముందు 2014లో ఇండియాతో ఫైనల్లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(33), 2016లో వెస్టిండీస్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(33) ఈ ఘనత అందుకున్నారు. ఇక ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: అంచనాలు లేకుండా బరిలోకి.. స్విచ్‌హిట్‌తో మ్యాక్సీ విన్నింగ్ షాట్ -
యూఏఈలోనే టి20 ప్రపంచకప్!
ముంబై: మన ‘పొట్టి’ ఆటలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అవుతోంది. కల్లోల కరోనా సమయంలో టి20 ప్రపంచకప్ కూడా భారత్‌లో ఆతిథ్యమిచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకే యూఏఈ సౌజన్యంతో ఐపీఎల్ లాగే మెగా ఈవెంట్‌ను కూడా అక్కడే నిర్వహించాలనే నిర్ణయానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాచారమిచ్చింది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 17న మొదలవుతుంది. నవంబర్ 14న జరిగే టైటిల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. సరిగ్గా ఐపీఎల్ ఫైనల్ (అక్టోబర్ 15) ముగిసిన రెండో రోజే మెగా ఈవెంట్ ప్రారంభవుతుంది. ఓ వార్త సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో జై షా మాట్లాడుతూ ‘దేశంలో కోవిడ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకునే టి20 ప్రపంచకప్‌ను భారత్ నుంచి యూఏఈకి తరలిస్తున్నాం. అన్ని అంశాలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతకే మా ప్రాధాన్యం ఉంటుంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటిస్తాం’ అని అన్నారు. 16 దేశాలు పాల్గొనే మెగా ఈవెంట్‌ను అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుంది. యూఏఈలో సరళమైన క్వారంటైన్ నిబంధనలు... పటిష్టమైన బబుల్, మహమ్మారి కూడా అదుపులో ఉండటం వల్ల విదేశీ ఆటగాళ్లందరూ పాల్గొంటారు. పొట్టి ఆటలో పోటీ రసవత్తరంగా సాగుతుంది. స్పాన్సర్ల ప్రయోజనాలు, బీసీసీఐ ఆర్థిక అవసరాలు కూడా నెరవేరుతాయి. అందుకే బోర్డు యూఏఈకే జై కొట్టింది. నిజానికి యూఏఈ బ్యాకప్ వేదికగా ఉంది. అక్కడే ఎందుకంటే... బోర్డు అంతా ఆలోచించే వేదికను యూఏఈకి తరలించింది. కరోనాతో పాటు ఇతరత్రా కారణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇన్నాళ్లు కోవిడ్ ఉధృతి తగ్గదా... మన దేశంలో మనం ఘనంగా నిర్వహించుకోలేమా అన్న ధీమాతో బోర్డు ఉండేది. కానీ డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు భారత ప్రభుత్వాన్నే కాదు... బీసీసీఐని కూడా కలవర పెడుతున్నాయి. ప్రమాదకరమైన ఈ వేరియంట్ వ్యాక్సిన్‌కు తలొగ్గుతుందా లేదా అనే కచ్చితమైన సమాచారం కూడా లేదు. ఇప్పటికే ఈ సీజన్ ఐపీఎల్లో బయో బబుల్ పేలడం... ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు భయాందోళనకు గురవడంతో అర్ధంతరంగా లీగ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు ప్రతిష్టకు పోయి భారత్‌లో నిర్వహించి ప్రమాదాన్ని తెచ్చుకోవడం... బుడగ పగిలి ప్రపంచకప్ కూడా వాయిదా పడితే పరువు కూడా పోతుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఎన్నో క్రికెట్ సిరీస్‌లపై ఇది పెనుప్రభావం చూపిస్తుంది. పైగా ఈసారి భారత ప్రభుత్వం 2016లో ఇచ్చిన పన్ను మినహాయింపు కూడా ఇవ్వలేదు. యూఏఈలో జరిపితే ఆ ప్రయోజనం కూడా బోర్డుకు దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించే వేదికను మారుస్తోంది. -
ఆ క్యాచ్ శ్రీశాంత్ వదిలేస్తే.. చెంప పగిలేది: హర్భజన్
ముంబై: భారత్ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్( 2007) ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠకరంగా సాగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తుదిపోరులో పేసర్ శ్రీశాంత్ అద్భుత క్యాచ్‌తో భారత్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యాచ్‌ను శ్రీశాంత్ వదిలేసి ఉంటే అతనిపై చేయిచేసుకునేవాడినని టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. ఇండియా టుడే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా కలగలేదని అభిప్రాయపడ్డాడు. ‘అదో అద్భుత సందర్భం. ఆ ప్రపంచకప్ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి.. 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా అనిపించలేదు. ఈ విజయంతో భారత్ చేరుకున్నప్పుడు ముంబై వీధుల్లో జనాలు నిలబడి స్వాగతం పలకడం ఇంకా కళ్ల ముందే కదలుతోంది. ఎయిర్పోర్ట్ నుంచి వాంఖెడే స్టేడియం చేరుకోవడానికి 6 గంట ల సమయం పట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీశాంత్ ఆ క్యాచ్‌ను అందుకోవడం నిజంగా లక్కే. మిస్బా తన షాట్‌ను సరిగ్గా ఆడలేదు. ఆ అవకాశాన్ని శ్రీశాంత్ అందిపుచ్చుకున్నాడు. ఒకవేళ శ్రీశాంత్ ఆ క్యాచ్ వదిలేసి ఉంటే.. ఈ టోర్నీ అనంతరం ఐపీఎల్లో జరిగిన ఘటన ముందే చోటుచేసుకునేది’ అని హర్భజన్ పేర్కొన్నాడు. 2008 ఐపీఎల్ సందర్భంగా హర్భజన్ సహనం కోల్పోయి శ్రీశాంత్‌పై మైదానంలోనే చేయిచేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠగా సాగిన నాటి ఫైనల్ మ్యాచ్ భారత్-పాక్ అభిమానులు మరిచిపోలేరు. ఇరు జట్లను కడదాక ఊరించిన విజయం చివరకు భారత్ వశం అయ్యింది. -
ధోనీ, సామ్యూల్స్.. ఇది సరికాదు గురూ!
కోల్‌కతా: ఆట అన్నాక కొన్నిసార్లు ఆనందం.. కొన్నిసార్లు నిర్వేదం సహజమే. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఓ అంతర్జాతీయ ఆటగాడిగా భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని.. హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత క్రికెటర్‌పై ఉంటుంది. వారి ప్రవర్తన హుందాగా ఉంటేనే ఈ జెంటల్మెన్ గేమ్‌కు వన్నె తెస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకుంటున్న యువతకు స్ఫూర్తిన్నిస్తుంది. కానీ టీ20 వరల్ కప్ సందర్భంగా భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ సామ్యూల్స్ మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు విమర్శలకు గురైంది. హుందాగా నడుచుకోవాల్సిన ఆటగాళ్లు అథమంగా ప్రవర్తించారనే విమర్శలు వినిపించాయి. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన తర్వాత ఓ ఆస్ట్రేలియా జర్నలిస్టుతో ధోనీ చాలా చిత్రంగా ప్రవర్తించాడు. తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన సామ్యూల్ ఫెర్రిస్తో 'వికెట్ కీపరైన కొడుకుగానీ, తమ్ముడుగానీ నీకు ఉన్నారా? నేను రిటైరవ్వడం వల్ల వారికేమైనా లబ్ధి చేకూరుతుందా' అంటూ ప్రశ్నించాడు. ఇదే ప్రశ్న భారతీయ విలేకరి అడుగుతాడని తాను అనుకున్నట్టు చెప్పాడు. ఆ విలేకరిని తన పక్కన కూచొబెట్టుకొని ప్రశ్నలు అడిగాడు. ఇది ఒకరకంగా తనకు నచ్చిన ప్రశ్నలు అడిగినందుకు అసహనం చూపడమే. దీనిపై ఫెర్రిస్ స్పందిస్తూ తన సహచర భారతీయ జర్నలిస్టుల తరఫున ఈసారి తాను ధోనీ కోపాన్ని చవిచూసినట్టు చెప్పాడు. అతడి ధోరణిని తప్పుబట్టాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో 66 బంతుల్లో 85 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలుచుకున్న వెస్టిండీస్ ఆటగాడు మార్లన్ సామ్యూల్స్ ఇంకా అహంభావాన్ని ప్రదర్శించాడు. విలేకరులతో మాట్లాడుతూ ఇటు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్, అటు ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్‌పై విమర్శలు గుప్పించిన అతను.. మీడియా మైకులు పెట్టే బల్లపై కాలు మీద కాలు ఉంచి దర్జాగా తానే బాస్ అన్న రీతిలో మాట్లాడాడు. టీవీ మైకులకు అతని కాళ్లు తాకుతున్నా.. అదేమీ పట్టించుకోకుండా దర్జా ఒలుకబోశాడు. అతని ప్రవర్తన మీడియా మిత్రులకు కొద్దిగా ఇబ్బంది కల్పించాడు. సామ్యూల్స్ ధోరణి, ధోనీ అసంబద్ధమైన ప్రశ్నలు మీడియాను అగౌరవపరిచేవనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బెన్ స్టోక్స్ గుండె పగిలింది!
ఆఖరి ఓవర్.. 6 బంతుల్లో 19 పరుగులు చేయాలి.. అందరిలో ఉత్కంఠ. కానీ ఆ ఉత్కంఠను పటాపంచలు చేస్తూ విండీస్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వెయిట్ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. బ్రాట్వెయిట్ సహా వెస్టిండీస్ ఆటగాళ్లంతా మైదానంలో ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. నృత్యాలు చేశారు. కానీ చివరి ఓవర్ వేసి ఊహించనిరీతిలో ఊచకోత ఎదుర్కొన్న బెన్ స్టోక్స్ మాత్రం షాక్ తిన్నాడు. కన్నీటిపర్యంతమవుతూ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా అతడి పరిస్థితి చూసిన వారికి బాధేసింది. టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత మెరుగ్గా బౌలింగ్ చేస్తూ ఇంగ్లండ్ జట్టుకు విజయాలు అందించిన బెన్ స్టోక్ ఫైనల్ లో మాత్రం ఆ మ్యాజిక్ చూపలేకపోయాడు. దీనిపై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. 'ఇది సహజం. అతను పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాడు. ఈ ప్రభావం అతనిపై కొన్ని రోజులు ఉంటుంది. అతడి బాధను మేము కూడా పంచుకుంటున్నాం. అతని ఓదార్చి ఉండవచ్చని మీరు చెప్పవచ్చు. కానీ అది వినే స్థితిలో కూడా అతడు లేడు' అని అన్నాడు. క్రికెట్ అనేది అత్యంత క్రూరమైన ఆట అని, ఒకానొక దశలో విండీస్ జట్టును కట్టడి చేసినట్టు తాము భావించినప్పటికీ చివరికి వచ్చేసరికి ఊహించనిరీతిలో ఆ జట్టు విజయం సాధించిందని, క్రికెట్లో ఏదైనా జరుగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాడు. ఫైనల్లో పరాయజానికి బెన్ స్టోక్‌ను నిందించరాదని, ఫైనల్ వరకు తమ జట్టు వచ్చినందుకు తాను గర్విస్తున్నానని, తన జట్టు ఆటతీరు పట్ల కూడా తనకు గర్వంగా ఉందని చెప్పాడు.