న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా భారత సీనియర్ మహిళల హాకీ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈనెల 14 నుంచి 20 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడే భారత జట్టును గురువారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని ఎతిమరపు జట్టులో రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఇటీవలే చిలీలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ రెండో రౌండ్ టోర్నీలో ‘ఉత్తమ గోల్‌కీపర్’ పురస్కారాన్ని గెల్చుకున్న సవిత తొలి గోల్‌కీపర్‌గా వ్యవహరించనుంది. 20 మంది సభ్యులుగల జట్టుకు రాణి రాంపాల్ సారథ్యం వహించనుంది. సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లు వరుసగా ఈనెల 14, 16, 17, 19, 20వ తేదీల్లో జరుగుతాయి.
భారత మహిళల జట్టు: సవిత, రజని ఎతిమరపు (గోల్‌కీపర్లు), రాణి(కెప్టెన్), సుశీలా(వైస్ కెప్టెన్), దీప్ గ్రేస్ , ఉదిత, సునీతా , గుర్జీత్ కౌర్, నమిత, రీతూ రాణి, లిలిమా, నవ్‌జ్యోత్, మోనిక, రేణుక , నిక్కీ , రీనా ఖోకర్, వందన , ప్రీతి దూబే, సోనిక, అనూపా బార్లా.