Womens hockey team
-
‘కామన్వెల్త్’ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం దక్కకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరుపు రజనికి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆడే ఛాన్స్ లభించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) గురువారం ప్రకటించిన భారత మహిళల హాకీ జట్టులో గోల్‌కీపర్ రజనిని ఎంపిక చేశారు. అమ్మాయిల ప్రపంచకప్ హాకీ ముగిసిన 11 రోజుల వ్యవధిలోనే బర్మింగ్‌హామ్ ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ గేమ్స్ మొదలవుతాయి. అయితే ఈ జట్టు కోసం పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఫిట్నెస్ లేని స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఈ టోర్నీకి కూడా దూరమవగా, మూడు మార్పులతో కామన్వెల్త్ జట్టును ఎంపిక చేశారు. భారత మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజనీ ఎటిమార్పు, దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెపఎటన్), గుర్జిత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను పుఖ్రంబం, మోనిక, నేహా, జ్యోతి, నవజోత్ కౌర్, సలీమా టేరియా, వందన కటరియా , లాల్రెమ్సియామి, నవనీత్ కౌర్, షర్మిలా దేవి, సంగీత కుమారి చదవండి: FIH Womens Hockey World Cup: ‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్‌కు.. -
అరంగేట్రంలోనే అదరగొట్టారు.. చైనాకు షాకిచ్చిన భారత అమ్మాయిలు
FIH Pro League 2021-22: ఒమన్ వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్(అంతర్జాతీయ హాకీ సమాఖ్య) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టుకు శుభారంభం లభించింది. సోమవారం చైనాను 7-1 గోల్స్ తేడాతో చిత్తుగా ఓడించిన భారత మహిళా జట్టు.. ప్రో లీగ్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టింది. సుశీల చాను(47వ నిమిషం, 52వ నిమిషం) రెండు గోల్స్‌తో రాణించగా.. నవనీత్ కౌర్, నేహా, వందనా కటారియా, షర్మిలా దేవీ, గుర్జీత్ కౌర్ తలో గోల్ చేశారు. చైనా తరఫున జు డెంగ్ 43వ నిమిషంలో గోల్ సాధించింది. ఈ విజయంతో భారత్ ప్రో లీగ్ 2021-22 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. After our resounding win over 🇨🇳, we have jumped up to the 3️⃣rd place on the FIH Hockey Pro League 2021/22 (Women) points table! 👊#IndiaKaGame pic.twitter.com/yP8DMrX4uf — Hockey India (@TheHockeyIndia) January 31, 2022 చదవండి: విండీస్‌తో సిరీస్‌కు రెడీ.. బయో బబుల్‌లోకి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు -
ఆసియా కప్‌లో భారత్ శుభారంభం..
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన పూల్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్ తేడాతో మలేసియాపై ఘనవిజయం సాధించింది. కెరీర్లో 250వ మ్యాచ్ ఆడిన వందన కటారియా రెండు గోల్స్ సాధించింది. నవనీత్ కౌర్, షర్మిలా దేవి కూడా రెండేసి గోల్స్ చేయగా... దీప్ గ్రేస్ ఎక్కా, మోనిక, లాల్రెమ్సియామి ఒక్కో గోల్ సాధించారు. చదవండి: పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు.. ఆస్ట్రేలియా పర్యటన ఇక..! -
‘కరోనా’తో తప్పుకున్న భారత్!
డాంఘె (కొరియా): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత హాకీ జట్టును కరోనా కారణంగా టోర్నీ నుంచి తప్పిస్తున్నట్లు ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్ఎఫ్) గురువారం ప్రకటించింది. జట్టులో ఒకరికి కరోనా సోకడంతో ఏహెచ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో మ్యాచ్‌కు ముందు భారత జట్టులో ఒకరికి కరోనా సోకడంతో ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇదే కారణంగా మలేసియా కూడా టోర్నీ నుంచి విరమించుకుంది. చదవండి: Ravi Shastri: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే.. -
కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకున్న భారత జట్లు
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ క్రీడల బరి నుంచి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తప్పుకున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానంద్రో నింగోంబం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కామన్వెల్త్ గేమ్స్ బరి నుంచి తప్పుకున్న భారత జట్లు.. ఆసియా క్రీడలపై దృష్టిసారించనున్నాయని నింగోంబం తెలిపారు. ఆసియా క్రీడల్లో చక్కని ప్రదర్శన కనబరిస్తే 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు కానుందని, అందుకే కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, 2022 జులైలో కామన్వెల్త్ క్రీడలు, ఆగస్టులో ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రాంక్ చేసి భార్యను బెదరగొట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. -
షారుక్ ట్వీట్ వైరల్: లేటైనా నో ప్రాబ్లం.. వచ్చేటప్పుడు గోల్డ్‌తో రండి
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతమే చేసింది. క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను కట్టడి చేసి సెమీ ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా సెమీస్ చేరింది. తాజాగా ఈ విజయంపై బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. అంచనాలను తారుమారు చేస్తూ భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మహిళల జట్టుపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. చారిత్రాత్మక సందర్భాన్ని కోచ్ సోయెర్డ్ మరీన్ రియల్ లైఫ్ చక్ దే ఇండియాతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమా కూడా మహిళల హాకీ కథాంశంతోనే తెరకెక్కింది కనుక. ఈ ఆనందాన్నీ కోచ్ సోషల్‌మీడియాలో పంచుకుంటూ.. సారీ ఫ్యామిలీ.. నేను రావడం ఆలస్యమవుతుందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రంలో కోచ్ కబీర్‌ఖాన్ పాత్ర పోషించిన షారుక్ దీనికి స్పందిస్తూ.. సరే ఏం ప్రాబ్లం లేదు. మీరు వచ్చేటప్పుడు భారత్‌లోని లక్షల కుటుంబాల కోసం గోల్డ్ తీసుకురండి చాలు.. మీ మాజీ కోచ్ కబీర్ ఖాన్ అని రిప్లై ఇచ్చాడు. కాగా ఉత్కంఠ సాగుతున్న మ్యాచ్‌లో గుర్జీత్ సంచలన గోల్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. Haan haan no problem. Just bring some Gold on your way back….for a billion family members. This time Dhanteras is also on 2nd Nov. From: Ex-coach Kabir Khan. https://t.co/QcnqbtLVGX — Shah Rukh Khan (@iamsrk) August 2, 2021 -
చిలీ పర్యటన అజేయం..
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు చిలీ పర్యటనను అజేయంగా ముగించింది. సీనియర్ చిలీ జట్టుతో సాంటియాగోలో సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలుపొందింది. బ్యూటీ డుంగ్‌డుంగ్ (6వ ని.లో, 26వ ని.లో) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. చిలీ తరఫున 40వ నిమిషంలో ఫ్రాన్సిస్కా టాలా ఏకైక గోల్ సాధించింది. ఈ పర్యటనలో ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. మరోవైపు అర్జెంటీనా పర్యటనలో ఉన్న భారత సీనియర్ మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. అర్జెంటీనా ‘బి’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున సలీమా (6వ ని.లో), గుర్జీత్ కౌర్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు మరో గెలుపు
చిలీ సీనియర్ మహిళల జట్టుపై భారత జూనియర్ మహిళల హాకీ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. సాంటియాగోలో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఓటమి ఎరుగని భారత జూనియర్లు ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో 2–0 గోల్స్ తేడాతో చిలీ సీనియర్ జట్టుపై విజయం సాధించారు. తొలి 3 క్వార్టర్లలో హోరాహోరీ పోరాటం సాగగా... చివరిదైన నాలుగో క్వార్టర్లో భారత్ నేర్పుగా గోల్స్ చేసింది. తొలుత సంగీత కుమారి 48వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించింది. తర్వాత 56వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను సుష్మా కుమారి గోల్‌గా మలిచింది. ఈ మ్యాచ్‌లో చిలీ జట్టుకు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా భారత డిఫెన్స్ సమర్థంగా వాటిని నిలువరించింది. -
భారత మహిళల హాకీ జట్టు విరాళం రూ. 20 లక్షలు
బెంగళూరు: కరోనాపై పోరాటం కోసం భారత మహిళల హాకీ జట్టు సహాయం అందించింది. 18 రోజుల పాటు ఫిట్నెస్ సవాళ్లతో సేకరించిన రూ.20 లక్షలను... కరోనా బాధితులకు సాయపడుతున్న ఢిల్లీకి చెందిన ఎన్జీఓ సంస్థ ఉదయ్ ఫౌండేషన్‌కు అందజేసింది. ఆ సంస్థ ఈ డబ్బును వలస కూలీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వారి కోసం ఉపయోగించనుంది. విరాళాలు సేకరించడానికి భారత హాకీ ప్లేయర్లు రోజుకు ఒకరు చొప్పున సామాజిక మాధ్యమంలో ఒక ఫిట్నెస్ చాలెంజ్‌ను విసిరి... ఆ చాలెంజ్‌ను స్వీకరించవలసినదిగా 10 మందిని నామినేట్ చేసేవారు. చాలెంజ్‌ను స్వీకరించిన ఆ పది మంది రూ.100 చొప్పున విరాళంగా ఇచ్చేవారు. అలా ఈ చాలెంజ్ మే 3వ తేదీ వరకు సాగింది. ‘మంచి పనిని ఆదరించడంతో పాటు అందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ మహిళల హాకీ జట్టు తరఫున కృతజ్ఞతలు’ అని జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ పేర్కొంది. -
న్యూజీలాండ్‌తో తలపడనున్న భారత్
టోక్యో : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తమ మొదటి మ్యాచ్‌ను న్యూజీలాండ్, నెదర్లాండ్స్‌తో ఆడనున్నాయి. ఈ మేరకు ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఆడే షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. ఇందులో భాగంగా పురుషుల జట్టు గ్రూప్-ఏలో భాగంగా న్యూజీలాండ్‌తో(జూలై 25న), ఎనిమిది సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో (జూలై 26న), స్పెయిన్‌తో(జూలై 28న), డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో(జూలై 30న), ఇక చివరి లీగ్ మ్యాచ్‌గా జపాన్‌తో జూలై 31 న తలపడనుంది. మరోవైపు మహిళల జట్టు గ్రూప్-ఏ లో తమ మొదటి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో జూలై 25 న తలపడనుంది. తర్వాత వరుసగా జర్మనీ (జూలై 27న), బ్రిటన్(జూలై 29న), ఐర్లాండ్ (జూలై 31న), దక్షిణాఫ్రికా(ఆగస్టు 1న) ఆడనుంది. అయితే ఒలింపిక్ గోల్డ్ మెడల్ కోసం ఆగస్టు 6న పురుషుల జట్టు, ఆగస్టు 7న మహిళల జట్టు ఆడనున్నట్లు అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ వెల్లడించింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌కు భారత పురుషుల జట్టు అర్హత సాధించేందుకు భువనేశ్వర్‌లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో రష్యాను 11-3 తేడాతో చిత్తుగా ఓడించింది. మరోవైపు ఒలింపిక్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో మహిళల జట్టు అమెరికాను 6-5 తేడాతో ఓడించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. -
చైనా చిందేసింది
చాంగ్జౌ: ఓటమి అంచుల నుంచి గట్టెక్కి విజయం రుచి చూస్తూ చైనా మహిళల హాకీ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. బెల్జియంతో శనివారం జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో చైనా విజయం సాధించి ఈ ఘనత సాధించింది. తొలి మ్యాచ్‌లో చైనా 0–2తో ఓడిపోయింది. అయితే రెండో మ్యాచ్‌ను ఆ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా... చైనా అద్భుతం చేసింది. 56వ, 57వ నిమిషాల్లో ఒక్కో గోల్ చేసి స్కోరును సమం చేసింది. మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. దాంతో నిర్ణీత రెండు మ్యాచ్‌ల తర్వాత గోల్స్ సగటులో చైనా, బెల్జియం 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్లో రెండు జట్లు ఐదేసి షాట్లు తీసుకున్నా... ఇక్కడా స్కోరు 1–1తో సమమైంది. దాంతో సడెన్‌డెత్ నిర్వహించారు. సడెన్‌డెత్‌లో తొలి షాట్‌ను చైనా క్రీడాకారిణి లీ జియాకి బంతిని లక్ష్యానికి చేర్చగా... బెల్జియం క్రీడాకారిణి అలిక్స్ జెనీర్స్ కొట్టిన షాట్ బయటకు వెళ్లిపోవడంతో చైనా 2–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. వరుసగా ఆరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి సంబరాల్లో మునిగి తేలింది. -
భారత జూనియర్ అమ్మాయిల గెలుపు
న్యూఢిల్లీ: భారత జూనియర్ హాకీ అమ్మాయిలు ఐర్లాండ్ పర్యటనను ఘనంగా ముగించారు. మంగళవారం ముగిసిన కాంటర్ ఫ్రిట్జ్‌గెరాల్డ్ అండర్–21 అంతర్జాతీయ నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత అమ్మాయిలు... ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించారు. లాల్రిండికా, ఇషికా చౌదరీ, ముంతాజ్ తలా ఓ గోల్ సాధించడంతో భారత్ 3–1తో ఐర్లాండ్‌పై గెలుపొందింది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు అటాకింగ్ బదులుగా డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్లో జోరు పెంచిన భారత్ అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. లాల్రిండికా పెనాల్టీని గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే క్వార్టర్లో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను ఇషికా చౌదరీ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ దశలో పెద్ద ఎత్తున వచ్చిన వర్షం వల్ల ఆటకు ఆటంకం కలిగింది. విరామం తర్వాత పుంజుకున్న ఐర్లాండ్ దూకుడుగా ఆడింది. అయితే నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలను ఐర్లాండ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత గోల్ కీపర్ ఖుష్బూ వారి ప్రయత్నాలను విఫలం చేసింది. తర్వాత లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన ఐర్లాండ్ గోల్ ఖాతా తెరిచింది. కానీ వెంటనే ముంతాజ్ చేసిన గోల్‌తో భారత్ పటిష్ట స్థితిలో నిలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
మహిళల హాకీలో భారత్ చేజారిన స్వర్ణం
కబడ్డీలో స్వర్ణాలకు గండిపడినా... వెయిట్‌లిఫ్టింగ్‌లో వెనుకబడినా... హాకీలో పసిడి అందినట్టే అంది చేజారినా... 18వ ఏషియాడ్ భారత్‌కు మరుపురానిదిగానే మిగిలిపోనుంది. అథ్లెటిక్స్‌లో అనూహ్య ప్రదర్శనలు... స్క్వాష్‌లో సంచలనాలు... షూటింగ్లో అదిరిపోయే గురితో... పతకాల పట్టికలో మన దేశం ఇప్పటికే 2014 ఇంచియోన్ క్రీడల ప్రదర్శనను అధిగమించింది. 13వ రోజు శుక్రవారం మన ఖాతాలో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు జమయ్యాయి. దాంతో మొత్తం 65 పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. 2010 గ్వాంగ్జూ ఏషియాడ్‌లో భారత్ అత్యధికంగా 65 పతకాలు సాధించగా... జకార్తా క్రీడల్లో ఆ రికార్డు కూడా నేడు తెరమరుగు కానుంది. జకార్తా: భారత హాకీ జట్ల ఏషియాడ్ ప్రయాణం స్వర్ణం లేకుండానే ముగిసింది. గురువారం పురుషుల జట్టు సెమీఫైనల్లో ఓడి నిరాశపర్చగా... శుక్రవారం మహిళల బృందం ఫైనల్లో 1–2తో జపాన్ చేతిలో పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. ఒకటికి రెండు అవకాశాలు చేజార్చుకుని... చరిత్రలో నిలిచే రికార్డును కోల్పోయింది. తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్ అర్హత కోసం క్వాలిఫయింగ్ టోర్నీలు ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. సమం చేసి... చేజార్చుకుని మహిళల హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 9వ స్థానంలో ఉంటే జపాన్ ర్యాంక్ 14. దీనికి తగ్గట్లే తుది సమరంలో ఫేవరెట్‌గా బరిలో దిగింది రాణి రాంపాల్ సేన. అయితే, ఆటలో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోయింది. దూకుడైన ఆరంభానికి తొలి క్వార్టర్‌లోనే చక్కటి అవకాశాలు దక్కినా ఫినిషింగ్ లోపంతో గోల్స్‌గా మలచలేకపోయింది. ప్రత్యర్థి శిబిరంలోకి చొచ్చుకెళ్లి 4వ నిమిషంలో కెప్టెన్ రాణి ఇచ్చిన పాస్‌ను నవనీత్ కౌర్ వృథా చేసింది. 8వ నిమిషంలో జపాన్‌కూ గోల్ అవకాశం దక్కినా కీపర్ సవిత అడ్డుకుంది. 10వ నిమిషంలో నవనీత్ పెనాల్టీ కార్నర్ పాస్ ఇవ్వగా గుర్జీత్ కౌర్ స్కోరుగా మలచలేకపోయింది. అయితే, మినామి షిమిజు పెనాల్టీ కార్నర్‌ను గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో జపాన్‌కు 11వ నిమిషంలో ఫలితం దక్కింది. రెండో క్వార్టర్లో దాడిని పెంచిన భారత్‌కు... నేహా గోయల్ (25వ ని.లో) ఫీల్డ్ గోల్ అందించింది. ఈ భాగంలో బంతి ఎక్కువ శాతం మన జట్టు నియంత్రణలోనే ఉండటంతో పాటు పలు అవకాశాలు వచ్చాయి. అయితే, ఉదిత, వందన షాట్లను ప్రత్యర్థి కీపర్ సమర్థంగా నిలువరించింది. మరోవైపు మొటొమొరి కవాముర (44వ ని.లో) పెనాల్టీ కార్నర్‌ను రివర్స్ హిట్‌తో నెట్లోకి పంపి జపాన్‌కు ఆధిక్యం అందించింది. చివరి పది నిమిషాల్లో భారత్ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినా... ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఇదే సమయంలో జపాన్ వ్యూహాత్మకంగా ఆడుతూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా కీపర్ సవితను ఉపసంహరించుకున్న భారత్‌కు చివరి 40 సెకన్లలో రెండు అవకాశాలొచ్చాయి. కానీ... అవేమీ స్కోరుగా మారలేదు. తొలిసారిగా 1982 ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గిన భారత మహిళలు... ఈసారి కూడా ఆ ఘనతను అందుకోలేకపోయారు. 1998 తర్వాత భారత జట్టు ఈసారే ఏషియాడ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. టీటీలో కథ ముగిసింది... ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత్ కథ ముగిసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శరత్ 7–11, 11–9, 10–12, 16–14, 9–11తో చి యున్ చునాగ్ (చైనీస్ తైపీ) చేతిలో, సత్యన్ 11–9, 4–11, 9–11, 6–11, 10–12తో మట్సుడైరా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మనికా బాత్రా 2–11, 8–11, 8–11, 11–6, 4–11తో వాంగ్ మన్యు (చైనా) చేతిలో ఓడింది. ఒక్క విజయం లేకుండానే: ఆసియా క్రీడల్లో భారత మహిళల వాలీబాల్ జట్టు ఒక్క విజయం సాధించకుండానే తమ పోరాటాన్ని ముగించింది. 9–10 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 21–25, 16–25, 15–25తో చైనీస్ తైపీ చేతిలో ఓడింది. జూడోలో నిరాశ: పురుషుల 100 కేజీల జూడో ప్రిక్వార్టర్స్‌లో అవతార్ సింగ్ 1–10తో ఇవాన్ రామరెన్కో (యూఏఈ) చేతిలో ఓడగా... మహిళల ప్లస్ 78 కేజీల క్వార్టర్ ఫైనల్లో అకిరా సోనె (జపాన్) చేతిలో రజ్విందర్ కౌర్ పరాజయం పాలైంది. -
మహిళల హాకీ సెమీస్‌లో భారత్
జకార్తా: ఆట ఆఖరు దశలో మూడు నిమిషాల్లో మూడు గోల్స్ కొట్టి... ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. శనివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–1తో జయభేరి మోగించింది. నవనీత్ కౌర్ 16వ నిమిషంలోనే గోల్ కొట్టి భారత్ ఖాతా తెరిచింది. మరికొద్దిసేపటికే యురియ్ లీ (20వ ని.) పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచడంతో స్కోరు సమమైంది. తర్వాత చాలాసేపటి వరకు ఇరు జట్ల నుంచి గోల్స్ నమోదు కాలేదు. అయితే... 54, 55 నిమిషాల్లో పెనాల్టీ కార్నర్లను నెట్లోకి పంపి గుర్జీత్ కౌర్ భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. వందనా కటారియా (56వ ని.) ఫీల్డ్ గోల్‌తో ప్రత్యర్థికి అందనంత ఎత్తున జట్టును నిలిపింది. పూల్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్ లనూ గెలిచిన భారత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ తలపడనుంది. క్వార్టర్స్‌లో పవిత్ర భారత మహిళా బాక్సర్ పవిత్ర (60 కేజీలు) ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పవిత్ర 10–8తో పర్వీన్ రుక్సానా (పాకిస్తాన్)పై విజయం సాధించింది. బౌట్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన పవిత్ర ప్రత్యర్థిని రెండు సార్లు నాక్డౌన్ చేయడంతో రిఫరీ ఆమెను విజేతగా ప్రకటించారు. ఆర్చరీలో అదే కథ ఆర్చరీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మరోసారి తడబడ్డారు. రికర్వ్ విభాగంలో శనివారం జరిగిన పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో భారత జట్లు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాయి. జగదీశ్ చౌదరి, అతాను దాస్, విశ్వాస్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 1–5తో కొరియా చేతిలో ఓడగా... దీపిక, ప్రమీల, అంకితలతో కూడిన మహిళల బృందం 2–6తో చైనీస్ తైపీ చేతిలో ఓడింది. షూటింగ్ గురి తప్పింది పోటీలు మొదలైన తర్వాత వరుసగా ఆరు రోజులు కనీసం ఒక పతకమైనా నెగ్గిన భారత షూటర్లకు శనివారం ఒక్క పతకం కూడా దక్కలేదు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో బరిలో దిగిన 15 ఏళ్ల అనీశ్ క్వాలిఫయింగ్ రౌండ్లో 576 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మరో భారత షూటర్ శివమ్ శుక్లా 569 పాయింట్లతో 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత ఏప్రిల్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో అనీశ్ స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించాడు. కానీ అలాంటి ఫలితాన్ని ఆసియా క్రీడల్లో పునరావృతం చేయలేకపోయాడు. -
ఆసియా క్రీడలకు రజని
న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్లుగా భారత మహిళల హాకీ జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్‌కీపర్ ఇతిమరపు రజని తొలిసారి ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనుంది. ఆగస్టు, సెప్టెంబర్లలో ఇండోనేసియాలో జరిగే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టులో రజని రెండో గోల్‌కీపర్‌గా ఎంపికైంది. ఈ నెలలో లండన్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులోనూ ఈ చిత్తూరు జిల్లా క్రీడాకారిణికి స్థానం లభించింది. ఆసియా క్రీడల కోసం ప్రకటించిన 18 మంది సభ్యుల భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది. ఈ క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్‌కీపర్లు), దీప్ గ్రేస్ ఎక్కా, సునీత లాక్రా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మింజ్, మోనిక, ఉదిత, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, రాణి రాంపాల్, వందన కటారియా, లాల్రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్, నవ్‌జ్యోత్ కౌర్. -
భారత హాకీ జట్ల గోల్స్ వర్షం
బ్యాంకాక్: యూత్ ఒలింపిక్స్ కోసం జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత పురుషులు, మహిళల హాకీ జట్లు అసాధారణ ప్రదర్శనతో హోరెత్తించాయి. పురుషుల జట్టు 25–0తో ఆతిథ్య థాయ్‌లాండ్‌పై, మహిళల జట్టు 14–0తో సింగపూర్‌పై భారీ విజయాలు సాధించాయి. పూల్ ‘బి’లో జరిగిన మహిళల పోరులో సంగీత కుమారి (2, 8, 15, 17, 21, 28వ ని.) ఆరు గోల్స్ చేయగా, లాల్రేమిసియామి (7, 17, 21వ ని.) మూడు గోల్స్ చేసింది. మిగతా వారిలో ముంతాజ్, దీపిక చెరో 2 గోల్స్ చేయగా, ఇషికా చౌదరి ఒక గోల్ సాధించింది. పురుషుల విభాగంలో జరిగిన పోరులో భారత జట్టులో మొహమ్మద్ అలీషాన్ (4, 10, 17, 20, 25, 29వ ని.) ఆరు గోల్స్, రాహుల్ కుమార్ (2, 12, 18, 22, 23వ ని.) ఐదు గోల్స్‌తో చెలరేగారు. రవిచంద్ర మొయిరంగ్తెమ్ (10, 15, 20, 29వ ని.), కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్ (7, 9, 27, 28వ ని.) చెరో నాలుగు గోల్స్ చేశారు. గోల్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు గోల్ కొట్టడం విశేషం. నేడు జరిగే పోటీల్లో పురుషుల జట్టు జపాన్‌తో, మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడతాయి. -
భారత మహిళల హాకీ జట్టు ఓటమి
ప్యుకెకోహి (న్యూజిలాండ్): న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 1–4 తేడాతో కివీస్ చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున అనూపా బార్లా (31వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. న్యూజిలాండ్ జట్టుకు జోర్డాన్ గ్రాంట్ (13వ ని.లో), ఒలీవియా మెర్రీ (23వ ని.లో), రాచెల్ మెక్కాన్ (43వ ని.లో), దియానా రిచీ (55వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. -
న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా భారత సీనియర్ మహిళల హాకీ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈనెల 14 నుంచి 20 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడే భారత జట్టును గురువారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని ఎతిమరపు జట్టులో రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇటీవలే చిలీలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ రెండో రౌండ్ టోర్నీలో ‘ఉత్తమ గోల్‌కీపర్’ పురస్కారాన్ని గెల్చుకున్న సవిత తొలి గోల్‌కీపర్‌గా వ్యవహరించనుంది. 20 మంది సభ్యులుగల జట్టుకు రాణి రాంపాల్ సారథ్యం వహించనుంది. సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లు వరుసగా ఈనెల 14, 16, 17, 19, 20వ తేదీల్లో జరుగుతాయి. భారత మహిళల జట్టు: సవిత, రజని ఎతిమరపు (గోల్‌కీపర్లు), రాణి(కెప్టెన్), సుశీలా(వైస్ కెప్టెన్), దీప్ గ్రేస్ , ఉదిత, సునీతా , గుర్జీత్ కౌర్, నమిత, రీతూ రాణి, లిలిమా, నవ్‌జ్యోత్, మోనిక, రేణుక , నిక్కీ , రీనా ఖోకర్, వందన , ప్రీతి దూబే, సోనిక, అనూపా బార్లా. -
భారత్ 'హ్యాట్రిక్'
మన్హీమ్(అమెరికా):అమెరికా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1 తేడాతో కెనడాను ఓడించి టోర్నీలో 'హ్యాట్రిక్' విజయం సాధించింది. భారత మహిళల్లో పూనమ్ రాణి(19వ నిమిషం), రేణుకా యాదవ్(32వ నిమిషం), అనురాధా థాకోమ్(58వ నిమిషం)లో గోల్స్ సాధించి విజయంలో ముఖ్యభూమిక పోషించారు. భారత జట్టు ఐదో నిమిషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు డిఫెన్స్‌కే ఎక్కువ ప్రధాన్యత ఎటువంటి గోల్ నమోదు కాలేదు. అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే పూనమ్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. కాగా, ఆపై వెంటనే కెనడా క్రీడాకారిణి నటాలీ(21వ నిమిషం) గోల్ సాధించి స్కోరును సమం చేసింది. ఇక రెండో అర్ధభాగంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్ మలచడంలో రేణుకా విజయవంతం కావడంతో భారత్ కు 2-1 ఆధిక్యం దక్కింది. ఆ తరువాత భారత రక్షణశ్రేణి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కెనడా వెనుకబడిపోయింది. ఇక రెండు నిమిషాల్లో గేమ్ ముగుస్తుందనగా భారత క్రీడాకారిణి అనురాధ అద్భుతమైన గోల్ నమోదు చేసి జట్టు ఘన విజయంలో సాధించడంలో సహకరించింది. ఇది కెనడాపై భారత్ కు రెండో విజయం కాగా, అంతకుముందు అమెరికాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్..ఆ తరువాత అంచనాలు అందుకుంటూ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. -
భారత్‌కు తొలి విజయం
అమెరికాతో మహిళల హాకీ న్యూఢిల్లీ: నాలుగు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల హాకీ జట్టు త్వరగానే కోలుకుంది. అమెరికాతో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 2-1 తేడాతో నెగ్గింది. నేడు (శుక్రవారం) కెనడాతో భారత జట్టు తలపడుతుంది. తొలి క్వార్టర్లో హోరాహోరీ ప్రదర్శన ఎదురుకావడంతో ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే 19వ నిమిషంలో అమెరికా తొలి గోల్‌ను సాధించింది. ద్వితీయార్ధంలో విజృంభించిన భారత్‌కు 45వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించగా ప్రీతి దూబే గోల్ చేసింది. చివరి క్వార్టర్లోనూ అమెరికాపై ఒత్తిడి పెంచడంతో 55వ నిమిషంలో లిలిమా మింజ్ చేసిన గోల్‌తో విజయం ఖాయమైంది. -
విజయంతో ముగింపు
దక్షిణాఫ్రికాలో భారత మహిళల హాకీ జట్టు పర్యటన స్టెలెన్‌బోష్: దక్షిణాఫ్రికా పర్యటనను భారత మహిళల హాకీ జట్టు విజయంతో ముగించింది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున పూనమ్ రాణి రెండు గోల్స్ చేయగా... వందన కటారియా ఒక గోల్ సాధించింది. ఈ పర్యటనలో జర్మనీ, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్ జట్లతో భారత్ మ్యాచ్‌లు ఆడింది. జర్మనీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్ ఓడిపోయింది. -
సహాయక కోచ్‌గా రాణీ రాంపాల్
న్యూఢిల్లీ : జాతీయ మహిళల హాకీ జట్టు ఫార్వర్డ్ క్రీడాకారిణి రాణీ రాంపాల్‌ను భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) సహాయక కోచ్‌గా నియమించనున్నారు. కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్న రాణీ సేవలను మరింతగా ఉపయోగించుకోవాలనే భావనలో సాయ్ ఉంది. దీనికి తగ్గట్టుగా తమ నియామక నిబంధనలను సడలించి ఈ నిర్ణయం తీసుకోనున్నారు. 2010 ప్రపంచకప్‌లో కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తను భారత జట్టులో చోటు దక్కించుకుని వార్తల్లోకెక్కింది. అదే ఏడాది ఎఫ్ఐహెచ్ మహిళల యువ క్రీడాకారిణి అవార్డు కోసం నామినేట్ అయిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ‘ప్రస్తుత తరంలో రాణీ రాంపాల్ అత్యద్భుత క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు. ఇటీవలి వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు ఒలింపిక్ బెర్త్ దక్కించుకోవడంలోనూ కీలక పాత్ర పోషించింది. వర్ధమాన క్రీడాకారులకు తన సేవలు ఉపయోగపడితే మరింత మేలు చేకూరనుంది. అందుకే ఆమెకు ఈ పదవిని ఆఫర్ చేశాం’ అని సాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. శిక్షణ శిబిరాలు, టోర్నీలు లేని రోజుల్లో రాణీ రాంపాల్ ఈ బాధ్యతను తీసుకోనుంది. -
ఒలింపిక్ బెర్త్ కోసం...
యాంట్‌వర్ప్ (బెల్జియం): మహిళల హాకీ జట్టుకు సువర్ణావకాశం.. 1980 తర్వాత ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ఆడేందుకు కేవలం మరో అడుగు దూరంలో ఉంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో భాగంగా ఐదు, ఆరు స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో భారత జట్టు నేడు (శనివారం) జపాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు బెర్త్ ఖరారవుతుంది. ఓడితే పూర్తిగా ఒలింపిక్స్ అవకాశాలు లేవని చెప్పలేం. కానీ అనేక ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది. మరోవైపు మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్స్ నెదర్లాండ్స్, దక్షిణ కొరియా మధ్య నేడు టైటిల్ పోరు జరుగనుంది. సెమీస్‌లో డచ్ జట్టు 5-1తో ఆసీస్‌పై, కొరియా 4-2తో షూటవుట్‌లో కివీస్‌పై నెగ్గింది. -
రీతూ రాణికే పగ్గాలు
ఆసియా క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో కెప్టెన్‌గా వ్యవహరించిన రీతూ రాణి సారథ్యంలోనే భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లోనూ బరిలోకి దిగనుంది. బీపీ గోవిందా, హర్బీందర్ సింగ్, సురీందర్ కౌర్, హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఓల్ట్‌మన్స్, చీఫ్ కోచ్ నీల్ హవ్గుడ్లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఈనెల 13న ఇంచియోన్కు బయలుదేరుతుంది. ఆసియా క్రీడలు ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు జరుగుతాయి. కామన్వెల్త్ గేమ్స్ కంటే మరింత మెరుగైన స్థానం సాధించాలన్న లక్ష్యంతో ఆమెను ఎంపిక చేశామని ప్యానెల్ తెలిపింది. జట్టు: రీతూ రాణి (కెప్టెన్, మిడ్ ఫీల్డర్), సవిత (గోల్‌కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, సునీతా లక్రా, నమితా టోపో, జస్ప్రీత్ కౌర్, సుశీలా చాను, మోనిక (డిఫెండర్లు), లిలిమా మిన్జ్, అమన్‌దీప్ కౌర్, చంచన్ దేవి (మిడ్ ఫీల్డర్లు), రాణి రాంపాల్, పూనమ్ రాణి, వందన కటారియా, నవజ్యోత్ కౌర్ (ఫార్వర్డులు). -
సౌందర్యకు చోటు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యెండల సౌందర్య భారత మహిళల హాకీ జట్టుకు ఎంపికైంది. జపాన్‌లో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి 18 మంది సభ్యుల భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. ఈ టోర్నీ కకమిగహరలో వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరుగుతుంది. ఇందులో భారత్‌తో పాటు చైనా, జపాన్, మలేసియాలు తలపడుతున్నాయి. మిడ్‌ఫీల్డర్ రీతూ రాణి జట్టుకు సారథ్యం వహించనుంది. గత నెల మలేసియాలో జరిగిన ఆసియా కప్‌లో భారత్ రజత పతకం గెలిచింది. జట్టు: రీతూ రాణి (కెప్టెన్), యెండల సౌందర్య, నమిత, చంచన్ దేవి, వందన, రాణి, పూనమ్ రాణి, రితుష్య ఆర్య, దీప్గ్రేస్ ఏక్కా, దీపిక, కిరణ్‌దీప్ కౌర్, సునీత లక్రా, సుశీల చాను, మోనిక, మంజీత్ కౌర్, అమన్‌దీప్, సానరిక్ చాను, సందీప్ కౌర్, లిలీ మింజ్, లిలీ చాను, అనురాధా దేవి, అనూప బార్లా.