India vs New Zealand 3rd T20: Sanju Samson, Umran Malik to get a chance? - Sakshi
Sakshi News home page

IND vs NZ: గెలిస్తే... సిరీస్‌ మన చేతికి.. సంజూ సామ్సన్‌, యువ పేసర్‌కు అవకాశం?

Published Tue, Nov 22 2022 6:18 AM | Last Updated on Tue, Nov 22 2022 9:10 AM

Final match between India vs New Zealand 22 Nov 2022 - Sakshi

నేపియర్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో టి20 సిరీస్‌ గెలుపే లక్ష్యంగా టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది. మంగళవారం ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టి20 జరుగుతుంది. ఇదివరకే రెండో మ్యాచ్‌ గెలిచిన భారత్‌ 1–0తో ఆధిక్యంలో ఉండగా.. ఇదే ఉత్సాహంతో ఈ మ్యాచ్‌ కూడా గెలిచి 2–0తో కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది.

మ్యాచ్‌ ఓడినా సిరీస్‌ పోయేదిలేదు కాబట్టి తుదిజట్టులో యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌తో పాటు బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌కు అవకాశమివ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. మరోవైపు సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్‌ కీలకమైన మ్యాచ్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ లేకుండా బరిలోకి దిగుతోంది. దాంతో సీనియర్‌ సీమర్‌ సౌతీ సారథ్యం వహిస్తాడు. నేపియర్‌ పిచ్‌ బ్యాటింగ్‌ పిచ్‌ కాగా... మ్యాచ్‌కు వానముప్పు పొంచి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement