న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం దక్కకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరుపు రజనికి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆడే ఛాన్స్ లభించింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ) గురువారం ప్రకటించిన భారత మహిళల హాకీ జట్టులో గోల్‌కీపర్ రజనిని ఎంపిక చేశారు.
అమ్మాయిల ప్రపంచకప్ హాకీ ముగిసిన 11 రోజుల వ్యవధిలోనే బర్మింగ్‌హామ్ ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ గేమ్స్ మొదలవుతాయి. అయితే ఈ జట్టు కోసం పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఫిట్‌నెస్ లేని స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఈ టోర్నీకి కూడా దూరమవగా, మూడు మార్పులతో కామన్వెల్త్ జట్టును ఎంపిక చేశారు.
భారత మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజనీ ఎటిమార్పు, దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెపఎటన్), గుర్జిత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను పుఖ్రంబం, మోనిక, నేహా, జ్యోతి, నవజోత్ కౌర్, సలీమా టేరియా, వందన కటరియా , లాల్‌రెమ్సియామి, నవనీత్ కౌర్, షర్మిలా దేవి, సంగీత కుమారి
చదవండి: FIH Womens Hockey World Cup: ‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్‌కు..
Comments
Please login to add a commentAdd a comment